రోహిత్ శర్మ రేర్ మైల్ స్టోన్! ఈ వరల్డ్ కప్ లో ఇదే తొలిసారి..

రోహిత్ శర్మ రేర్ మైల్ స్టోన్! ఈ వరల్డ్ కప్ లో ఇదే తొలిసారి..

టీ20 ప్రపంచ కప్ లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనతను సాధించాడు. ఇలా జరగడం ఈ వరల్డ్ కప్ లో ఇదే తొలిసారి కావడం విశేషం.

టీ20 ప్రపంచ కప్ లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనతను సాధించాడు. ఇలా జరగడం ఈ వరల్డ్ కప్ లో ఇదే తొలిసారి కావడం విశేషం.

టీ20 వరల్డ్ కప్ లో ఫామ్ తో సతమతమవుతున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ తో స్వింగ్ లోకి వచ్చాడు. అంతకు ముందు ఈ టోర్నీలో ఒక హాఫ్ సెంచరీ మాత్రమే కొట్టాడు. ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో తన విశ్వరూపం చూపించాడు. ఈ మ్యాచ్ లో 224 స్ట్రైక్ రేట్ తో కేవలం 41 బంతుల్లోనే 7 ఫోర్లు, 8 సిక్సులతో 92 పరుగులు చేసి.. కొద్దిలో సెంచరీని చేజార్చుకున్నాడు. ఇక ఈ మ్యాచ్ ద్వారా హిట్ మ్యాన్ క్రేజీ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే..

టీ20 వరల్డ్ కప్ 2024.. సూపర్ 8లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో టీమిండియా 24 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ చెలరేగిన విధానం మాటల్లో వర్ణించలేనిది. సిక్సులు, ఫోర్లతో ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు హిట్ మ్యాన్. రోహిత్ సెంచరీ చేస్తాడని అందరూ భావించారు. కానీ దురదృష్టవశాత్తు 41 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సులతో 92 పరుగులు చేసి కొద్దిలో శతకాన్ని మిస్ చేసుకున్నాడు. ఇక ఈ మ్యాచ్ ద్వారా టోర్నీ బ్రాడ్ కాస్టర్ హాట్ స్టార్ సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఇందులో రోహిత్ శర్మ కూడా భాగం పంచుకుని అరుదైన ఘనత సాధించాడు. అసలు విషయం ఏంటంటే?

ఆస్ట్రేలియాతో ఇటీవల ముగిసిన మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ  బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో హాట్ స్టార్ లో పీక్ వ్యూయర్ షిప్ వచ్చింది. హిట్ మ్యాన్ బ్యాటింగ్ చేస్తుంటే హాట్ స్టార్ లో ఏకంగా 3.1 కోట్ల మంది వీక్షించారు. ఇది ఈ వరల్డ్ కప్ లోనే ఇప్పటి వరకు అత్యధిక వ్యూయర్ షిప్ గా రికార్డుల్లోకి ఎక్కింది. హాట్ స్టార్ అందుకున్న అతి గొప్ప అచీవ్ మెంట్. ఇది రోహిత్ శర్మ క్రేజ్ కు ఓ ఉదాహరణ. ఇక ఈ వరల్డ్ కప్ లో ఇంత మెుత్తం వీక్షణలు రావడంతో.. రోహిత్ కూడా రేర్ మైల్ స్టోన్ ను అచీవ్ చేసినట్లు అయ్యింది. రోహిత్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఈ రేంజ్ లో వ్యూయర్ షిప్ రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments