Somesekhar
టీ20 వరల్డ్ కప్ లో భాగంగా అమెరికాతో జరిగే మ్యాచ్ కు ముందు.. టీమిండియా బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే..
టీ20 వరల్డ్ కప్ లో భాగంగా అమెరికాతో జరిగే మ్యాచ్ కు ముందు.. టీమిండియా బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే..
Somesekhar
టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా వరుసగా రెండు విజయాలు సాధించి.. మంచి జోరుమీదుంది. ఇక ఇదే ఊపును అమెరికాతో జరగబోయే మ్యాచ్ లో కూడా చూపించాలని భావిస్తోంది. ఇటీవల ముగిసిన ఐపీఎల్ లో దారుణంగా విఫలం అయ్యాడు పాండ్యా. బ్యాటింగ్, బౌలింగ్, కెప్టెన్ ఇలా మూడు విభాగాల్లో పూర్ ఫర్పామెన్స్ ఇచ్చి.. తీవ్ర విమర్శల పాలైయ్యాడు. కానీ ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ లో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై కీలక వ్యాఖ్యలు చేశాడు.
హార్దిక్ పాండ్యా.. ఐపీఎల్ 2024 టోర్నీ జరిగినన్ని రోజుల్లో వార్తలో నిలిచాడు. ఎప్పుడూ ఎవరో ఒకరు పాండ్యాను విమర్శిస్తూనే ఉన్నారు. ఈ విమర్శలు ఒకవైపు అయితే.. మరోవైపు దారుణంగా బ్యాటింగ్, బౌలింగ్, కెప్టెన్ గా విఫలం అవ్వడం. అతడిని వరల్డ్ కప్ కు ఎంపిక చేయడం కూడా దండగే అన్నారు. ఇవన్నీ కలిసి హార్దిక్ ను మానసికంగా కుంగదీశాయి. కానీ వాటన్నింటినీ తట్టుకుని గట్టిగా నిలబడ్డాడు పాండ్యా. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ లో సూపర్ ఫామ్ ను కనబరుస్తున్నాడు హార్దిక్. ఆడిన రెండు మ్యాచ్ ల్లో 5 వికెట్లు తీసి సత్తా చాటాడు. ఈ క్రమంలోనే టీమిండియా బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే పాండ్యాపై కీలక వ్యాఖ్యలు చేశాడు.
“హార్దిక్ పాండ్యా బౌలింగ్ పై మేము ఎప్పుడూ నమ్మకంగానే ఉన్నాం. అతడి బౌలింగ్ సత్తా మాకు తెలుసు. అయితే కొన్ని కొన్ని సార్లు ఎంత ప్రయత్నించినా రిథమ్ ను అందుకోలేరు ప్లేయర్లు. కొన్ని రోజుల క్రితం పాండ్యా ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నాడు. అయితే ఎక్కవ ప్రాక్టీస్ చేస్తేనే బౌలింగ్ లో రిథమ్ ను అందుకోగలరు. కష్టపడటానికి హార్ధిక్ ఏ మాత్రం సంకోచించడు. నిలకడగా బంతులు వేయడం కోసం తీవ్రంగా ప్రాక్టీస్ చేసిన పాండ్యా.. ఇప్పుడు ఆ ఫలితాలను రాబడుతున్నాడు. రాబోయే మ్యాచ్ ల్లో అతడు బ్యాటింగ్ లోనూ రాణిస్తాడు. పైగా పరిస్థితులకు అనుగుణంగా ఎలా బౌలింగ్ చేయాలో హార్దిక్ కు బాగా తెలుసు” అంటూ టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ గురించి చెప్పుకొచ్చాడు బౌలింగ్ కోచ్. మరి పాండ్యాపై టీమిండియా బౌలింగ్ కోచ్ చేసిన వ్యాఖ్యలు మీకేవిధంగా అనిపించాయో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.