Nidhan
ఆఫ్ఘానిస్థాన్ జట్టు అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. గ్రూప్ దశ దాటితే గొప్ప అనుకున్న టీమ్ కాస్తా ప్రపంచ కప్ టాప్-4లోకి ఎంట్రీ ఇచ్చింది. వరుసగా ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌ను చిత్తు చేసి సెమీస్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది.
ఆఫ్ఘానిస్థాన్ జట్టు అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. గ్రూప్ దశ దాటితే గొప్ప అనుకున్న టీమ్ కాస్తా ప్రపంచ కప్ టాప్-4లోకి ఎంట్రీ ఇచ్చింది. వరుసగా ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌ను చిత్తు చేసి సెమీస్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది.
Nidhan
ఆఫ్ఘానిస్థాన్ జట్టు అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. గ్రూప్ దశ దాటితే గొప్ప అనుకున్న టీమ్ ఏకంగా ప్రపంచ కప్ టాప్-4లో చోటు దక్కించుకుంది. వరుసగా ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌ను చిత్తు చేసి సెమీస్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది. ఆ టీమ్ ఫైనల్ చేరాలంటే సౌతాఫ్రికాను ఓడించాల్సి ఉంటుంది. ఆఫ్ఘాన్ నాకౌట్ ఫైట్‌కు క్వాలిఫై కావడంతో అందరూ ఆ టీమ్‌ను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ఇది కదా గెలుపంటే అంటూ మెచ్చుకుంటున్నారు. రషీద్ సేన పోరాటపటిమ, ఆఖరి వరకు విజయం కోసం ఫైట్ చేసిన తీరుకు అందరూ ఇంప్రెస్ అయిపోయారు. అయితే ఆఫ్ఘాన్ల విజయం వెనుక ఆటగాళ్లతో పాటు చాలా మంది కీలక పాత్ర పోషించారు. కోచ్ జొనాథన్ ట్రాట్, బౌలింగ్ కోచ్ డ్వేన్ బ్రావోలకు క్రెడిట్ ఇవ్వాల్సిందే. అలాగే ఓ తెలుగోడి కష్టాన్ని కూడా ఇప్పుడు గుర్తుచేసుకోవాలి.
ఆఫ్ఘానిస్థాన్ సక్సెస్ వెనుక ఓ తెలుగోడు ఉన్నాడు. అతడి వల్లే ఆ టీమ్ ప్లేయర్లు ఇంజ్యురీల నుంచి త్వరగా రికవర్ అయ్యారు. అతడి కారణంగానే అలసట నుంచి కోలుకొని మ్యాచుల్లో దుమ్మురేపారు. తన ఎక్స్‌పీరియెన్స్ మొత్తాన్ని ఉపయోగించి ఆఫ్ఘాన్ విజయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న ఆ తెలుగోడు మరెవరో కాదు.. ఫిజియో ప్రశాంత్ పంచాడ. హైదరాబాద్‌కు చెందిన ఆయనకు క్రికెట్లో మంచి అనుభవం ఉంది. గతంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో హెడ్ ఫిజియో థెరపిస్ట్‌గా పని చేశాడు. అలాగే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్‌తో కలసి జర్నీ చేస్తున్నాడు. కేకేఆర్ ప్లేయర్లు ఇంజ్యురీ బారిన పడకుండా, ఒకవేళ గాయాలపాలైనా త్వరగా రికవర్ అయ్యేలా చూసుకుంటున్నాడు ప్రశాంత్. అందుకే అక్కడ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆఫ్ఘానిస్థాన్ టీమ్తోనూ చాన్నాళ్లుగా అతడు ట్రావెల్ చేస్తున్నాడు.
గత కొన్నేళ్లుగా ఆఫ్ఘాన్ టీమ్‌తో ఉంటూ ఫిజియోగా సేవలు అందిస్తున్నాడు ప్రశాంత్. ప్లేయర్ల ఫిట్నెస్, ఇంజ్యురీ, రికవరీ విషయాలు చూసుకుంటూనే వాళ్లతో మంచి అనుబంధం కూడా ఏర్పరచుకున్నాడు. ఆఫ్ఘాన్ ఆటగాళ్లు రషీద్ ఖాన్, ముజీబుర్ రెహ్మాన్ లాంటి వాళ్లు అప్పుడప్పుడూ తెలుగులో ట్వీట్లు చేయడం గమనించే ఉంటారు. ఇవన్నీ ప్రశాంత్ సాయంతో చేసినవే కావడం విశేషం. దీన్ని బట్టే వాళ్లతో ఆయన ఎంత బాగా కలసిపోయాడో అర్థం చేసుకోవచ్చు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో గాయమైనట్లు యాక్ట్ చేసిన ఆల్‌రౌండర్ గుల్బదీన్ నయీబ్ తాజాగా నెట్టింట ఓ పోస్ట్ పెట్టాడు. ఇతడే మా ఫిజియో అంటూ ప్రశాంత్‌తో దిగిన ఫొటోను షేర్ చేశాడు. దీంతో అందరూ ప్రశాంత్‌ను మెచ్చుకుంటున్నారు. మరి.. ఆఫ్ఘాన్ విజయాల్లో తెలుగోడు కీలక పాత్ర పోషించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.
Gulbadin Naib’s Instagram story. 🤣
– The miraculous recovery!! pic.twitter.com/0L5auSAGCD
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 25, 2024