iDreamPost

IND vs AFG: ఆఫ్గాన్ పై టీమిండియా సూపర్ విక్టరీ.. విజయానికి 3 ప్రధాన కారణాలు!

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా సూపర్ 8లో జరిగిన తొలి మ్యాచ్ లో 47 పరుగుల తేడాతో ఆఫ్గానిస్తాన్ ను చిత్తు చేసింది టీమిండియా. ఇక ఈ మ్యాచ్ లో భారత్ విజయానికి మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం పదండి.

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా సూపర్ 8లో జరిగిన తొలి మ్యాచ్ లో 47 పరుగుల తేడాతో ఆఫ్గానిస్తాన్ ను చిత్తు చేసింది టీమిండియా. ఇక ఈ మ్యాచ్ లో భారత్ విజయానికి మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం పదండి.

IND vs AFG: ఆఫ్గాన్ పై టీమిండియా సూపర్ విక్టరీ.. విజయానికి 3 ప్రధాన కారణాలు!

టీ20 వరల్డ్ కప్ లో తన విజయాల జోరును ప్రదర్శిస్తూ దూసుకెళ్తోంది టీమిండియా. గ్రూప్ దశలో వరుసగా మూడు విజయాలు సాధించి.. సూపర్ 8లోకి అడుగుపెట్టిన భారత్.. అదే ఊపును కొనసాగిస్తోంది. తాజాగా సూపర్ 8లో భాగంగా ఆఫ్గానిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో 47 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా తన స్థాయికి తగ్గ ప్రదర్శనతో ఆకట్టుకుంది. తొలుత బ్యాటర్లు చకచకా పరుగులు చేస్తే.. ఆ తర్వాత బౌలర్లు ఆఫ్గాన్ బ్యాటర్లను ఓ ఆటాడుకున్నారు. ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా విజయానికి మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.

టీమిండియా విజయానికి 3 ప్రధాన కారణాలు:

1. సూర్యకుమార్ బ్యాటింగ్

టీ20ల్లో నెం. 1  బ్యాటర్ గా కొనసాగుతున్న టీమిండియా స్టార్ ప్లేయర్ తన ర్యాంకుకు న్యాయం చేస్తూ.. ఈ మ్యాచ్ లో చెలరేగిపోయాడు. లీగ్ దశలో అమెరికాతో జరిగిన మ్యాచ్ లో హాఫ్ సెంచరీతో ఫామ్ లోకి వచ్చిన సూర్య.. అదే ఫామ్ ను ఆఫ్గాన్ పై కంటిన్యూ చేశాడు. టీమిండియా 181 పరుగులు చేయడంలో సూర్య బ్యాటింగే కీలకం. రోహిత్(8), కోహ్లీ(24), పంత్(20) అవుటవ్వడంతో.. టీమిండియా తక్కువ స్కోర్ కే పరిమితం అవుతుందని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా చెలరేగిన సూర్య కుమార్ 28 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సులతో 53 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. సూర్య సూపర్ ఇన్నింగ్స్ టీమిండియా విజయానికి ప్రధాన కారణం.

2. బుమ్రా సూపర్ స్పెల్

టీమిండియా నిర్దేశించిన 182 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఆఫ్గానిస్తాన్ బ్యాటర్లను ఓ ఆటాడుకున్నాడు యార్కర్ల కింగ్ జస్ప్రీత్ బుమ్రా. తన తొలి ఓవర్లోనే ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్(11)ను పెవిలియన్ కు పంపాడు. దాంతో మెుదలైన వికెట్ల పతనం వరుసగా కొనసాగింది. మెరుపు బంతులతో ఆఫ్గాన్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు బుమ్రా. హజ్రతుల్లా జాజాయ్(2), నజీబుల్లా జద్రాన్(19) వికెట్లను పడగొట్టి గట్టి దెబ్బకొట్టాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో ఒక మెయిడెన్ వేసి.. 7 రన్స్ మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఇక అతడికి తోడు అర్షదీప్ సింగ్ సైతం 3 వికెట్లతో చెలరేగిపోయాడు.

3. సమష్టి ప్రదర్శన

టీమిండియా ఈ మ్యాచ్ లో సమష్టి ప్రదర్శన కనబర్చింది. బ్యాటింగ్ లో విరాట్ కోహ్లీ(24), పంత్(20), సూర్య కుమార్(53), హార్దిక్ పాండ్యా(32) పరుగులతో రాణించి.. విజయానికి తమ వంతు కారణమైయ్యారు. ఇక 182 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో బౌలర్లు అదరగొట్టారు. మరీ ముఖ్యంగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా 7 రన్స్ కే 3 వికెట్లు పడగొట్టి.. ఆఫ్గాన్ పతనాన్ని శాసించాడు. అర్షదీప్ 3, కుల్దీప్ యాదవ్ 2, జడేజా ఒక వికెట్ పడగొట్టి విజయంలో తమవంతు పాత్రను నిర్వహించారు. మరి ఈ విజయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి