iDreamPost
android-app
ios-app

వరల్డ్ కప్​లో 17 ఏళ్లుగా చెక్కుచెదరని రికార్డు.. దాన్ని టచ్ చేసే దమ్ముందా?

  • Published Jun 01, 2024 | 1:54 PMUpdated Jun 01, 2024 | 1:54 PM

టీ20 వరల్డ్ కప్​లో ఓ రికార్డు 17 ఏళ్లుగా చెక్కుచెదరలేదు. ఎందరో తోపు ప్లేయర్లు దాన్ని బ్రేక్ చేయాలని చూశారు. కానీ ఒక్కరు కూడా దరిదాపుల్లోకి వెళ్లలేకపోయారు.

టీ20 వరల్డ్ కప్​లో ఓ రికార్డు 17 ఏళ్లుగా చెక్కుచెదరలేదు. ఎందరో తోపు ప్లేయర్లు దాన్ని బ్రేక్ చేయాలని చూశారు. కానీ ఒక్కరు కూడా దరిదాపుల్లోకి వెళ్లలేకపోయారు.

  • Published Jun 01, 2024 | 1:54 PMUpdated Jun 01, 2024 | 1:54 PM
వరల్డ్ కప్​లో 17 ఏళ్లుగా చెక్కుచెదరని రికార్డు.. దాన్ని టచ్ చేసే దమ్ముందా?

టీ20 వరల్డ్ కప్​-2024 సందడి మొదలయ్యేందుకు ఇంకా ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. మెగా టోర్నీ కోసం జట్లన్నీ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. కప్పు ఎగరేసుకుపోవాలని భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్, పాకిస్థాన్ లాంటి బిగ్ టీమ్స్ పట్టుదలతో ఉన్నాయి. బడా జట్లకు షాకివ్వాలని చూస్తున్నాయి బంగ్లాదేశ్, ఆఫ్ఘానిస్థాన్ వంటి స్మాల్ టీమ్స్. ఛాన్స్ దొరికితే తమ ఉనికి చాటుకోవాలని ఐర్లాండ్, నెదర్లాండ్స్, స్కాట్లాండ్ లాంటి పసికూన జట్లు భావిస్తున్నాయి. దీంతో ఈసారి మెగా టోర్నీ ఆసక్తికరంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. గెలుపోటములే కాదు.. చాలా రికార్డులు కూడా ఈసారి వరల్డ్ కప్​లో కీలకం కానున్నాయి. అందులోనూ ఒక రికార్డు గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

టీ20 ప్రపంచ కప్ మొదలై ఇప్పటికే 17 ఏళ్లు కావొస్తోంది. యూఎస్-వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న తాజా ఎడిషన్ 9వది కావడం గమనార్హం. అయితే ఇన్ని కప్పులు జరిగినా ఇప్పటిదాకా ఒక రికార్డు మాత్రం చెక్కుచెదరకుండా అలాగే ఉండిపోయింది. ఎందరో సూపర్​స్టార్లు పొట్టి కప్పులో ఆడినా ఆ రికార్డును మాత్రం బ్రేక్ చేయలేకపోయారు. కండలు తిరిగిన బ్యాటర్లు, మెరుపు షాట్లతో విరుచుకుపడే విధ్వంసకారులు కూడా దాన్ని టచ్ కూడా చేయలేకపోయారు. ఆ రికార్డే ఫాస్టెస్ట్ ఫిఫ్టీ. టీ20 వరల్డ్ కప్ ఫస్ట్ ఎడిషన్​లో టీమిండియా లెజెండ్ యువరాజ్ సింగ్ 12 బంతుల్లోనే 50 పరుగుల మార్క్​ను చేరుకొని విధ్వంసం సృష్టించాడు. ఇంగ్లండ్​తో జరిగిన ఆ మ్యాచ్​లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్​లో 6 బంతుల్లో 6 సిక్సర్లు కూడా బాదాడు.

ఇంగ్లండ్​పై యువీ బాదిన ఫాస్టెస్ట్ ఫిఫ్టీ ఇప్పటిదాకా అలాగే ఉండిపోయింది. ఎందరు తోపు బ్యాటర్లు వచ్చినా వరల్డ్ కప్​లో ఆ రికార్డుకు దగ్గర్లో కూడా రాలేకపోయారు. స్టీఫెన్ మైబగ్ (17 బంతుల్లో 50), మార్కస్ స్టొయినిస్ (17 బంతులు), గ్లెన్ మాక్స్​వెల్ (18 బంతులు), కేఎల్ రాహుల్ (18 బంతులు), షోయబ్ మాలిక్ (18 బంతులు) యువీ రికార్డును అధిగమించాలని ప్రయత్నించారు. కానీ వారి వల్ల కాలేదు. దీంతో ఈసారైనా ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డును ఎవరైనా అధిగమిస్తారేమోనని చూస్తున్నారు. ముఖ్యంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మీద అభిమానులు గంపెడాశలు పెట్టుకున్నారు. యువరాజ్ రికార్డును కొట్టే సత్తా అతడికి మాత్రమే ఉందని, అతడి అమ్ములపొదిలో అన్ని అస్త్రాలు ఉన్నాయని చెబుతున్నారు. భారతీయుడి రికార్డును మరో భారతీయుడు కొడితే భలేగా ఉంటుందని, హిట్​మ్యాన్​ ఈ ఫీట్ నమోదు చేస్తే చూడాలని ఉందంటున్నారు. మరి.. యువీ రికార్డును రోహిత్ బద్దలుకొట్టగలడా? మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి