Nidhan
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఇప్పుడు ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ఒక్క ఓవర్‌తో వరల్డ్ కప్ ఫైనల్ రిజల్ట్‌ను మార్చేసిన ఈ హీరోను అందరూ ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఇప్పుడు ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ఒక్క ఓవర్‌తో వరల్డ్ కప్ ఫైనల్ రిజల్ట్‌ను మార్చేసిన ఈ హీరోను అందరూ ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.
Nidhan
హార్దిక్ పాండ్యా.. ఇప్పుడు భారత క్రికెట్ అభిమానులు ఇతడి నామస్మరణ చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు దారుణంగా విమర్శల్ని ఎదుర్కొన్న పాండ్యా.. ఇప్పుడు హీరో అయిపోయాడు. ఐపీఎల్-2024 సమయంలో అతడ్ని ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ భారీగా ట్రోల్ చేశారు. రోహిత్ శర్మను కాదని అతడ్ని ఎలా కెప్టెన్‌ను చేస్తారంటూ సీరియస్ అయ్యారు. క్యాష్ రిచ్ లీగ్ నయా సీజన్లో అతడు ఫెయిలవడంతో ట్రోలింగ్ ఇంకా పెరిగింది. కెప్టెన్‌గా, బ్యాటర్‌గా, బౌలర్‌గా విఫలమైన హార్దిక్‌ను టీ20 వరల్డ్ కప్ టీమ్‌లోకి తీసుకోవద్దనే డిమాండ్లు కూడా వచ్చాయి. అదే సమయంలో భార్య నటాషా స్టాంకోవిక్‌తో విడాకులు తీసుకోనున్నాడని కూడా ప్రచారం సాగింది. అయితే ఇవేవీ హార్దిక్‌ను ఏమీ చేయలేకపోయాయి.
పొట్టి కప్పులో హార్దిక్ చెలరేగి ఆడాడు. బ్యాట్‌తో పాటు బంతితోనూ రాణించాడీ ఆల్‌రౌండర్. 144 పరుగులు చేసిన పాండ్యా.. 11 వికెట్లు పడగొట్టి టీమ్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కీలక సమయంలో క్లాసెన్‌తో పాటు మిల్లర్ వికెట్ తీసి మ్యాచ్‌ను మెన్ ఇన్ బ్లూ వైపు తిప్పాడు. విన్నింగ్ ఓవర్ వేసిన పాండ్యాకు ఆ తర్వాత రోహిత్ ముద్దు పెట్టడం చూసే ఉంటారు. విజయం తర్వాత కన్నీళ్లు పెట్టుకున్న హార్దిక్‌ను సహచర ఆటగాళ్లు భుజాల మీద ఎత్తుకోవడం, హగ్ చేసుకున్న విజువల్స్ నెట్టింట బాగా ట్రెండ్ అయ్యాయి. ఈ నేపథ్యంలో అతడు కీలక వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్-2024 సమయంలో తనను ఎవరెవరు ఏమేం అన్నారో అన్నీ గుర్తున్నాయని అన్నాడు. దేన్నీ ఇంకా మర్చిపోలేదంటూ ఎమోషనల్ అయ్యాడు.
‘ఈ ఆర్నెళ్లు ఎంతో కష్టంగా గడిచాయి. చాలా మంది చాలా మాటలు అన్నారు. హార్దిక్ పాండ్యా అంటే ఏంటో తెలియని వాళ్లు అనవసర వ్యాఖ్యలు చేశారు. నేనేంటో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. అయినా నేను ఎవర్నీ ఒక్క మాట కూడా తిరిగి అనలేదు. అనుకోని విషయాలు జరిగాయి. కానీ కష్టపడితే ఎలాంటి దశనైనా దాటొచ్చని నమ్మి కష్టపడ్డా’ అని హార్దిక్ చెప్పుకొచ్చాడు. శ్రమిస్తే మనం బెటర్ అవుతామని తెలుసునని, అదే తాను చేశానన్నాడు. ఫైనల్లో చిన్న ఛాన్స్ వచ్చినా వదలకూడదని డిసైడ్ అయ్యానని.. అనుకున్న ప్లాన్స్‌ను ఎగ్జిక్యూట్ చేసుకుంటూ పోయామన్నాడు పాండ్యా. మరి.. వాళ్ల మాటలు గుర్తున్నాయంటూ హార్దిక్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.
Hardik Pandya ” A lot of people said a lot of things without knowing who the hardik Pandya is.”
Many people are underground including Irfan Pathan after he started to perform for the country.pic.twitter.com/WjRD5em7dT
— Sujeet Suman (@sujeetsuman1991) July 2, 2024