Nidhan
వన్డే వరల్డ్ కప్‌ను తృటిలో చేజార్చుకున్న బాధలో ఉన్నాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. టీ20 ప్రపంచ కప్‌ను అస్సలు మిస్సవ్వొద్దనే కసిలో పద్మవ్యూహం పన్నుతున్నాడు. దీన్ని ఛేదించడం ఎవ్వరి వల్లా కాదు.
వన్డే వరల్డ్ కప్‌ను తృటిలో చేజార్చుకున్న బాధలో ఉన్నాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. టీ20 ప్రపంచ కప్‌ను అస్సలు మిస్సవ్వొద్దనే కసిలో పద్మవ్యూహం పన్నుతున్నాడు. దీన్ని ఛేదించడం ఎవ్వరి వల్లా కాదు.
Nidhan
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సుదీర్ఘ కెరీర్లో ఎన్నో విజయాలు చూశాడు. అద్భుతమైన బ్యాటింగ్‌తో టీమ్‌కు ఎన్నో మ్యాజికల్ విక్టరీస్ అందించాడు. వేలాది పరుగులు, ఎన్నో సెంచరీలు, లెక్కలేనన్ని రికార్డులు హిట్‌మ్యాన్ పేరు మీద ఉన్నాయి. అయితే ఎంత సాధించినా అతడ్ని ఓ వెలితి మాత్రం బాధిస్తోంది. అదే వరల్డ్ కప్. టీ20 ప్రపంచ కప్-2007 విన్నింగ్ టీమ్‌లో రోహిత్ ఉన్నాడుగా. మరి.. వరల్డ్ కప్ డ్రీమ్ ఏంటనేగా మీ డౌట్. అప్పటికి అతడు ఎస్టాబ్లిష్డ్ ప్లేయర్ కాదు. ఈ దశాబ్దంన్నర కాలంలో ఎంతో మారాడు. టీమ్‌లో చోటు కష్టమనే స్థానం నుంచి ఏకంగా కెప్టెన్‌గా ఎదిగాడు. వరల్డ్ క్రికెట్లో టాప్ బ్యాటర్స్‌లో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. కెరీర్ చివర్లో ఓ ప్రపంచ కప్ నెగ్గాలనేది అతడి ఆశ. కానీ వన్డే వరల్డ్ కప్-2023 తృటిలో మిస్సయింది. దీంతో టీ20 కప్పు కోసం మాస్టర్‌ప్లాన్ వేస్తున్నాడు హిట్‌మ్యాన్.
భారత్ ఆతిథ్యం ఇచ్చిన వన్డే వరల్డ్ కప్ కోసం చేయాల్సిందంతా చేశాడు రోహిత్. అద్భుతమైన బ్యాటింగ్‌తో పాటు సూపర్బ్ కెప్టెన్సీతో టీమ్‌ను ఫైనల్‌కు చేర్చాడు. కానీ గద్దలా వచ్చి కప్పును ఎగరేసుకుపోయింది ఆస్ట్రేలియా. దీంతో చాన్నాళ్లు ఆ బాధలో నుంచి బయటకు రాని హిట్‌మ్యాన్.. ఇప్పుడు తన ఫోకస్‌ను టీ20 వరల్డ్ కప్ మీదకు షిఫ్ట్ చేశాడు. ఇటీవలే మెగా టోర్నీలో ఆడే టీమిండియా స్క్వాడ్‌ను ప్రకటించారు. ఇందులో రోహిత్ మార్క్ కనిపించింది. ఊహించని విధంగా జట్టులో నలుగురు స్పిన్నర్లను, ఇద్దరు పేస్ ఆల్రౌండర్లను తీసుకున్నారు. రిజర్వ్డ్గా కూడా టాలెంటెడ్ యంగ్‌స్టర్స్‌కు ఛాన్స్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో టీ20 కప్పులో తన ప్రధాన అస్త్రం ఏంటో అతడు రివీల్ చేశాడు.
పొట్టి ప్రపంచ కప్ కోసం పద్మవ్యూహం పన్నుతున్నాడు రోహిత్. దీన్ని ఛేదించడం ఎవరి వల్లా కాదనే చెప్పాలి. ఒకవేళ ఇది వర్కౌట్ అయిందా కప్పు కొట్టకుండా టీమిండియాను ఎవ్వరూ ఆపలేరు. టీ20 వరల్డ్ కప్‌కు నలుగురు స్పిన్నర్లను తీసుకెళ్లున్నాడు హిట్‌మ్యాన్. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్‌తో పాటు సీనియర్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌కు ప్రపంచ కప్ స్క్వాడ్‌లో చోటు కల్పించాడు. మెగా టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న వెస్టిండీస్-యూఎస్ఏలో స్లో పిచ్‌లు ఉంటాయి.
విండీస్ వికెట్ల మీద హిట్టింగ్ చేయడం అక్కడ కష్టం. బాల్‌ను గట్టిగా బాదడానికి ప్రయత్నిస్తే వికెట్లు పడే అవకాశాలు ఎక్కువ. అందుకే స్పిన్ మంత్రంతో ప్రత్యర్థులను పడగొట్టాలనేది రోహిత్ ప్లాన్. ఇదే విషయాన్ని ఇవాళ బీసీసీఐ నిర్వహించిన ప్రెస్మీట్లో చెప్పకనే చెప్పాడు. ‘స్క్వాడ్‌లో నలుగురు స్పిన్నర్లు ఉండాలని అనుకున్నా. దీనికి కారణం ఏంటనేది ఇప్పుడే చెప్పను. ఎందుకు అంతమందిని తీసుకున్నామో యూఎస్‌కు వెళ్లాక చెబుతా’ అని హిట్‌మ్యాన్ తన పద్మవ్యూహం గురించి హింట్ ఇచ్చాడు. మరి.. వరల్డ్ కప్ కోసం రోహిత్ వేసిన మాస్టర్స్కెచ్ మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
Rohit Sharma said, “I wanted 4 spinners in the squad. I won’t say the reason for that here, I’ll let you know in the USA”. pic.twitter.com/hyxocC24NG
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 2, 2024