Nidhan
ఒకవైపు ఆకలి, మరోవైపు పేదరికం, దారుణమైన అణచివేత. ఆ దేశంలో ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ అవరోధాల్ని విజయానికి మెట్లుగా మార్చుకొని పట్టుదలతో ఎదిగింది ఆఫ్ఘానిస్థాన్ జట్టు. ఇప్పుడు క్రికెట్లో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది.
ఒకవైపు ఆకలి, మరోవైపు పేదరికం, దారుణమైన అణచివేత. ఆ దేశంలో ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ అవరోధాల్ని విజయానికి మెట్లుగా మార్చుకొని పట్టుదలతో ఎదిగింది ఆఫ్ఘానిస్థాన్ జట్టు. ఇప్పుడు క్రికెట్లో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది.
Nidhan
ఒకవైపు ఆకలి, మరోవైపు పేదరికం, ఇంకోవైపు దారుణమైన అణచివేత. ఆ దేశంలో ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ అవరోధాల్ని విజయానికి మెట్లుగా మార్చుకొని పట్టుదలతో ఎదిగింది ఆఫ్ఘానిస్థాన్ జట్టు. ఇప్పుడు క్రికెట్లో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. టీ20 వరల్డ్ కప్-2024లో భాగంగా సూపర్ పోరులో ఫేవరెట్ ఆస్ట్రేలియాను 21 పరుగుల తేడాతో ఓడించింది. దీంతో అందరూ ఆ టీమ్ గురించే మాట్లాడుకుంటున్నారు. అయితే కొన్నేళ్ల కింద వరకు రషీద్ సేనను అందరూ పసికూనగా చూసేవారు. అసోసియేట్ కంట్రీస్‌పై విజయాలు తప్పితే పెద్ద విజయాలు సాధించిన దాఖలాలు లేవు. దీంతో ఆఫ్ఘాన్ అంటే క్రికెట్లో అందరికీ చిన్నచూపు ఉండేది. అయితే కాలం గిర్రున తిరిగింది. కొద్ది గ్యాప్‌లోనే ఆ జట్టు పటిష్టంగా తయారైంది. టాప్ టీమ్స్‌కు షాక్ ఇవ్వడం అలవాటు చేసుకుంది.
వన్డే ప్రపంచ కప్-2023లో ఇంగ్లండ్, పాకిస్థాన్, శ్రీలంకను మట్టికరిపించింది ఆఫ్ఘానిస్థాన్. లాస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఓడించినంత పని చేసింది. గ్లెన్ మాక్స్వెల్ వీరోచిత బ్యాటింగ్‌తో కంగారూలను గట్టున పడేశాడు. అతడే గనుక డబుల్ సెంచరీ కొట్టకపోతే ఆసీస్ కథ అక్కడే ముగిసేది. అయితే ఆ మ్యాచ్‌లో ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్న ఆఫ్ఘాన్.. మరింత స్ట్రాంగ్‌గా కమ్‌బ్యాక్ ఇచ్చింది. ప్రస్తుత పొట్టి కప్పులో మరింత పట్టుదలతో ఆడుతూ బిగ్ టీమ్స్‌కు మూడు చెరువుల నీళ్లు తాగిస్తోంది. లీగ్ స్టేజ్‌లో న్యూజిలాండ్‌ను మట్టికరిపించిన రషీద్ సేన.. సూపర్-8లో ఆసీస్ పని పట్టింది. బంగ్లాదేశ్ మీద నెగ్గి సెమీస్ బెర్త్ ఖాయం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే ఆకలి, పేదరికంతో బాధపడుతున్న ఆఫ్ఘాన్.. క్రికెట్లో సంచలనాలు సృష్టించే స్థాయికి ఎలా ఎదిగిందనేది చాలా మంది మదిలో తొలుస్తున్న ప్రశ్న.
నాలుగు దశాబ్దాలుగా ఆఫ్ఘానిస్థాన్ ఆకలి, అణచివేత, పేదరికం, నిస్సహాయతతో పోరాడుతోంది. అమెరికా, సోవియట్ యూనియన్ల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కారణంగా ఈ దేశం బలైంది. ఎన్నో విషాదాలతో పోరాడుతున్న ఆ కంట్రీలో క్రికెట్ ఒకటే ఇప్పుడు ఆశాకిరణంగా కనిపిస్తోంది. క్రికెట్ విజయాల మధ్య అక్కడి ప్రజలు తమ కష్టాలు, బాధల్ని మర్చిపోవడానికి ట్రై చేస్తున్నారు. రషీద్ సేన సాధించే ప్రతి గెలుపు వారికో మెడిసిన్ వంటిది. ఆఫ్ఘాన్‌లో క్రికెట్ కల్చర్ లేదు. 1979లో ఆ దేశంపై రష్యా దాడి చేసినప్పుడు లక్షలాది మంది ప్రజలు పాకిస్థాన్‌కు పారిపోయారు. శరణార్థి శిబిరాల్లో ఉన్నప్పుడు క్రికెట్ ఆడుతూ దానిపై ఇష్టాన్ని పెంచుకున్నారు. వీళ్లు మళ్లీ ఆఫ్ఘాన్‌కు తిరిగొచ్చి క్రికెట్ సంస్కృతిని పెంచారు. అప్పట్లో తాలిబన్లు ఈ గేమ్‌ను నిషేధించినా.. ప్రజల్లో క్రికెట్‌కు ఉన్న పాపులారిటీ చూసి 2000లో ఆడేందుకు పర్మిషన్ ఇచ్చారు.
గత పదేళ్లలో ఆఫ్ఘాన్ జట్టు క్రికెట్లో ఎంతో వేగంగా ఎదిగింది. ప్రాణాలు పోతున్నా లెక్కచేయకుండా ఆడుతూ వచ్చిందా జట్టు. చిన్న లీగ్స్‌లో ఆడటం నుంచి టెస్ట్ హోదా దక్కించుకోవడం వరకు ఆ టీమ్ జర్నీ అందరికీ స్ఫూర్తిదాయకమే. బీసీసీఐ, ఐసీసీ అండతో ఇంటర్నేషనల్ క్రికెట్లో తమ ప్రయాణాన్ని విజయవంతంగా సాగిస్తోంది ఆఫ్ఘాన్. అక్కడ సౌకర్యాల కొరత ఉన్నందున మన దేశంలోని లక్నో, గ్రేటర్ నొయిడా, డెహ్రాడూన్‌ను తమ సొంత మైదానంగా మార్చుకుంది. ఆ టీమ్‌కు భారత ప్రభుత్వం, బీసీసీఐ సపోర్ట్ అందించడం విశేషం. ఆఫ్ఘాన్ ప్రజల అంకితభావం, సంకల్పానికి క్రికెట్ ఓ చిహ్నంగా మారింది. తాము మ్యాచ్ గెలిస్తే దేశ ప్రజలు అన్ని బాధలు మర్చిపోయి సంబురాలు చేసుకుంటారు అనే కారణం వల్లే ఆఫ్ఘాన్ క్రికెటర్లు గ్రౌండ్లోకి దిగి సింహాల్లా పోరాడుతున్నారు. తమ వాళ్ల కోసం మ్యాచ్ గెలిచి పండుగ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. మరి.. పొట్టి కప్పులో ఆఫ్ఘాన్ల ఆటతీరు మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.