iDreamPost

సెమీస్​కు ముందు ఇంగ్లండ్​కు హార్దిక్ వార్నింగ్.. ఇక దబిడిదిబిడే!

  • Published Jun 25, 2024 | 10:00 PMUpdated Jun 25, 2024 | 10:08 PM

పొట్టి కప్పులో ఫేవరెట్ ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ గడప తొక్కింది రోహిత్ సేన. నాకౌట్ ఫైట్​లో ఇంగ్లండ్​ను ఫేస్ చేయనుంది భారత్. ఈ తరుణంలో వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

పొట్టి కప్పులో ఫేవరెట్ ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ గడప తొక్కింది రోహిత్ సేన. నాకౌట్ ఫైట్​లో ఇంగ్లండ్​ను ఫేస్ చేయనుంది భారత్. ఈ తరుణంలో వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

  • Published Jun 25, 2024 | 10:00 PMUpdated Jun 25, 2024 | 10:08 PM
సెమీస్​కు ముందు ఇంగ్లండ్​కు హార్దిక్ వార్నింగ్.. ఇక దబిడిదిబిడే!

టీ20 వరల్డ్ కప్-2024లో భారత జట్టు బ్రేకుల్లేని బుల్డోజర్​లా దూసుకెళ్తోంది. మన టీమ్ జోరుకు కళ్లెం వేయడం ఎవరి వల్లా కావడం లేదు. గ్రూప్ దశలో ఐర్లాండ్, పాకిస్థాన్, యూఎస్​ఏను చిత్తు చేసిన రోహిత్ సేన.. సూపర్-8లోనూ హవా నడిపించింది. వరుసగా ఆఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాను మట్టికరిపించింది. యావరేజ్ టీమ్స్ మీదే గెలిచింది, ఇందులో గొప్ప ఏముందని ఆసీస్​తో మ్యాచ్ ముందు వరకు కొందరు హేళన చేశారు. కానీ ఛాంపియన్​ టీమ్ అయిన కంగారూలను మనోళ్లు చిత్తుగా ఓడించడంతో అన్ని విమర్శలకు ఫుల్​స్టాప్ పడింది. రోహిత్ శర్మ సంచలన బ్యాటింగ్, జస్​ప్రీత్ బుమ్రా నేతృత్వంలోని బౌలింగ్ యూనిట్ దుమ్మురేపే పెర్ఫార్మెన్స్​తో మెన్ ఇన్ బ్లూను చూసి అందరూ భయపడుతున్నారు.

డేంజరస్ ఆస్ట్రేలియా టీమ్ ఇంటిదారి పట్టింది. న్యూజిలాండ్ కూడా ఎప్పుడో టోర్నీ నుంచి బయటకు వెళ్లిపోయింది. వెస్టిండీస్, పాకిస్థాన్ వంటి టీమ్స్ కూడా రేసులో లేవు. దీంతో భారత్ కప్ గెలిచేందుకు ఇదే కరెక్ట్ టైమ్ అని అంతా అంటున్నారు. సెమీస్​లో పటిష్టమైన ఇంగ్లండ్​ను ఓడిస్తే చాలు.. కప్పు మనదేనని భరోసా ఇస్తున్నారు. ఈ తరుణంలో వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్​లో కొనసాగినంత కాలం వరల్డ్ కప్ కోసమే ఆడతానని అన్నాడు. జట్టుకు మెగా టైటిల్ అందించేందుకు ఏం చేయడానికైనా తాను సిద్ధమేనని స్పష్టం చేశాడు. దీంతో అతడు ఇంగ్లండ్​కు పరోక్షంగా హెచ్చరికలు పంపించాడని, వదిలేదే లేదనేది హార్దిక్ మెసేజ్ అని నెటిజన్స్ అంటున్నారు.

‘టీమిండియాకు ఆడటం స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు ఒకటే డ్రీమ్. అదే వరల్డ్ కప్ గెలవాలి. 2016లో నేను భారత జట్టు తరఫున అరంగేట్రం చేశా. ఆ రోజు నుంచి ఇప్పటివరకు నేను ఎప్పుడు దేశం తరఫున బరిలోకి దిగినా ప్రపంచ కప్​ను నెగ్గాలనే కోరికతోనే ఆడుతున్నా. ఇక మీదట కూడా అదే లక్ష్యంతో ఆడతా. భారత్ తరఫున ఆడినన్ని రోజులు బ్యాటర్​గా, బౌలర్​గా, ఫీల్డర్​గా నా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెడతా. కెప్టెన్​గా ఎవరు ఉన్నా సరే.. నా దృక్పథం మాత్రం మారదు. జట్టుకు వరల్డ్ కప్ అందించేందుకు ఏం చేసేందుకైనా నేను రెడీ. ఫీల్డింగ్, బ్యాటింగ్, బౌలింగ్​.. ఏ విభాగంలోనైనా సరే, టీమ్​కు నా శాయశక్తులా సేవలు అందిస్తా’ అని హార్దిక్ చెప్పుకొచ్చాడు. సెమీస్​కు ముందు హార్దిక్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ప్రపంచ కప్ నెగ్గేందుకు ఏం చేసేందుకైనా సిద్ధమంటూ అతడు చేసిన కామెంట్స్ ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తున్నాయి. మరి.. హార్దిక్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి