Nidhan
యంగ్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌ను వరల్డ్ కప్ మధ్యలోనే ఇంటికి పంపించాలని డిసైడ్ అయింది టీమిండియా. అతడితో పాటు ట్రావెలింగ్ రిజర్వ్‌గా ఉన్న పేసర్ ఆవేశ్ ఖాన్‌ను కూడా స్వదేశానికి వెళ్లమని ఆదేశించింది.
యంగ్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌ను వరల్డ్ కప్ మధ్యలోనే ఇంటికి పంపించాలని డిసైడ్ అయింది టీమిండియా. అతడితో పాటు ట్రావెలింగ్ రిజర్వ్‌గా ఉన్న పేసర్ ఆవేశ్ ఖాన్‌ను కూడా స్వదేశానికి వెళ్లమని ఆదేశించింది.
Nidhan
టీ20 ప్రపంచ కప్-2024లో టీమిండియా బ్రేకుల్లేని బుల్డోజర్లా దూసుకుపోతోంది. ఇప్పటిదాకా ఆడిన మూడు మ్యాచుల్లోనూ నెగ్గి సూపర్-8కు క్వాలిఫై అయింది రోహిత్ సేన. ఆరంభ మ్యాచ్‌లో ఐర్లాండ్‌ను, తర్వాతి మ్యాచ్‌లో దాయాది పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. మూడో మ్యాచ్‌లో డేంజరస్ టీమ్ యూఎస్ఏను కూడా మట్టికరిపించింది. ఇవాళ లాస్ట్ మ్యాచ్‌లో మరో పసికూన కెనడాను ఢీకొట్టేందుకు సిద్ధమవుతోంది. అటు బ్యాటర్లు ఫామ్ అందుకోవడం, ఇటు బౌలర్లు అదరగొడుతుండటంతో భారత జట్టుకు ఎదురులేకుండా పోయింది. ఇదే జోష్‌ను సూపర్-8లోనూ కొనసాగిస్తే అలవోకగా సెమీస్ బెర్త్ దక్కుతుంది. గత మ్యాచుల్లో చేసిన పొరపాట్లను సరిదిద్దుకొని మున్ముందు సవాళ్లకు సిద్దమవుతోంది. అయితే భారత జట్టుకు సంబంధించిన ఓ విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
వరల్డ్ కప్-2024 మధ్యలోనే ఇద్దరు యంగ్ ప్లేయర్లను స్వదేశానికి పంపాలని నిర్ణయించింది టీమిండియా. ట్రావెలింగ్ రిజర్వ్డ్గా ఉన్న ఓపెనర్ శుబ్‌మన్ గిల్, పేసర్ ఆవేశ్ ఖాన్‌ను భారత్‌కు వెళ్లాల్సిందిగా టీమ్ మేనేజ్మెంట్ ఆదేశించింది. అయితే ఇదే కేటగిరీలో ఉన్న ఫినిషర్ రింకూ సింగ్, సీమర్ ఖలీల్ అహ్మద్ మాత్రం స్క్వాడ్‌తో తమ జర్నీని కంటిన్యూ చేయనున్నారు. కెనడాతో మ్యాచ్ తర్వాత గిల్, ఆవేశ్ స్వదేశానికి పయనం కానున్నారని తెలిసింది. ఓపెనింగ్ పొజిషన్‌కు రోహిత్ శర్మకు తోడుగా యశస్వి జైస్వాల్ రూపంలో బ్యాకప్ ఉండటం, కీపర్ సంజూ శాంసన్ రూపంలో మరో ఆప్షన్ కూడా ఉండటంతో గిల్‌ను వెనక్కి పంపాలని డిసైడ్ అయ్యారని సమాచారం. అలాగే జస్ప్రీత్ బుమ్రాతో పాటు అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబె రూపంలో కావాల్సినంత పేసర్లు ఉండటంతో ఆవేశ్‌ను ఇంటికి పంపిస్తున్నట్లు టాక్. ఆవేశ్ విషయమేమో గానీ.. గిల్‌ను టీమ్‌లో నుంచి తీసేయడంపై రకరకాల కథనాలు వస్తున్నాయి.
ఉన్నపళంగా టీమిండియా స్క్వాడ్ నుంచి గిల్‌ను తీసేయడానికి అతడి ప్రవర్తనే కారణమని వినిపిస్తోంది. మెగా టోర్నీ కోసం యూఎస్ఏకు వచ్చిన గిల్.. మొదట్నుంచి టీమ్‌తో అంటీముట్టనట్లు ఉంటున్నాడని టాక్ నడుస్తోంది. ప్రాక్టీస్ సెషన్స్‌కు కూడా డుమ్మా కొట్టాడని రూమర్స్ వస్తున్నాయి. జట్టుతో ఉంటూ సాధన చేయడం, మ్యాచ్‌ల సమయంలో సపోర్ట్ చేయాల్సింది పోయి అవేవీ పట్టనట్లు వ్యవహరిస్తుండటంతో అతడిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని మేనేజ్మెంట్ భావించిందట. అందుకే టోర్నీ మధ్యలోనే అతడ్ని టీమ్‌లో నుంచి తీసేసిందని క్రికెట్ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ఇందులో ఎంత నిజం ఉందనేది తెలియదు. కానీ గిల్ ప్రవర్తన కారణంగానే దూరం పెట్టారని మాత్రం పుకార్లు షికారు చేస్తున్నాయి. కాగా, భారత్-పాకిస్థాన్ మ్యాచ్ టైమ్‌లో రింకూ సింగ్, ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్‌లు కెమెరాల్లో కనిపించారు. టీమిండియాను సపోర్ట్ చేస్తూ హల్చల్ చేశారు. అయితే ట్రావెలింగ్ రిజర్వ్‌డ్‌లో భాగమైన గిల్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. దీంతో అతడ్ని తీసేయడానికి బిహేవియరే కారణమనే రూమర్లకు మరింత బలం చేకూరినట్లైంది.
🚨According to Reports,Shubman Gill Released From India Squad Due To Disciplinary Issues.
Ever since he has been in the USA,he has not been seen travelling with the team. Moreover, he is rumoured to spend his time away from the team and indulge in side businesses.
He is yet to… pic.twitter.com/d1nBLVFkq1
— Sujeet Suman (@sujeetsuman1991) June 15, 2024