iDreamPost
android-app
ios-app

టీమిండియానే ఫేవరెట్.. కానీ అదొక్కటే సమస్య: మాజీ క్రికెటర్

  • Published Jun 01, 2024 | 2:06 PM Updated Updated Jun 01, 2024 | 2:06 PM

టీ20 వరల్డ్ కప్​-2024కు సిద్ధమవుతున్న భారత జట్టులో ఓ సమస్య ఉందన్నాడు మాజీ క్రికెటర్. ఆస్ట్రేలియాతో పోల్చుకుంటే ఆ విషయంలో రోహిత్ సేన బలహీనంగా కనిపిస్తోందని చెప్పాడు.

టీ20 వరల్డ్ కప్​-2024కు సిద్ధమవుతున్న భారత జట్టులో ఓ సమస్య ఉందన్నాడు మాజీ క్రికెటర్. ఆస్ట్రేలియాతో పోల్చుకుంటే ఆ విషయంలో రోహిత్ సేన బలహీనంగా కనిపిస్తోందని చెప్పాడు.

  • Published Jun 01, 2024 | 2:06 PMUpdated Jun 01, 2024 | 2:06 PM
టీమిండియానే ఫేవరెట్.. కానీ అదొక్కటే సమస్య: మాజీ క్రికెటర్

టీ20 వరల్డ్ కప్-2024కు భారత జట్టు రెడీ అవుతోంది. ఇప్పటికే యూఎస్​ఏకు చేరుకున్న మెన్ ఇన్ బ్లూ ప్రాక్టీస్​లో మునిగిపోయారు. పొట్టి కప్పును ఎగరేసుకుపోవాలనే కసిలో ఉన్న రోహిత్ సేన కసితో సాధన చేస్తున్నారు. ఇవాళ బంగ్లాదేశ్​తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనున్నారు. జూన్ 5వ తేదీన ఐర్లాండ్​తో జరిగే తొలి మ్యాచ్​తో ప్రపంచ కప్ వేటను స్టార్ట్ చేయనున్నారు. ఆ తర్వాత 9వ తేదీన దాయాది పాకిస్థాన్​తో అమీతుమీ తేల్చుకోనున్నారు. ఐపీఎల్-2024 నుంచి నేరుగా వరల్డ్ కప్​ ఆడేందుకు వచ్చేశారు భారత ఆటగాళ్లు. క్యాష్ రిచ్​ లీగ్​ ఫామ్​నే ఇక్కడా కంటిన్యూ చేయాలని కొందరు, ఇంకా బాగా ఆడాలని మరికొందరు పట్టుదలతో ఉన్నారు. భారత జట్టు ఒక్క దాంట్లో తప్ప మిగతా అన్ని విభాగాల్లోనూ బలంగా కనిపిస్తోంది.

ఓపెనర్ల దగ్గర నుంచి ఫినిషర్ల వరకు, స్పిన్నర్ల నుంచి పేసర్ల దాకా టీమిండియా పర్ఫెక్ట్ బ్యాలెన్స్​తో కనిపిస్తోంది. ప్రతి పొజిషన్​కు ఒకటికి మించి ఆప్షన్లు ఉండటంతో తుది జట్టు ఎంపిక ఇంట్రెస్టింగ్​గా మారనుంది. అయితే ఆల్​రౌండర్ల విభాగం మాత్రం కాస్త బలహీనంగా కనిపిస్తోంది. గాయం తర్వాత కమ్​బ్యాక్ ఇచ్చిన హార్దిక్ పాండ్యా అటు బ్యాటింగ్​లో, ఇటు బౌలింగ్​లో టోటల్ ఫెయిలయ్యాడు. మరో ఆల్​రౌండర్ శివమ్ దూబె బ్యాట్​తో దుమ్మురేపుతున్నా బౌలింగ్ ఎలా వేస్తాడో చెప్పలేం. ఐపీఎల్​-2024లో అతడు బౌలింగ్ చేయలేదు. దీంతో పొట్టి కప్పులో ఏ మేర రాణిస్తాడో ఇప్పుడే అంచనాకు రాలేం. భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఆల్​రౌండర్ల విభాగం ఒక్కటే టీమిండియాకు సమస్యగా మారిందన్నాడు.

‘వరల్డ్ కప్​లో టీమిండియా ఫేవరెట్ అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అయితే జట్టును ఆల్​రౌండర్ల కొరత వేధిస్తోంది. ఇదే టీమ్​కు వీక్​నెస్​గా మారింది. ఆస్ట్రేలియాను చూస్తే.. ఆ జట్టులో గ్లెన్ మాక్స్​వెల్, మిచ్ మార్ష్, కామెరాన్ గ్రీన్ వంటి సమర్థవంతమైన ఆల్​రౌండర్లు ఉన్నారు. వీళ్లు బ్యాట్​తో పాటు బాల్​తోనూ చెలరేగగలరు. కానీ భారత జట్టులో ఈ పరిస్థితి లేదు. అందుకే శివమ్ దూబేను తీసుకొచ్చారు. ఆల్​రౌండర్ల లోటుతో వచ్చే సమస్యను పరిష్కరించేందుకు దూబేను ఆడిస్తున్నారు’ అని మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు. ఇక, టీమిండియాలో స్పిన్ ఆల్​రౌండర్లుగా రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ రూపంలో ఇద్దరు క్వాలిటీ ప్లేయర్లు ఉన్నారు. అయితే వీళ్లలో ఎవరికీ తుదిజట్టులో చోటు దక్కుతుందో చెప్పలేం. జడ్డూ, దూబె, పాండ్యా, అక్షర్​ల్లో ఎవరు ఆడినా బ్యాటింగ్​లో రప్ఫాడించడంతో పాటు బౌలింగ్ టైమ్​లోనూ వికెట్లు తీయాలి. అలా చేయకపోతే రోహిత్ సేనకు ఇబ్బందులు తప్పవని ఎక్స్​పర్ట్స్ హెచ్చరిస్తున్నారు.