Nidhan
తొలి కప్పు నెగ్గి చరిత్ర సృష్టిద్దామని భావించిన సౌతాఫ్రికాకు నిరాశే మిగిలింది. వరల్డ్ కప్ టైటిల్‌తో ఇంటికి వెళ్దామని అనుకున్న మార్క్రమ్ సేన.. ఖాళీ చేతులతో టోర్నీ నుంచి నిష్క్రమించింది.
తొలి కప్పు నెగ్గి చరిత్ర సృష్టిద్దామని భావించిన సౌతాఫ్రికాకు నిరాశే మిగిలింది. వరల్డ్ కప్ టైటిల్‌తో ఇంటికి వెళ్దామని అనుకున్న మార్క్రమ్ సేన.. ఖాళీ చేతులతో టోర్నీ నుంచి నిష్క్రమించింది.
Nidhan
తొలి కప్పు నెగ్గి చరిత్ర సృష్టిద్దామని భావించిన సౌతాఫ్రికాకు నిరాశే మిగిలింది. వరల్డ్ కప్ టైటిల్‌తో ఇంటికి వెళ్దామని అనుకున్న మార్క్రమ్ సేన.. ఖాళీ చేతులతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఎప్పుడూ సెమీస్ వరకు రావడం, అక్కడ చిత్తై ఇంటిదారి పట్టడం ప్రొటీస్‌కు అలవాటుగా మారింది. దాన్నే మరోమారు రిపీట్ చేసి చోకర్స్ అనే అపఖ్యాతిని మరోమారు మూటగట్టుకుంది సౌతాఫ్రికా. నిన్నటి మ్యాచ్‌లో ఆ టీమ్ ఈజీగా నెగ్గాల్సింది. గెలవాలంటే 30 బంతుల్లో 30 పరుగులు కావాలి. క్రీజులో ఉన్నది హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్. క్లాసెన్ కాకా భీకర ఫామ్‌లో ఉన్నాడు. 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్‌ను దాటేశాడు. అప్పటికే 2 బౌండరీలు, 5 భారీ సిక్సులు కొట్టాడు. అటు మిల్లర్ కూడా క్రమంగా జోరు పెంచసాగాడు. దీంతో కప్పు ఆ టీమ్దేనని అంతా అనుకున్నారు.
బాల్‌కు ఒక రన్ చొప్పున చేసినా నిన్న ఈజీగా నెగ్గేది సౌతాఫ్రికా. కానీ ఒత్తిడికి చిత్తై, ఎక్స్‌పెక్టేషన్స్‌ను అందుకోలేక ఓటమిపాలైంది. క్లాసెన్ ఔట్ అవ్వడం, ఆఖర్లో మిల్లర్ కూడా చేతులెత్తేయడంతో కప్పుకు ఆమడ దూరంలో ఆగిపోయింది ప్రొటీస్. జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా అద్భుతమైన స్పెల్స్ వేయడం, ఆఖర్లో సూర్యకుమార్ యాదవ్ స్టన్నింగ్ క్యాచ్ అందుకోవడంతో భారత్ ముందు సఫారీలు తలొంచక తప్పలేదు. అయితే మ్యాచ్ టర్నింగ్ మూమెంట్ అంటే క్లాసెన్ ఔట్ అనే చెప్పాలి. 17వ ఓవర్ తొలి బంతికి పాండ్యా బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. అప్పటిదాకా సౌతాఫ్రికా చేతిలో ఉన్న మ్యాచ్ అక్కడే చేజారింది. అయితే దీనికి అసలు క్రెడిట్ మాత్రం వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు ఇవ్వాలి.
నిన్నటి మ్యాచ్‌లో సౌతాఫ్రికాను కోలుకోలేని దెబ్బతీశాడు పంత్. బ్యాటింగ్‌లో గోల్డెన్ డక్‌గా వెనుదిరిగిన అతడు.. కీపింగ్‌లో ఆకట్టుకున్నాడు. రెండు అద్భుతమైన క్యాచులతో విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. అయితే వీటి కంటే కూడా క్లాసెన్‌ను అతడు తెలివిగా ఔట్ చేయడం మ్యాచ్‌కే హైలైట్ అని చెప్పాలి. అప్పటికి భారీ షాట్లతో దూకుడు మీద ఉన్నాడు క్లాసెన్. అయితే బుమ్రా 16వ ఓవర్ వేయడంతో అతడి మూమెంట్ కాస్త దెబ్బతింది. వికెట్ పడుతుందనే భయంతో ఆ ఓవర్లో అతడు పరుగులు చేయలేదు. దీన్ని అడ్వాంటేజ్‌గా తీసుకున్న పంత్ అతడి మూమెంట్‌ను మరింత స్లో డౌన్ చేసేందుకు మోకాలి నొప్పి అంటూ గేమ్‌ను కాసేపు ఆపేశాడు. నొప్పి తిరగబెట్టిందని రిషబ్ అనడంతో అతడి మోకాలికి బ్యాండేజ్ వేయడంతో మ్యాచ్ లేట్ అయింది.
బ్రేక్ రావడంతో జోరు మీదున్న క్లాసెన్ ట్రాక్ తప్పాడు. అనంతరం పాండ్యా వేసిన ఫస్ట్ బాల్కే ఔటయ్యాడు. కారు యాక్సిడెంట్ తర్వాత కోలుకొని తిరిగొచ్చిన పంత్‌కు మోకాలి నొప్పి అంటే అందరూ నమ్మేశారు. కానీ మ్యాచ్‌ను టర్న్ చేయడానికే అతడు ఇలా చేశాడని ఆ తర్వాత భారత అభిమాలకు అర్థమైంది. పంత్ గనుక తెలివిగా బ్రేక్ తీసుకోకపోతే క్లాసెన్, మిల్లర్ ఈజీగా మ్యాచ్‌ను ముగించేవారు. ఆ విరామం తర్వాత సఫారీలకు ఏదీ కలసిరాలేదు. దీంతో పంత్ తమ కొంప ముంచాడని ఆ టీమ్ ఫ్యాన్స్ లబోదిబోమంటున్నారు. మరి.. పంత్ తెలివైన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.