iDreamPost

వరల్డ్ కప్​ కావాలంటే రోహిత్ ఆ రిస్క్ చేయక తప్పదు.. ఆస్ట్రేలియా లెజెండ్ కామెంట్స్!

  • Published May 11, 2024 | 8:07 PMUpdated May 11, 2024 | 8:07 PM

టీ20 ప్రపంచ కప్ నెగ్గాలంటే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ భారీ రిస్క్ చేయాలంటున్నాడు ఓ మాజీ క్రికెటర్. ఆ సాహసం చేస్తే కప్పు భారత్​దేనని అంటున్నాడు.

టీ20 ప్రపంచ కప్ నెగ్గాలంటే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ భారీ రిస్క్ చేయాలంటున్నాడు ఓ మాజీ క్రికెటర్. ఆ సాహసం చేస్తే కప్పు భారత్​దేనని అంటున్నాడు.

  • Published May 11, 2024 | 8:07 PMUpdated May 11, 2024 | 8:07 PM
వరల్డ్ కప్​ కావాలంటే రోహిత్ ఆ రిస్క్ చేయక తప్పదు.. ఆస్ట్రేలియా లెజెండ్ కామెంట్స్!

క్రికెట్​లో ఏ టీమ్ కోరిక అయినా ఒకటే వరల్డ్ కప్ కొట్టాలి. ఎంతటి ఆటగాడైనా సరే తన కెరీర్​లో ఒక్కసారైనా ఆ కప్పును ముద్దాడాలని అనుకుంటాడు. ప్రపంచంలోని మేటి జట్లన్నీ తలపడే ఈ సంగ్రామంలో టైటిల్​ను సొంతం చేసుకోవడం అంత ఈజీ కాదు. ఎంతో ఒత్తిడి ఉండే మెగా టోర్నీలో టీమ్స్​ను నడిపించడం కూడా తేలికైన విషయం కాదు. అందుకు ఎంతో ఓర్పు, నేర్పు, తెలివితేటలు, సంయమనం కావాలి. ఒక్కోసారి ఎంతటి రిస్క్ చేయడానికైనా సారథి వెనుకాడకూడదు. ఇదే విషయాన్ని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు గుర్తుచేస్తున్నాడు ఆస్ట్రేలియా లెజెండ్ మాథ్యూ హేడెన్. కప్పు కొట్టాలంటే హిట్​మ్యాన్ సాహసం చేయక తప్పదని అంటున్నాడు.

టీ20 ప్రపంచ కప్​కు భారత్ ఇటీవలే తమ జట్టును ప్రకటించింది. అయితే టీమ్​ బ్యాటింగ్ లైనప్ భారీగా ఉండటంతో ఎవరు ఏయే పొజిషన్లలో ఆడతారనేది క్లారిటీ లేకుండా పోయింది. ఒకే స్థానంలో ఆడేందుకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఓపెనర్లుగా ఎవరు బరిలోకి దిగుతారనే ఆసక్తిని రేకెత్తిస్తోంది. యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ కూడా రేసులో ఉన్నాడు. ఐపీఎల్​లో అదే స్లాట్​లో కోహ్లీ దుమ్మురేపుతుండటంతో అతడ్ని ఓపెనర్​గానే ఆడించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. తాజాగా హేడెన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. యంగ్ బ్యాటర్ జైస్వాల్​తో కలసి కోహ్లీని ఓపెనర్​గా దించాలని అతడు సూచించాడు. రోహిత్ తన స్థానాన్ని కింగ్​కు త్యాగం చేయాలని తెలిపాడు.

జైస్వాల్-కోహ్లీ జోడీ ఓపెనింగ్​లో ఆడాలన్న హేడెన్.. రోహిత్ బ్యాటింగ్ ఆర్డర్​లో కిందకు రావాలన్నాడు. ఫస్ట్ డౌన్​లో మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ చేయాలని సూచించాడు. నంబర్ 4లో రోహిత్ ఆడితే బ్యాటింగ్ కాంబినేషన్ అదిరిపోతుందని పేర్కొన్నాడు. రోహిత్ ఆ పొజిషన్​లో ఆడితే చివరి వరకు క్రీజులో ఉంటూ టీమ్​కు భారీ స్కోరు అందించే అవకాశాలు ఉంటాయన్నాడు. జట్టు గెలుపు కోసం హిట్​మ్యాన్ ఈ రిస్క్‌ చేయక తప్పదని హేడెన్ స్పష్టం చేశాడు. ఈ ఒక్క మార్పు చేస్తే చాలని.. టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్​లో ఇంకే ఛేంజెస్ అవసరం లేదన్నాడు. మరి.. రోహిత్​ నంబర్ 4లో ఆడాలంటూ హేడెన్ చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి