Nidhan
టీ20 వరల్డ్ కప్‌పై కన్నేసిన టీమిండియా.. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ టైటిల్‌ను పట్టేయాలని చూస్తోంది. వన్డే వరల్డ్ కప్‌ను కోల్పోయిన కసిలో ఉన్న రోహిత్ సేన.. మరింత పట్టుదలతో పొట్టి కప్పుకు సన్నద్ధం అవుతోంది.
టీ20 వరల్డ్ కప్‌పై కన్నేసిన టీమిండియా.. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ టైటిల్‌ను పట్టేయాలని చూస్తోంది. వన్డే వరల్డ్ కప్‌ను కోల్పోయిన కసిలో ఉన్న రోహిత్ సేన.. మరింత పట్టుదలతో పొట్టి కప్పుకు సన్నద్ధం అవుతోంది.
Nidhan
టీ20 వరల్డ్ కప్-2024 మహా సంగ్రామానికి ఇంకా మూడ్రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. మెగా టోర్నీ కోసం ఇప్పటికే అన్ని జట్లు అమెరికాకు చేరుకున్నాయి. చాలా జట్లు తమ ప్రాక్టీస్ మ్యాచ్‌లు కూడా ఆడేశాయి. టోర్నీ ఫేవరెట్లలో ఒకటైన భారత జట్టు కూడా ప్రపంచ కప్ సన్నాహాల్లో బిజీబిజీగా ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మ సహా ప్లేయర్లంతా జోరుగా సాధన చేస్తున్నారు. స్వదేశంలో జరిగిన వన్డే వరల్డ్ కప్-2023ని తృటిలో చేజార్చుకోవడంతో బాధలో ఉన్న రోహిత్ సేన.. ఈసారి ఎలాంటి తప్పులకు ఆస్కారం ఇవ్వొద్దని భావిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పొట్టి కప్పును స్వాధీనం చేసుకోవాలని చూస్తోంది. మిగిలిన జట్లను మట్టికరిపించి టైటిల్ విన్నర్‌గా నిలవాలని ప్లాన్స్ వేస్తోంది.
టీ20 ప్రపంచ కప్‌పై ప్రిడిక్షన్స్ మొదలైపోయాయి. క్రికెట్ ఎక్స్పర్ట్స్, లెజెండ్స్, మాజీ క్రికెటర్లు తమ ప్రిడిక్షన్స్ చెబుతున్నారు. ఏ టీమ్ ఎంత వరకు వెళ్లగలదు, ఫైనల్‌కు వెళ్లే సత్తా ఉన్న జట్లు ఏవనేది అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా దిగ్గజం మైకేల్ క్లార్క్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. యూఎస్-వెస్టిండీస్ అతిథ్యం ఇస్తున్న మెగా టోర్నీలో మిగతా టాప్ టీమ్స్ కంటే భారత జట్టే హాట్ ఫేవరెట్‌గా కనిపిస్తోందన్నాడు. వరల్డ్ కప్‌ను రోహిత్ సేన గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పాడు. ఫేవరెట్లలో ఒకటైన ఆస్ట్రేలియాకు టీమిండియా నుంచే ముప్పు పొంచి ఉందన్నాడు. భారత్ కూడా కప్పు కొట్టాలంటే కంగారూల అడ్డంకిని దాటాల్సి ఉంటుందన్నాడు క్లార్క్.
‘టీ20 వరల్డ్ కప్-2024లో ఆస్ట్రేలియాకు అతిపెద్ద ముప్పు భారత్ నుంచే పొంచి ఉంది. మెగా టోర్నీలో టీమిండియా విజేతగా నిలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి’ అని క్లార్క్ చెప్పుకొచ్చాడు. భారత్‌తో ఆసీస్‌కు ముప్పు ఉందన్న ఈ మాజీ క్రికెటర్.. కప్పు కొట్టాలంటే ఇండియా కూడా కంగారూ అడ్డంకిని అధిగమించాల్సి ఉంటుందన్నాడు. క్లార్క్ ప్రిడిక్షన్‌పై సోషల్ మీడియాలో నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. ఈసారి కప్పు భారత్‌దేనని అంటున్నారు. అయితే వరల్డ్ కప్‌కు టీమిండియాకు మధ్య ఆస్ట్రేలియా ఉందని, ఆ టీమ్‌ను దాటితేనే ఛాంపియన్ అవ్వగలదని చెబుతున్నారు. ఆసీస్ కూడా కప్పు కొట్టాలంటే రోహిత్ సేనను ఆపాల్సి ఉంటుందని.. వన్డే వరల్డ్ కప్‌లాగే పొట్టి కప్పులో కూడా ఫైనల్ ఫైట్ ఈ రెండు టీమ్స్ మధ్య జరగడం ఖాయమని కామెంట్స్ చేస్తున్నారు.
Michael Clarke said, “India are the biggest threat to Australia in the T20 World Cup. India are the favourites to win it”. (ESPN Australia). pic.twitter.com/0vNm6QhxpZ
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 30, 2024