iDreamPost
android-app
ios-app

అరుదైన రికార్డు​కు అడుగు దూరంలో రోహిత్.. పాక్​తో మ్యాచ్​లో బ్రేక్ చేస్తాడా?

  • Published Jun 01, 2024 | 5:25 PMUpdated Jun 01, 2024 | 5:25 PM

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డుకు అడుగు దూరంలో ఉన్నాడు. పాకిస్థాన్​తో మ్యాచ్​లో అతడు ఈ రికార్డు బ్రేక్ చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డుకు అడుగు దూరంలో ఉన్నాడు. పాకిస్థాన్​తో మ్యాచ్​లో అతడు ఈ రికార్డు బ్రేక్ చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

  • Published Jun 01, 2024 | 5:25 PMUpdated Jun 01, 2024 | 5:25 PM
అరుదైన రికార్డు​కు అడుగు దూరంలో రోహిత్.. పాక్​తో మ్యాచ్​లో బ్రేక్ చేస్తాడా?

ఇప్పుడు ఎక్కడ చూసినా టీ20 వరల్డ్ కప్-2024 గురించే మాట్లాడుకుంటున్నారు. అమెరికా-వెస్టిండీస్ సంయుక్తంగా అతిథ్యం ఇస్తున్న మెగా టోర్నీకి ఆదివారం తెరలేవనుంది. ఒకదాన్ని మించి ఒకటి కాకలు తీరిన జట్లు కదనరంగంలోకి దూకనున్నాయి. కప్పు కోసం కొట్లాడనున్నాయి. టీమిండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్​లు బలంగా కనిపిస్తున్నాయి. న్యూజిలాండ్, సౌతాఫ్రికాను కూడా తీసిపారేయలేం. అండర్​డాగ్స్​గా ఉన్న పాకిస్థాన్ ఎప్పుడు ఎలా ఆడుతుందో ఎవరికీ తెలియదు. చిన్న జట్లు బంగ్లాదేశ్, ఆఫ్ఘానిస్థాన్ కూడా టాప్ టీమ్స్​కు షాకివ్వాలని చూస్తున్నాయి. మునుపటి ప్రభ కోల్పోయిన శ్రీలంక సత్తా చాటాలని చూస్తోంది. అయితే భారత జట్టే ఫేవరెట్ అని ఎక్స్​పర్ట్స్ అంటున్నారు.

టీమిండియా తన బలానికి తగ్గట్లుగా ఆడితే కప్పు కొట్టడం ఖాయమని మాజీ క్రికెటర్లు జోస్యం చెబుతున్నారు. రోహిత్ సేన ఈజీగా ఫైనల్​కు చేరుకుంటుందని, ఒత్తిడిని తట్టుకుంటే టైటిల్ విజేతగా నిలవడం పక్కా అని అంచనా వేస్తున్నారు. కెప్టెన్ హిట్​మ్యాన్​ అటు బ్యాట్​తో పాటు ఇటు కెప్టెన్సీతోనూ తఢాకా చూపించాలని సూచిస్తున్నారు. రోహిత్​కు జట్టును ముందుండి నడిపించడంతో పాటు బ్యాటింగ్​లోనూ సత్తా చాటాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఐపీఎల్-2024లో అతడు అంతగా రాణించలేదు. తన పేరుకు, ఎక్స్​పెక్టేషన్స్​కు తగ్గట్లు బ్యాటింగ్ చేయలేదు. దీంతో మెగా టోర్నీలో కాసింత ఒత్తిడిలో బరిలోకి దిగనున్నాడు. అలాంటి రోహిత్ చరిత్రకు అడుగు దూరంలో నిలిచాడు. ఓ అరుదైన రికార్డు అతడ్ని ఊరిస్తోంది.

రికార్డులను బ్రేక్ చేయడం అలవాటుగా మార్చుకున్న రోహిత్ ముందు మోకరిల్లడానికి మరో రికార్డు ఎదురుచూస్తోంది. ఇప్పటిదాకా ఇంటర్నేషనల్ టీ20 క్రికెట్​లో 190 సిక్సులు బాదాడు హిట్​మ్యాన్. 200 సిక్సర్ల క్లబ్​లో చేరేందుకు మరో 10 సిక్సులు కొట్టాల్సి ఉంది. దీంతో ఈ టీ20 వరల్డ్ కప్​లో దాన్ని అందుకోవాలని రోహిత్ భావిస్తున్నాడు. రోహిత్ ఊపులోకి వస్తే ఒకట్రెండు మ్యాచుల్లోనే దాన్ని అందుకోగలడు. మెగా టోర్నీలో జూన్ 5వ తేదీన ఐర్లాండ్​తో ఫస్ట్ మ్యాచ్ ఆడనుంది టీమిండియా. జూన్ 9న దాయాది పాకిస్థాన్​తో అమీతుమీ తేల్చుకోనుంది. ఐర్లాండ్​తో మ్యాచ్​లో రోహిత్ టచ్​లోకి వచ్చి.. పాక్​తో మ్యాచ్​లోనూ దాన్ని కొనసాగిస్తే ఈ రికార్డును తన పేరు మీద రాసుకోవచ్చు. ఒకవేళ ఈ ఫీట్ సాధిస్తే మాత్రం పొట్టి క్రికెట్​లో కొత్త చరిత్రగా దీన్ని చెప్పొచ్చు. మరి.. రోహిత్ అరుదైన ఘనతను ఏ మ్యాచ్​తో అందుకుంటాడని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి