iDreamPost
android-app
ios-app

IND vs USA: అమెరికాతో మ్యాచ్.. కోహ్లీకి షాక్! జట్టులో కీలక మార్పులు..

  • Published Jun 12, 2024 | 7:23 AM Updated Updated Jun 12, 2024 | 7:23 AM

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా అమెరికాతో జరిగే మ్యాచ్ లో టీమిండియాలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా అమెరికాతో జరిగే మ్యాచ్ లో టీమిండియాలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

IND vs USA:  అమెరికాతో మ్యాచ్.. కోహ్లీకి షాక్! జట్టులో కీలక మార్పులు..

టీ20 వరల్డ్ కప్ 2024లో టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగింది టీమిండియా. అంచనాలకు తగ్గట్లుగానే రాణిస్తూ.. వరుసగా రెండు విజయాలు సాధించి జోరుమీదుంది. తొలి మ్యాచ్ లో ఐర్లాండ్ పై 8 వికెట్లతో ఈజీ విక్టరీ సాధించిన భారత్.. రెండో మ్యాచ్ లో పాక్ పై కఠినంగా గెలిచింది. ఇక నేడు(బుధవారం) అమెరికాతో జరిగే మ్యాచ్ లో కూడా విజయం సాధించి సూపర్-8కు అర్హత సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీకి స్థాన చలనం కలిగి ఛాన్స్ లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అమెరికాతో జరిగే మ్యాచ్ కోసం జట్టులో కీలక మార్పులు చేయాలని మేనేజ్ మెంట్ భావిస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేదనే చెప్పాలి. ఈ మెగాటోర్నీలో భారత్ ఆడిన రెండు మ్యాచ్ ల్లో బౌలింగ్ లో సత్తాచాటింది. కానీ పాక్ తో జరిగిన మ్యాచ్ లో బ్యాటింగ్ లో దారుణంగా విఫలం అయ్యింది. ఈ క్రమంలోనే అభిమానులను ఓ అంశం కలవరపెడుతోంది. అదేంటంటే? ఈ ఐపీఎల్ సీజన్ లో ఓపెనర్ గా పరుగులు వరదపారించిన విరాట్ కోహ్లీ.. అదే జోరును పొట్టి ప్రపంచ కప్ లో చూపెట్టలేకపోతున్నాడు. ఆడిన రెండు మ్యాచ్ ల్లో కూడా ఓపెనర్ గా దారుణంగా విఫలం అయ్యాడు విరాట్. దాంతో జట్టు కూర్పుపై మేనేజ్ మెంట్ ఆలోచనలో పడినట్లు సమాచారం.

అమెరికాతో జరిగే మ్యాచ్ కోసం టీమిండియా జట్టులో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. హిట్టింగ్ చేయాలన్న ఆలోచనతో విరాట్ కోహ్లీ తన వికెట్ ను త్వరగా కోల్పోతున్నాడు. దాంతో మేనేజ్ మెంట్ కోహ్లీని మూడో స్థానంలో బ్యాటింగ్ కు పంపాలని భావిస్తున్నట్లు సమాచారం. రోహిత్ కు జోడీగా యశస్వీ జైస్వాల్ ను బరిలోకి  దింపాలని చూస్తోంది. దాంతో శివమ్ దూబే బెంచ్ కే పరిమితం కానున్నాడు. కాగా.. స్లో పిచ్ లపై విరాట్ కోహ్లీ చివరి వరకు క్రీజ్ లో ఉండటం జట్టుకు ఎంతో కీలకం.

అయితే వరల్డ్ కప్ లో ఇప్పటి వరకు టీమిండియాకు గట్టి ప్రత్యర్థులు తగలలేదు కాబట్టి ఏం కాలేదు. కానీ సూపర్ 8, సెమీస్, ఫైనల్లో పటిష్టమైన జట్టును ఢీకొంటే పరిస్థితి ఏంటి? అన్నదే ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్న అంశం. అందుకే లీగ్ స్టేజ్ లోనే జట్టు కూర్పును సరిచేసుకుని బరిలోకి దిగాలని భారత్ భావిస్తోంది. అందులో భాగంగా అమెరికాతో జరిగే మ్యాచ్ లో కోహ్లీని మూడో నంబర్ బ్యాటర్ గా దించాలని మేనేజ్ మెంట్ నిర్ణయించినట్లు సమాచారం. మరి విరాట్ ఏ స్థానంలో బ్యాటింగ్ కు దిగితే బెటర్? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.