Nidhan
కెప్టెన్ రోహిత్ శర్మ టీమిండియాను అద్భుతంగా లీడ్ చేస్తున్నాడు. వన్డే వరల్డ్ కప్‌తో పాటు టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లోనూ జట్టును ఫైనల్స్‌కు చేర్చాడు హిట్‌మ్యాన్. ఇప్పుడు పొట్టి కప్పులోనూ టీమ్‌ను ముందుండి నడుపుతున్నాడు.
కెప్టెన్ రోహిత్ శర్మ టీమిండియాను అద్భుతంగా లీడ్ చేస్తున్నాడు. వన్డే వరల్డ్ కప్‌తో పాటు టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లోనూ జట్టును ఫైనల్స్‌కు చేర్చాడు హిట్‌మ్యాన్. ఇప్పుడు పొట్టి కప్పులోనూ టీమ్‌ను ముందుండి నడుపుతున్నాడు.
Nidhan
కెప్టెన్ రోహిత్ శర్మ టీమిండియాను అద్భుతంగా లీడ్ చేస్తున్నాడు. వన్డే వరల్డ్ కప్‌తో పాటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లోనూ జట్టును ఫైనల్స్‌కు చేర్చాడు హిట్‌మ్యాన్. ఇప్పుడు పొట్టి కప్పులోనూ టీమ్‌ను ముందుండి నడుపుతున్నాడు. 50 ఓవర్ల ఫార్మాట్‌తో పాటు టెస్టుల్లో జట్టుకు కప్పు అందించడంలో ఫెయిలయ్యాడు. కానీ బ్యాటర్‌గా, సారథిగా తన మార్క్ చూపిస్తున్నాడు. అతడి కెప్టెన్సీలో టీమ్‌లో ఓ బ్యాలెన్స్ వచ్చింది. ప్రతి ప్లేయర్‌కు ఓ రోల్ అనేది ఫిక్స్ అయింది. దాని ప్రకారం ఆడుతూ మంచి ఫలితాలు సాధిస్తున్నారు. వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు విజయం ముఖ్యమనే భావన అందరిలోనూ వచ్చింది. ఇప్పుడు టీమ్ చాలా ఎక్స్పీరియెన్స్డ్ సైడ్‌గా మారింది. కాబట్టి ఇదే ఊపులో టీ20 కప్పు కొట్టాలని చూస్తోంది. అయితే వరల్డ్ కప్ ముగిసిన తర్వాత భారత జట్టు కెప్టెన్సీలో మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
రోహిత్ టీ20ల్లో కొనసాగకపోవచ్చని.. ఈ వరల్డ్ కప్ అతడికి ఆఖరిదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత వన్డేలకు కూడా గుడ్‌బై చెప్పి.. కేవలం టెస్టులకే పరిమితమవుతాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అతడి వారసుడిగా ఎవరు వస్తారనేది ఆసక్తికరంగా మారింది. వైట్ బాల్ క్రికెట్లో హార్దిక్ పాండ్యాను అతడికి ప్రత్యామ్నాయంగా భావించారు. వైస్ కెప్టెన్సీ ఇచ్చి ఎంకరేజ్ చేసినా.. అతడు అంతగా సక్సెస్ కాలేకపోతున్నాడు. దీంతో రిషబ్ పంత్, శుబ్‌మన్ గిల్, సంజూ శాంసన్ల్లో ఒకర్ని రోహిత్ వారసుడిగా తయారు చేయాలని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. ఈ తరుణంలో టీమిండియా నెక్స్ట్ కెప్టెన్ ఎవరనే అంశం మాజీ బ్యాటర్ రాబిన్ ఊతప్ప ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. హిట్‌మ్యాన్‌కు సరైన వారసుడు శ్రేయస్ అయ్యర్ అని అన్నాడు.
‘ఫ్యూచర్లో టీమిండియాను కెప్టెన్‌గా ముందుండి లీడ్ చేసేది శ్రేయస్ అయ్యరే. కెప్టెన్సీ రేసులో అతడు కూడా ఉన్నాడు. శుబ్‌మన్ గిల్ కంటే కూడా అతడు ముందంజలో ఉన్నాడు. భారత జట్టును నడిపించే సత్తా అయ్యర్‌కు ఉంది. అతడు తప్పకుండా విజయం సాధిస్తాడు’ అని ఊతప్ప చెప్పుకొచ్చాడు. ఊతప్ప వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో నెటిజన్స్ సపోర్ట్ చేస్తున్నారు. ఐపీఎల్-2024లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను అయ్యర్ నడిపించిన తీరు అద్భుతమని అంటున్నారు. గంభీర్ మెంటార్షిప్తో పాటు అయ్యర్ సారథ్యం వల్లే కేకేఆర్ ఛాంపియన్‌గా నిలిచిందని చెబుతున్నారు. రోహిత్‌కు సిసలైన వారసుడు అయ్యరేనని కామెంట్స్ చేస్తున్నారు. మరి.. టీమిండియా నెక్స్ట్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అంటూ ఊతప్ప చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.
Robin Uthappa ” I’m going to say it here. Shreyas Iyer is going to be the future India captain.I think he’s next in line, maybe even ahead of Shubman Gill. He’s got the character and wherewithal to handle a team.”pic.twitter.com/iRucMyaZ7f
— Sujeet Suman (@sujeetsuman1991) May 27, 2024