Nidhan
టీ20 వరల్డ్ కప్-2024లో ఇంగ్లండ్ చెత్త రికార్డును మూటగట్టుకుంది. 15 ఏళ్ల నుంచి ఇంగ్లీష్ టీమ్‌ది అదే కథ. ఈసారైనా మారుతుందనుకుంటే.. ఏదీ ఛేంజ్ అవ్వలేదు.
టీ20 వరల్డ్ కప్-2024లో ఇంగ్లండ్ చెత్త రికార్డును మూటగట్టుకుంది. 15 ఏళ్ల నుంచి ఇంగ్లీష్ టీమ్‌ది అదే కథ. ఈసారైనా మారుతుందనుకుంటే.. ఏదీ ఛేంజ్ అవ్వలేదు.
Nidhan
ఇంగ్లండ్.. క్రికెట్లో ఈ జట్టు పేరు చెబితేనే అందరూ వణికిపోతారు. ఎప్పుడూ మంచి టీమ్‌గానే ఉన్నా వరల్డ్ కప్స్ లాంటి బిగ్ ఐసీసీ టోర్నమెంట్స్‌లో మాత్రం సరిగ్గా పెర్ఫార్మ్ చేసేది కాదు. నాకౌట్ స్టేజ్ వరకు వచ్చినా అక్కడి నుంచి ముందుకు వెళ్లడం కష్టంగా మారేది. ఒకవేళ ఫైనల్స్‌కు వెళ్లినా కప్పును మాత్రం ఒడిసిపట్టేది కాదు. అయితే ఇయాన్ మోర్గాన్, బెన్ స్టోక్స్ లాంటి వాళ్ల హయాంలో ఆ టీమ్ రాతే మారిపోయింది. బౌలింగ్, బ్యాటింగ్.. ఏదైనా కానివ్వండి అటాకింగ్ మంత్రంతో చెలరేగిపోయింది. ఎదురొచ్చిన ప్రతి జట్టును చిత్తు చేస్తూ ముందుకు వెళ్లడం నేర్చుకుంది. దూకుడు మంత్రంతో ఒక్క కప్పు కూడా రాని సిచ్యువేషన్ నుంచి పొట్టి ఫార్మాట్లో ఏకంగా రెండుమార్లు వరల్డ్ ఛాంపియన్స్‌గా నిలిచింది ఇంగ్లీష్ టీమ్.
ఈసారి కూడా అదే ఊపును కొనసాగించి వరల్డ్ కప్‌ను ఎగరేసుకుపోవాలని పట్టుదలతో ఉంది ఇంగ్లండ్. అయితే ఫస్ట్ మ్యాచ్‌లోనే ఆ జట్టు చెత్త రికార్డును మూటగట్టుకుంది. పాకిస్థాన్ సిరీస్ తర్వాత నేరుగా మెగా టోర్నీ కోసం వెస్టిండీస్ చేరుకుంది ఇంగ్లీష్ టీమ్. ఓవల్ బార్బడోస్ స్టేడియంలో పసికూన స్కాట్లాండ్తో తొలి మ్యాచ్ కూడా ఆడేసింది. అయితే ఈ మ్యాచ్‌లో ఫలితం తేలకపోవడంతో ఆ జట్టు చెత్త రికార్డును మూటగట్టుకుంది. టీ20 వరల్డ్ కప్ హిస్టరీలో ఇప్పటిదాకా యూరోపియన్ టీమ్స్ మీద గెలవని చెత్త రికార్డును ఇంగ్లండ్ కొనసాగించింది. ప్రపంచ కప్-2009లో నెదర్లాండ్స్ చేతుల్లో ఓడిన ఇంగ్లీష్ జట్టు.. 2014 వరల్డ్ కప్‌లోనూ అదే టీమ్ చేతుల్లో చిత్తయింది.
టీ20 వరల్డ్ కప్-2022లో ఐర్లాండ్ చేతుల్లో ఓడింది ఇంగ్లండ్. దీంతో ఈసారైనా ఆ టీమ్ కథ మారుతుందని అనుకుంటే మళ్లీ అదే రిపీట్ అయింది. స్కాట్లాండ్ను చిత్తు చేసి.. యూరోపియన్ జట్ల చేతుల్లో ఓడుతోందనే చెత్త రికార్డును తుడిచేయాలని ఫిక్స్ అయింది. కానీ అదృష్టం కలసిరాలేదు. ఇంగ్లండ్-స్కాట్లాండ్ మధ్య పూర్తి మ్యాచ్ సాధ్యం కాలేదు. టాస్ నెగ్గి ఫస్ట్ బ్యాటింగ్‌కు దిగిన స్కాట్లాండ్ 10 ఓవర్లు ఆడి వికెట్ కోల్పోకుండా 90 పరుగులు చేసింది. ఓపెనర్లు మైకేల్ జోన్స్ (30 బంతుల్లో 45 నాటౌట్), జార్జ్ మున్సే (31 బంతుల్లో 41 నాటౌట్) అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. అయితే మ్యాచ్‌కు మొదట్నుంచి ఇబ్బంది పెడుతూ వచ్చిన వరుణుడు ఎంతకీ శాంతించలేదు. వర్షం ఆగకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేశారు. దీంతో యూరోపియన్ జట్ల మీద గెలవని ఇంగ్లండ్ రికార్డు కంటిన్యూ అయింది.
England vs European teams in the T20I World Cup:
vs NED in 2009 – Lost.
vs NED in 2014 – Lost.
vs IRE in 2022 – Lost.
vs SCO in 2024 – No Result. pic.twitter.com/OY0QbLVwW7— Johns. (@CricCrazyJohns) June 4, 2024