iDreamPost
android-app
ios-app

భారత్-పాక్ మ్యాచ్.. ఒక్క టికెట్ ధరెంతో తెలుసా? కొనాలంటే ఆస్తులమ్ముకోవాల్సిందే!

టీ 20 వరల్డ్ కప్ లో దాయాది దేశాల మధ్య జరిగే క్రికెట్ యుద్ధాన్ని ప్రత్యక్షంగా చూడాలని ఆరాటపడిన ఫ్యాన్స్ కు టికెట్ ధరలు షాకిచ్చాయి. ఒక్క టికెట్ కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. ఇంతకీ ఒక్క టికెట్ ధరెంతో తెలుసా?

టీ 20 వరల్డ్ కప్ లో దాయాది దేశాల మధ్య జరిగే క్రికెట్ యుద్ధాన్ని ప్రత్యక్షంగా చూడాలని ఆరాటపడిన ఫ్యాన్స్ కు టికెట్ ధరలు షాకిచ్చాయి. ఒక్క టికెట్ కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. ఇంతకీ ఒక్క టికెట్ ధరెంతో తెలుసా?

భారత్-పాక్ మ్యాచ్.. ఒక్క టికెట్ ధరెంతో తెలుసా? కొనాలంటే ఆస్తులమ్ముకోవాల్సిందే!

ఐపీఎల్ 2024 ముగిసిన వెంటనే మరో మెగా టోర్నీ క్రికెట్ లవర్స్ ను ఉర్రూతలూగించడానికి సిద్ధంగా ఉంది.. అదే టీ20 వరల్డ్ కప్. 20 జట్లు పాల్గొనే ఈ టోర్నీ జూన్ 1 నుంచి ప్రారంభం కానుంది. అయితే అందరి దృష్టి మాత్రం ఒకే ఒక్క మ్యాచ్ పై ఉంది. ఆ మ్యాచ్ ఎవరి మధ్యో మీకు ఈపాటికే తెలిసిపోయి ఉంటుంది. అవును.. భారత్-పాక్ ఢీకొనే మ్యాచ్ కోసం క్రికెట్ లవర్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. దాయాది దేశాల మధ్య జరిగే క్రికెట్ యుద్ధాన్ని ప్రత్యక్షంగా చూడాలని ఆరాటపడిన ఫ్యాన్స్ కు టికెట్ ధరలు షాకిచ్చాయి. ఒక్క టికెట్ కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. ఇంతకీ ఒక్క టికెట్ ధరెంతో తెలుసా?

టీ20 ప్రపంచ కప్ లో భాగంగా ఇండియా వర్సెస్ పాక్ మధ్య జూన్ 9న న్యూయార్క్ వేదికగా మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇండియా-పాక్ మధ్య సాధారణ మ్యాచ్ అయినా.. అది వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు ఉన్నంత క్రేజ్ కంటే ఎక్కువగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ రెండు దేశాల మధ్య మ్యాచ్ ను ప్రత్యక్షంగా చూడాలని అభిమానులు ఎంతో ఉత్సాహం చూపిస్తుంటారు. అందులో భాగంగా ఈ పొట్టి వరల్డ్ కప్ లో దాయాది దేశాల మ్యాచ్ డైరెక్ట్ గా చూడాలని ఆశ పడిన ఫ్యాన్స్ కు టికెట్ ధరలు ఊహించని షాకిచ్చాయి.

Do you know India-Pak match with one ticket price

ఇండియా-పాక్ మ్యాచ్ కు విపరీతమైన డిమాండ్ ఉండటంతో.. ఐసీసీ టికెట్ల ధరను భారీగా పెంచింది. ఈ మ్యాచ్ లో డైమాండ్ సీట్ విభాగంలోని ఒక్కో టికెట్ ధర సుమారు 20 వేల అమెరికన్ డాలర్లకు అమ్మడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇండియన్ కరెన్సీలో ఒక్క టికెట్ ధర రూ. 16.65 లక్షలు అన్నమాట. దాంతో ఈ ధర చూసి క్రికెట్ ఫ్యాన్స్ నోరెళ్లబెడుతున్నారు. కాగా.. ఐసీసీ ప్రకారం భారత్-పాక్ మ్యాచ్ టికెట్ల ధరలు రూ. 300 నుంచి రూ. 8.32 లక్షల వరకు ఉన్నాయి.

ఇక టికెట్ ధర ఇంత పెంచడంపై ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ తీవ్ర విమర్శలు గుప్పించాడు. “అమెరికాలో ఈ మెగా టోర్నీని నిర్వహించడానికి కారణం క్రికెట్ ను విస్తరించడం, ఆదరణతో పాటుగా అభిమానులు సంపాదించుకోవడం. కానీ ఇలా ఒక్కొ టికెట్ ను రూ. 16.65 లక్షలకు అమ్ముకుని లాభాలు అర్జించుకోవడానికి కాదు” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇక ఈ ధరలు చూసిన సాధారణం ఫ్యాన్స్ మూర్చబోతున్నారు. టిెకెట్ కొనాలంటే.. తమ ఆస్తులు అమ్ముకోవాల్సిందే అంటూ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇండియా-పాక్ టికెట్ల ధరలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి