Nidhan
టీ20 వరల్డ్ కప్-2024 ఫేవరెట్స్‌లో ఒకటిగా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. సూపర్-8లోనే ఇంటిదారి పట్టింది. ఆఫ్ఘానిస్థాన్, భారత్ చేతుల్లో ఓడిన కంగారూ జట్టు సెమీస్‌కు ముందే టోర్నీ నుంచి వైదొలిగింది.
టీ20 వరల్డ్ కప్-2024 ఫేవరెట్స్‌లో ఒకటిగా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. సూపర్-8లోనే ఇంటిదారి పట్టింది. ఆఫ్ఘానిస్థాన్, భారత్ చేతుల్లో ఓడిన కంగారూ జట్టు సెమీస్‌కు ముందే టోర్నీ నుంచి వైదొలిగింది.
Nidhan
టీ20 వరల్డ్ కప్ ఫేవరెట్స్‌లో ఒకటిగా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. సూపర్-8లోనే ఇంటిదారి పట్టింది. భారత్, ఆఫ్ఘానిస్థాన్ చేతుల్లో ఓడిన కంగారూ జట్టు సెమీస్‌కు ముందే టోర్నీ నుంచి వైదొలిగింది. గ్రూప్ దశలో అదరగొట్టిన ఆసీస్.. సూపర్-8లో మాత్రం చతికిలపడింది. తొలుత ఆఫ్ఘాన్ చేతుల్లో ఓడి సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఆ తర్వాత భారత్ మీద కూడా ఓడి దాదాపుగా నాకౌట్ రేసు నుంచి నిష్క్రమించింది. తాజాగా బంగ్లాదేశ్‌ను రషీద్ సేన ఓడించడంతో ఆస్ట్రేలియా ఇంటిదారి పట్టింది. ఈ తరుణంలో ఆ టీమ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించాడు. ఇప్పటికే వన్డేలు, టెస్టులకు వీడ్కోలు పలికిన ఈ ఓపెనర్.. ఇప్పుడు పొట్టి ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించాడు.
కెరీర్లో ఎన్నో ట్రోఫీలను ముద్దాడాడు వార్నర్. గతేడాది వన్డే ప్రపంచ కప్ నెగ్గిన ఆసీస్ జట్టులోనూ అతడు కీలకంగా వ్యవహరించాడు. మెగాటోర్నీల్లో కంగారూలు ఛాంపియన్స్‌గా నిలవడంలో అతడిది కీలకపాత్ర. అలాంటోడు ఇంకో ఐసీసీ ట్రోఫీని చేతబట్టి ఘనంగా కెరీర్‌కు గుడ్‌బై చెప్పాలని భావించాడు. అయితే టీమిండియాపై ఓటమితో అతడి ఆశలకు బ్రేక్ పడింది. సెమీస్‌లోనే ఆ టీమ్ కథ ముగిసింది. వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా వన్డే ఫార్మాట్లో ఛాంపియన్స్ ట్రోఫీ-2025 జరగనుంది. ఆ టోర్నీలో అవసరమైతే టీమ్‌కు ప్రాతినిధ్యం వహించేందుకు రిటైర్మెంట్ను వెనక్కి తీసుకుంటానని వార్నర్ ఇప్పటికే ప్రకటించాడు. అయితే అతడికి క్రికెట్ ఆస్ట్రేలియా మరో ఛాన్స్ ఇచ్చే సూచనలు కనిపించడం లేదు.
టీ20 వరల్డ్ కప్‌లో సెమీస్‌కు ముందే జట్టు ఇంటిదారి పట్టడంతో క్రికెట్ ఆస్ట్రేలియా సమూల మార్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీమ్‌లో సరిగ్గా పెర్ఫార్మ్ చేయని వారిని సెలెక్షన్‌కు దూరంగా ఉంచే ఛాన్సులు ఉన్నాయి. అలాగే కొందరి కాంట్రాక్ట్‌లు తీసేసే ప్రమాదం కూడా ఉందని వినిపిస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే వన్డేలు, టెస్టులకు తాజాగా టీ20లకు గుడ్‌బై చెప్పిన వార్నర్‌కు కూడా దూరం పెట్టనున్నట్లు తెలుస్తోంది. రిటైర్మెంట్ వెనక్కి తీసుకోమని అతడ్ని కోరే అవకాశం లేదని ఆసీస్ మీడియా అంటోంది. ఇవన్నీ చూస్తుంటే ఇక ఐపీఎల్ లాంటి లీగ్స్ తప్పితే వార్నర్ మళ్లీ అంతర్జాతీయ క్రికెట్లో కనిపించే అవకాశం లేదనే చెప్పాలి. మరి.. అద్భుత బ్యాటింగ్‌తో కోట్లాది మందిని అలరించిన వార్నర్ రిటైర్మెంట్పై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
David Warner has retired from international cricket.
– A legendary career comes to an end, Thank You Davey! ❤️ pic.twitter.com/ny4SUiWivG
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 25, 2024