iDreamPost

Virat Kohli: ఆ మ్యాచ్​కు ముందు వణికిపోయా.. ఎప్పుడూ అలా జరగలేదు: కోహ్లీ

  • Published May 30, 2024 | 3:22 PMUpdated May 30, 2024 | 3:22 PM

టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దశాబ్దంన్నరగా అద్భుతమైన బ్యాటింగ్​తో అందర్నీ ఆకట్టుకుంటున్నాడు. ఎన్నో కఠిన మ్యాచుల్లో ఒంటిచేత్తో టీమ్​ను గట్టెక్కించాడు. అయితే ఆ రోజు మాత్రం టెన్షన్​తో వణికిపోయాడట.

టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దశాబ్దంన్నరగా అద్భుతమైన బ్యాటింగ్​తో అందర్నీ ఆకట్టుకుంటున్నాడు. ఎన్నో కఠిన మ్యాచుల్లో ఒంటిచేత్తో టీమ్​ను గట్టెక్కించాడు. అయితే ఆ రోజు మాత్రం టెన్షన్​తో వణికిపోయాడట.

  • Published May 30, 2024 | 3:22 PMUpdated May 30, 2024 | 3:22 PM
Virat Kohli: ఆ మ్యాచ్​కు ముందు వణికిపోయా.. ఎప్పుడూ అలా జరగలేదు: కోహ్లీ

టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దశాబ్దంన్నరగా అద్భుతమైన బ్యాటింగ్​తో అందర్నీ ఆకట్టుకుంటున్నాడు. ఎన్నో కఠిన మ్యాచుల్లో ఒంటిచేత్తో టీమ్​ను గట్కెక్కించాడు. అతడు క్రీజులో ఉన్నాడంటే చాలు.. అవతలి జట్టు విజయంపై ఆశలు వదులుకోవాల్సిందే. యాంకర్ ఇన్నింగ్స్​ ఆడుతూ, అవసరమైతే ఆఖర్లో గేర్లు మార్చి వేగం పెంచడం కూడా కింగ్​కు అలవాటు. అందుకే అతడు ఆడుతున్నాడంటే అవతలి జట్టు వణికిపోతుంది. అతడ్ని ఎలా ఆపాలో అర్థం కాక బౌలర్లంతా తలలు పట్టుకుంటారు. అయితే అపోజిషన్ టీమ్స్​ను భయపెట్టే కోహ్లీ.. ఆ రోజు మాత్రం టెన్షన్​తో వణికిపోయాడట. ఆందోళనతో ఏం చేయాలో పాలుపోలేదట. అసలు.. కోహ్లీ అంతగా టెన్షన్ పడటానికి కారణం ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..

కోహ్లీ కెరీర్​ స్టార్టింగ్ డేస్ అవి. అప్పుడప్పుడే టీమ్​లో సెటిల్ అవుతున్నాడు. అంతలోనే వన్డే వరల్డ్ కప్ వచ్చేసింది. అప్పటికే తాను ఏంటో ప్రూవ్ చేసుకోవడంతో విరాట్​కు టీమ్​లో చోటు దక్కింది. వీరేంద్ర సెహ్వాగ్, గౌతం గంభీర్, సచిన్ టెండూల్కర్, జహీర్ ఖాన్, ఆశిష్ నెహ్రా, హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్, ఎంఎస్ ధోని, సురేష్ రైనా లాంటి లెజెండ్స్​తో కలసి డ్రెస్సింగ్​ రూమ్​ను షేర్ చేసుకుంటున్నాడు. ఒకవైపు ఫస్ట్ వరల్డ్ కప్ ఆడుతుండటం, మరోవైపు దిగ్గజ ప్లేయర్లతో కలసి ఆడుతుండటంతో ఆందోళనకు లోనయ్యాడు కోహ్లీ. ఆ సమయంలో ఏం చేయాలో పాలుపోలేదని, తీవ్రంగా ఆందోళన చెందానని చెప్పాడు విరాట్. అలా మళ్లీ ఎప్పుడూ జరగలేదన్నాడు.

‘వన్డే ప్రపంచ కప్-2011లో ఢాకా వేదికగా బంగ్లాదేశ్​తో తొలి మ్యాచ్ ఆడా. ఆ టైమ్​లో చాలా టెన్షన్ పడ్డా. ఇది నిజం. బైలాటరల్ సిరీస్​ల్లో ఆడటం వేరు. మెగా టోర్నీల్లో టీమ్​ తరఫున బరిలోకి దిగడం వేరు. అప్పుడు టీమ్​లో అందరికంటే నేనే చిన్నవాడ్ని. సచిన్ టెండూల్కర్ లాంటి గ్రేట్ ప్లేయర్లతో కలసి ఆడే ఛాన్స్ రావడం అద్భుతం. అయితే మ్యాచ్​కు ముందు రోజు వరకు కూడా నేను ఆందోళనగానే ఉన్నా. ఇలా ఉండటంలో తప్పేం లేదు. వీటిని మంచి శకునాలుగానే చూడాలి. టెన్షన్​లో ఉన్నప్పుడే మన బెస్ట్ గేమ్​ను బయటకు తీసుకురాగలం. దాని కోసం మెంటల్​గా, ఫిజికల్​గా ప్రిపేర్ అయ్యా. నా ప్లాన్స్​ను ఎగ్జిక్యూట్ చేసేందుకు ఆ నెర్వస్​నెస్ ఎంతో ఉపయోగపడింది’ అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఇక, విరాట్ ఇప్పుడు భీకర ఫామ్​లో ఉన్నాడు. ఐపీఎల్​-2024లో ఏకంగా 741 పరుగులు చేశాడు. అతడు ఇదే ఫామ్​ను టీ20 వరల్డ్ కప్​లోనూ కొనసాగిస్తే భారత్​కు తిరుగుండదు. మరి.. మెగా టోర్నీలో కోహ్లీ బ్యాట్​తో మ్యాజిక్ చేయగలడని మీరు భావిస్తే కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి