T20 World Cup 2024: టీమిండియాదే వరల్డ్ కప్.. కానీ అదొక్కటే అడ్డంకి: మైకేల్ క్లార్క్

టీ20 వరల్డ్ కప్​పై కన్నేసిన టీమిండియా.. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ టైటిల్​ను పట్టేయాలని చూస్తోంది. వన్డే వరల్డ్ కప్​ను కోల్పోయిన కసిలో ఉన్న రోహిత్ సేన.. మరింత పట్టుదలతో పొట్టి కప్పుకు సన్నద్ధం అవుతోంది.

టీ20 వరల్డ్ కప్​పై కన్నేసిన టీమిండియా.. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ టైటిల్​ను పట్టేయాలని చూస్తోంది. వన్డే వరల్డ్ కప్​ను కోల్పోయిన కసిలో ఉన్న రోహిత్ సేన.. మరింత పట్టుదలతో పొట్టి కప్పుకు సన్నద్ధం అవుతోంది.

టీ20 వరల్డ్ కప్-2024 మహా సంగ్రామానికి ఇంకా మూడ్రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. మెగా టోర్నీ కోసం ఇప్పటికే అన్ని జట్లు అమెరికాకు చేరుకున్నాయి. చాలా జట్లు తమ ప్రాక్టీస్ మ్యాచ్​లు కూడా ఆడేశాయి. టోర్నీ ఫేవరెట్లలో ఒకటైన భారత జట్టు కూడా ప్రపంచ కప్ సన్నాహాల్లో బిజీబిజీగా ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మ సహా ప్లేయర్లంతా జోరుగా సాధన చేస్తున్నారు. స్వదేశంలో జరిగిన వన్డే వరల్డ్ కప్-2023ని తృటిలో చేజార్చుకోవడంతో బాధలో ఉన్న రోహిత్ సేన.. ఈసారి ఎలాంటి తప్పులకు ఆస్కారం ఇవ్వొద్దని భావిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పొట్టి కప్పును స్వాధీనం చేసుకోవాలని చూస్తోంది. మిగిలిన జట్లను మట్టికరిపించి టైటిల్ విన్నర్​గా నిలవాలని ప్లాన్స్ వేస్తోంది.

టీ20 ప్రపంచ కప్​పై ప్రిడిక్షన్స్ మొదలైపోయాయి. క్రికెట్ ఎక్స్​పర్ట్స్, లెజెండ్స్, మాజీ క్రికెటర్లు తమ ప్రిడిక్షన్స్ చెబుతున్నారు. ఏ టీమ్ ఎంత వరకు వెళ్లగలదు, ఫైనల్​కు వెళ్లే సత్తా ఉన్న జట్లు ఏవనేది అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా దిగ్గజం మైకేల్ క్లార్క్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. యూఎస్​-వెస్టిండీస్ అతిథ్యం ఇస్తున్న మెగా టోర్నీలో మిగతా టాప్ టీమ్స్ కంటే భారత జట్టే హాట్ ఫేవరెట్​గా కనిపిస్తోందన్నాడు. వరల్డ్ కప్​ను రోహిత్ సేన గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పాడు. ఫేవరెట్లలో ఒకటైన ఆస్ట్రేలియాకు టీమిండియా నుంచే ముప్పు పొంచి ఉందన్నాడు. భారత్ కూడా కప్పు కొట్టాలంటే కంగారూల అడ్డంకిని దాటాల్సి ఉంటుందన్నాడు క్లార్క్.

‘టీ20 వరల్డ్ కప్-2024లో ఆస్ట్రేలియాకు అతిపెద్ద ముప్పు భారత్ నుంచే పొంచి ఉంది. మెగా టోర్నీలో టీమిండియా విజేతగా నిలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి’ అని క్లార్క్ చెప్పుకొచ్చాడు. భారత్​తో ఆసీస్​కు ముప్పు ఉందన్న ఈ మాజీ క్రికెటర్.. కప్పు కొట్టాలంటే ఇండియా కూడా కంగారూ అడ్డంకిని అధిగమించాల్సి ఉంటుందన్నాడు. క్లార్క్ ప్రిడిక్షన్​పై సోషల్ మీడియాలో నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. ఈసారి కప్పు భారత్​దేనని అంటున్నారు. అయితే వరల్డ్ కప్​కు టీమిండియాకు మధ్య ఆస్ట్రేలియా ఉందని, ఆ టీమ్​ను దాటితేనే ఛాంపియన్​ అవ్వగలదని చెబుతున్నారు. ఆసీస్ కూడా కప్పు కొట్టాలంటే రోహిత్ సేనను ఆపాల్సి ఉంటుందని.. వన్డే వరల్డ్ కప్​లాగే పొట్టి కప్పులో కూడా ఫైనల్ ఫైట్ ఈ రెండు టీమ్స్ మధ్య జరగడం ఖాయమని కామెంట్స్ చేస్తున్నారు.

Show comments