iDreamPost
android-app
ios-app

సూపర్-8కు ముందు ప్రత్యర్థులకు సూర్యకుమార్ వార్నింగ్.. అది రిపీట్ అవ్వదంటూ..!

  • Published Jun 19, 2024 | 3:15 PMUpdated Jun 19, 2024 | 3:15 PM

పొట్టి కప్పు ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. గ్రూప్ స్టేజ్ నుంచి సూపర్-8 దిశగా టోర్నీ టర్న్ తీసుకుంటోంది. ఇక మీదట జరగబోయే ప్రతి మ్యాచ్ చావోరేవో కానుంది.

పొట్టి కప్పు ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. గ్రూప్ స్టేజ్ నుంచి సూపర్-8 దిశగా టోర్నీ టర్న్ తీసుకుంటోంది. ఇక మీదట జరగబోయే ప్రతి మ్యాచ్ చావోరేవో కానుంది.

  • Published Jun 19, 2024 | 3:15 PMUpdated Jun 19, 2024 | 3:15 PM
సూపర్-8కు ముందు ప్రత్యర్థులకు సూర్యకుమార్ వార్నింగ్.. అది రిపీట్ అవ్వదంటూ..!

పొట్టి కప్పు ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. గ్రూప్ స్టేజ్ నుంచి సూపర్-8 దిశగా టోర్నీ టర్న్ తీసుకుంటోంది. ఇక మీదట జరగబోయే ప్రతి మ్యాచ్ చావోరేవో కానుంది. గెలిచిన జట్టు నాకౌట్ రేసులో ఉంటుంది. ఓడిన టీమ్ ఇంటిదారి పట్టాల్సిందే. టఫ్ కాంపిటీషన్, హై ప్రెజర్​ను తట్టుకొని నిలబడ్డ జట్టు ముందుకు వెళ్తుంది. సూపర్ పోరు కోసం అన్ని టీమ్స్ సిద్ధమవుతున్నాయి. టీమిండియా కూడా అందుకు తగ్గట్లు జోరుగా సాధన చేస్తోంది. గ్రూప్ దశలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకొని సన్నద్ధమవుతోంది. బౌలింగ్ దళం చెలరేగి ఆడుతున్నా.. బ్యాటింగ్ యూనిట్ గాడిన పడాల్సి ఉంది. అమెరికాలోని ట్రిక్కీ పిచ్​లపై వికెట్ కీపర్ రిషబ్ పంత్ తప్ప ఎవరూ రాణించలేదు. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా వరుస మ్యాచుల్లో ఫెయిల్ అయ్యాడు. మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ రాణించినా తన సహజ శైలిలో ఆడలేకపోయాడు.

యూఎస్​ఏ పిచ్​లపై అటు షాట్లు బాదలేక, ఇటు స్ట్రైక్ రొటేషన్ చేయలేక భారత బ్యాటర్లు ఆపసోపాలు పడ్డారు. పరుగులు రాకపోవడంతో భారీ షాట్లకు ప్రయత్నించి వికెట్లు పారేసుకున్నారు. అయితే బౌలింగ్ యూనిట్ రఫ్ఫాడించడంతో టీమ్ ఆ దశను దాటింది. కానీ సూపర్-8లో అలా ఆడతానంటే కుదరదు. నెక్స్ట్ స్టేజ్ మ్యాచెస్ అన్నీ కరీబియన్ పిచ్​లపై జరగనున్నాయి. ఇక్కడి స్లో వికెట్లపై ఒక్కో పరుగు కోసం తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సూర్యకుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. లీగ్ స్టేజ్​లో జరిగిన మిస్టేక్స్ మళ్లీ రిపీట్ అవ్వవని చెప్పాడు. ఇక మీదట సిసలైన బ్యాటింగ్ ఎలా ఉంటుందో చూపిస్తామంటూ ప్రత్యర్థి జట్లకు హెచ్చరికలు పంపాడు.

‘రెండేళ్లుగా టీ20ల్లో నంబర్​ వన్ బ్యాటర్​గా కొనసాగుతున్నా. అయితే ఆ హోదాకు తగ్గట్లు ఆడలేకపోయా. నంబర్ వన్ బ్యాటర్ అంటే ఎలాంటి సిచ్యువేషన్స్​లో అయినా పరుగులు చేయాలి. టీమ్ అవసరాలకు తగ్గట్లు బ్యాటింగ్ స్టైల్​ను అడ్జస్ట్ చేసుకోవాలి. నేను కూడా అదే ప్రయత్నిస్తుంటా. పిచ్​ మీద పేస్ లేనప్పుడు పవర్​ఫుల్ షాట్లు ఆడటం అంత ఈజీ కాదు. అలాంటప్పుడు ఇన్నింగ్స్​ను తెలివిగా బిల్డ్ చేయాలి. పరిస్థితులకు తగ్గట్లు బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. జట్టు అవసరాలకు తగ్గట్లు పార్ట్​నర్​తో కలసి డిస్కస్ చేసుకుంటూ ఇన్నింగ్స్​ను నడిపించాలి. అలాంటి సందర్భాల్లో మన బ్యాటింగ్ స్టైల్​ను పక్కనబెట్టి కూల్​గా జట్టుకు ఏం కావాలో అది చేస్తూ పోవాలి’ అని సూర్యకుమార్ చెప్పుకొచ్చాడు. మరి.. సూపర్ పోరులో సూర్యకుమార్ సత్తా చాటుతాడని మీరు భావిస్తే కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి