iDreamPost
android-app
ios-app

గిల్​ను ఇంటికి పంపడం వెనుక అసలు నిజం.. ఆ తప్పు వల్లే టీమ్​ నుంచి ఔట్!

  • Published Jun 15, 2024 | 3:40 PM Updated Updated Jun 15, 2024 | 3:40 PM

యంగ్ ఓపెనర్ శుబ్​మన్ గిల్​ను వరల్డ్ కప్ మధ్యలోనే ఇంటికి పంపించాలని డిసైడ్ అయింది టీమిండియా. అతడితో పాటు ట్రావెలింగ్ రిజర్వ్​గా ఉన్న పేసర్ ఆవేశ్​ ఖాన్​ను కూడా స్వదేశానికి వెళ్లమని ఆదేశించింది.

యంగ్ ఓపెనర్ శుబ్​మన్ గిల్​ను వరల్డ్ కప్ మధ్యలోనే ఇంటికి పంపించాలని డిసైడ్ అయింది టీమిండియా. అతడితో పాటు ట్రావెలింగ్ రిజర్వ్​గా ఉన్న పేసర్ ఆవేశ్​ ఖాన్​ను కూడా స్వదేశానికి వెళ్లమని ఆదేశించింది.

  • Published Jun 15, 2024 | 3:40 PMUpdated Jun 15, 2024 | 3:40 PM
గిల్​ను ఇంటికి పంపడం వెనుక అసలు నిజం.. ఆ తప్పు వల్లే టీమ్​ నుంచి ఔట్!

టీ20 ప్రపంచ కప్-2024లో టీమిండియా బ్రేకుల్లేని బుల్డోజర్​లా దూసుకుపోతోంది. ఇప్పటిదాకా ఆడిన మూడు మ్యాచుల్లోనూ నెగ్గి సూపర్-8కు క్వాలిఫై అయింది రోహిత్ సేన. ఆరంభ మ్యాచ్​లో ఐర్లాండ్​ను, తర్వాతి మ్యాచ్​లో దాయాది పాకిస్థాన్​ను చిత్తు చేసింది. మూడో మ్యాచ్​లో డేంజరస్ టీమ్ యూఎస్​ఏను కూడా మట్టికరిపించింది. ఇవాళ లాస్ట్ మ్యాచ్​లో మరో పసికూన కెనడాను ఢీకొట్టేందుకు సిద్ధమవుతోంది. అటు బ్యాటర్లు ఫామ్ అందుకోవడం, ఇటు బౌలర్లు అదరగొడుతుండటంతో భారత జట్టుకు ఎదురులేకుండా పోయింది. ఇదే జోష్​ను సూపర్-8లోనూ కొనసాగిస్తే అలవోకగా సెమీస్​ బెర్త్ దక్కుతుంది. గత మ్యాచుల్లో చేసిన పొరపాట్లను సరిదిద్దుకొని మున్ముందు సవాళ్లకు సిద్దమవుతోంది. అయితే భారత జట్టుకు సంబంధించిన ఓ విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

వరల్డ్ కప్-2024 మధ్యలోనే ఇద్దరు యంగ్ ప్లేయర్లను స్వదేశానికి పంపాలని నిర్ణయించింది టీమిండియా. ట్రావెలింగ్ రిజర్వ్​డ్​గా ఉన్న ఓపెనర్ శుబ్​మన్ గిల్, పేసర్ ఆవేశ్​ ఖాన్​ను భారత్​కు వెళ్లాల్సిందిగా టీమ్ మేనేజ్​మెంట్ ఆదేశించింది. అయితే ఇదే కేటగిరీలో ఉన్న ఫినిషర్ రింకూ సింగ్, సీమర్ ఖలీల్ అహ్మద్ మాత్రం స్క్వాడ్​తో తమ జర్నీని కంటిన్యూ చేయనున్నారు. కెనడాతో మ్యాచ్ తర్వాత గిల్, ఆవేశ్​ స్వదేశానికి పయనం కానున్నారని తెలిసింది. ఓపెనింగ్ పొజిషన్​కు రోహిత్ శర్మకు తోడుగా యశస్వి జైస్వాల్ రూపంలో బ్యాకప్ ఉండటం, కీపర్ సంజూ శాంసన్ రూపంలో మరో ఆప్షన్ కూడా ఉండటంతో గిల్​ను వెనక్కి పంపాలని డిసైడ్ అయ్యారని సమాచారం. అలాగే జస్​ప్రీత్ బుమ్రాతో పాటు అర్ష్​దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబె రూపంలో కావాల్సినంత పేసర్లు ఉండటంతో ఆవేశ్​ను ఇంటికి పంపిస్తున్నట్లు టాక్. ఆవేశ్​ విషయమేమో గానీ.. గిల్​ను టీమ్​లో నుంచి తీసేయడంపై రకరకాల కథనాలు వస్తున్నాయి.

ఉన్నపళంగా టీమిండియా స్క్వాడ్​ నుంచి గిల్​ను తీసేయడానికి అతడి ప్రవర్తనే కారణమని వినిపిస్తోంది. మెగా టోర్నీ కోసం యూఎస్​ఏకు వచ్చిన గిల్.. మొదట్నుంచి టీమ్​తో అంటీముట్టనట్లు ఉంటున్నాడని టాక్ నడుస్తోంది. ప్రాక్టీస్ సెషన్స్​కు కూడా డుమ్మా కొట్టాడని రూమర్స్ వస్తున్నాయి. జట్టుతో ఉంటూ సాధన చేయడం, మ్యాచ్​ల సమయంలో సపోర్ట్ చేయాల్సింది పోయి అవేవీ పట్టనట్లు వ్యవహరిస్తుండటంతో అతడిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని మేనేజ్​మెంట్ భావించిందట. అందుకే టోర్నీ మధ్యలోనే అతడ్ని టీమ్​లో నుంచి తీసేసిందని క్రికెట్ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ఇందులో ఎంత నిజం ఉందనేది తెలియదు. కానీ గిల్​ ప్రవర్తన కారణంగానే దూరం పెట్టారని మాత్రం పుకార్లు షికారు చేస్తున్నాయి. కాగా, భారత్-పాకిస్థాన్ మ్యాచ్ టైమ్​లో రింకూ సింగ్, ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్​లు కెమెరాల్లో కనిపించారు. టీమిండియాను సపోర్ట్ చేస్తూ హల్​చల్ చేశారు. అయితే ట్రావెలింగ్ రిజర్వ్​డ్​లో భాగమైన గిల్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. దీంతో అతడ్ని తీసేయడానికి బిహేవియరే కారణమనే రూమర్లకు మరింత బలం చేకూరినట్లైంది.