iDreamPost
android-app
ios-app

కోహ్లీ కోసం పంత్​ను బలి చేయొద్దు.. మాజీ క్రికెటర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

  • Published Jun 15, 2024 | 4:24 PM Updated Updated Jun 15, 2024 | 4:24 PM

పొట్టి కప్పులో డాషింగ్ బ్యాటర్ రిషబ్ పంత్ ఇరగదీస్తున్నాడు. భీకర ఫామ్​లో ఉన్న ఈ టీమిండియా హిట్టర్.. బౌలర్లను ఉతికి ఆరేస్తున్నాడు. అలాంటోడికి అన్యాయం చేయొద్దని ఓ మాజీ క్రికెటర్ కోరుతున్నాడు.

పొట్టి కప్పులో డాషింగ్ బ్యాటర్ రిషబ్ పంత్ ఇరగదీస్తున్నాడు. భీకర ఫామ్​లో ఉన్న ఈ టీమిండియా హిట్టర్.. బౌలర్లను ఉతికి ఆరేస్తున్నాడు. అలాంటోడికి అన్యాయం చేయొద్దని ఓ మాజీ క్రికెటర్ కోరుతున్నాడు.

  • Published Jun 15, 2024 | 4:24 PMUpdated Jun 15, 2024 | 4:24 PM
కోహ్లీ కోసం పంత్​ను బలి చేయొద్దు.. మాజీ క్రికెటర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

టీ20 వరల్డ్ కప్​-2024లో భారత జట్టు జైత్రయాత్ర నడుస్తోంది. ఇప్పటిదాకా ఆడిన మూడు మ్యాచుల్లోనూ నెగ్గిన రోహిత్ సేన.. సూపర్-8 బెర్త్​ను అఫీషియల్​గా కన్ఫర్మ్ చేసుకుంది. ఇవాళ కెనడాతో జరిగే మ్యాచ్ రిజల్ట్​తో సంబంధం లేకుండా నెక్స్ట్ స్టేజ్​కు క్వాలిఫై అయింది. దీంతో కెనడాతో పోరు నామమాత్రం కానుంది. బ్యాటింగ్ బలహీనతల్ని అధిగమించేందుకు ఈ మ్యాచ్ ఉపయోగపడనుంది. ముఖ్యంగా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫామ్ అందుకోవడానికి ఈ మ్యాచ్ హెల్ప్ అవుతుంది. అయితే ఈ మ్యాచ్​లో కింగ్ ఏ పొజిషన్​లో ఆడతాడనేది ఇంట్రెస్టింగ్​గా మారింది. ఈ మ్యాచ్ అనే కాదు.. సూపర్-8లోనూ కోహ్లీ ఏ స్థానంలో బ్యాటింగ్ చేస్తాడనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. మెగా టోర్నీలో ఓపెనర్​గా దిగిన గత మూడు మ్యాచుల్లోనూ అతడు అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. కేవలం 5 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరుత్సాహపర్చాడు విరాట్.

వరల్డ్ కప్​లో కోహ్లీ ఓపెనర్​గా వచ్చి ఫ్లాప్ అవుతుంటే.. అతడి రెగ్యులర్ ప్లేస్ అయిన మూడో స్థానంలో వస్తున్న పించ్ హిట్టర్ రిషబ్ పంత్ మాత్రం సూపర్ సక్సెస్ అవుతున్నాడు. మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఆడుతూ జట్టుకు ప్రధాన బలంగా మారాడు. ఆడిన మూడు మ్యాచుల్లోనూ థర్డ్ డౌన్​లో వచ్చి 96 పరుగులు చేశాడు పంత్. భయం లేకుండా ఆడుతూ ప్రత్యర్థులను వణికిస్తున్నాడు. క్రీజులో ఉన్నంత సేపు మెరుపు బ్యాటింగ్​తో అలరిస్తున్నాడు. అలాంటోడ్ని కోహ్లీ కోసం బలి చేస్తారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాడు. ఓపెనర్​గా విరాట్ ఫెయిల్ అవుతున్నందున అతడ్ని తిరిగి మూడో స్థానంలో ఆడించాలని, పంత్​ను కింద దించాలని టీమ్ మేనేజ్​మెంట్ భావిస్తున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. దీనిపై భారత మాజీ క్రికెటర్ సంజయ్ బాంగర్ రియాక్ట్ అయ్యాడు. కోహ్లీ కోసం పంత్​ను బలి చేయొద్దని అతడు కోరాడు.

‘విరాట్ కోహ్లీ ఈ ఐపీఎల్ సీజన్​లో అదరగొట్టాడు. దీంతో వరల్డ్ కప్​లోనూ అతడు ఇదే రీతిలో ఆడతాడని అంతా అనుకున్నారు. కానీ ఆ మ్యాజిక్​ను రిపీట్ చేయలేకపోతున్నాడు. అయితే కోహ్లీ కచ్చితంగా ఫామ్​ను అందుకుంటాడు. అన్ని సిచ్యువేషన్స్​లో ఒకేలా ఆడటం సాధ్యం కాదు. పరిస్థితుల్ని బట్టి తన బ్యాటింగ్​ శైలిని మార్చుకోవడం విరాట్​కు అలవాటే. అతడు కచ్చితంగా రాణిస్తాడు. అయితే అతడి కోసం బ్యాటింగ్ పొజిషన్స్​ను మార్చడం కరెక్ట్ కాదు. దీని వల్ల రిషబ్ పంత్ సహా ఇతర బ్యాటర్లు అనిశ్చితికి లోనయ్యే ప్రమాదం పొంచి ఉంది. నంబర్ 3లో పంత్ అద్భుతంగా ఆడుతున్నాడు. అతడి తర్వాత వస్తున్న సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబె కూడా అదరగొడుతున్నారు. బ్యాటింగ్ ఆర్డర్ సెట్ అయింది. కాబట్టి ఎలాంటి మార్పులు చేయకూడదు. కోహ్లీని ఓపెనర్​గానే దించాలి’ అని బాంగర్ సూచించాడు. కింగ్ ఫామ్​ అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదని, తన టైమ్ స్టార్ట్ అయితే ఎవరూ అతడ్ని ఆపలేరని స్పష్టం చేశాడు. మరి.. కోహ్లీ కోసం పంత్ బ్యాటింగ్ ఆర్డర్​ను మార్చొద్దంటూ బాంగర్ ఇచ్చిన సలహాపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.