టాప్ బ్యాటర్స్ రోహిత్, విరాట్ వల్ల కాలేదు.. భారత్​ను ఊరిస్తున్న అరుదైన రికార్డు!

టీ20 వరల్డ్ కప్ మొదలై 17 ఏళ్లు కావొస్తోంది. ఇప్పుడు జరగబోయేది 9వ ఎడిషన్. అయినా ఇన్నేళ్లలో భారత ఆగాళ్లలో ఒక్కరు తప్ప ఎవ్వరూ ఆ ఘనతను సాధించలేదు. టాప్ బ్యాటర్స్ రోహిత్, విరాట్ వల్లే కాలేదు.

టీ20 వరల్డ్ కప్ మొదలై 17 ఏళ్లు కావొస్తోంది. ఇప్పుడు జరగబోయేది 9వ ఎడిషన్. అయినా ఇన్నేళ్లలో భారత ఆగాళ్లలో ఒక్కరు తప్ప ఎవ్వరూ ఆ ఘనతను సాధించలేదు. టాప్ బ్యాటర్స్ రోహిత్, విరాట్ వల్లే కాలేదు.

టీ20 వరల్డ్ కప్​-2024 కోసం భారత జట్టు ఎంతో ఎగ్జయిటింగ్​గా ఎదురు చూస్తోంది. మిగతా అన్ని జట్ల కంటే మెగా టోర్నీ భారత్​కు కీలకం కానుంది. గతేడాది స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచ కప్-2023ను టీమిండియా కొద్దిలో మిస్సైంది. దీంతో ఈసారి కప్పు ఎగరేసుకుపోవాలని మెన్ ఇన్ బ్లూ కసితో ఉన్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఇదే ఆఖరి పొట్టి కప్పు అనే వార్తల నేపథ్యంలో వాళ్ల కోసమైనా ఛాంపియన్​గా నిలవాలనే పట్టుదల ఆటగాళ్లలో కనిపిస్తోంది. ఆస్ట్రేలియా కాదు కదా.. ఎవ్వరు ఎదురొచ్చినా తొక్కుకుంటూ పోవాల్సిందేనని భారత జట్టు అనుకుంటోంది. కప్​ గెలిచి రోహిత్-విరాట్​కు అంకితం చేయాలని భావిస్తోంది. అయితే కప్పు గెలవడంతో పాటు పలు అరుదైన రికార్డులను కూడా తిరగరాయాలని చూస్తోంది.

టీ20 వరల్డ్ కప్ మొదలై 17 ఏళ్లు కావొస్తోంది. ఇప్పుడు జరగబోయేది 9వ ఎడిషన్. అయినా ఇన్నేళ్లలో భారత ఆగాళ్లలో ఒక్కరు తప్ప ఎవ్వరూ ఆ ఘనతను సాధించలేదు. టాప్ బ్యాటర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వల్ల కూడా కాలేదు. ఏంటా రికార్డు అనేగా మీ సందేహం. ఇప్పటిదాకా జరిగిన టీ20 వరల్డ్ కప్స్​లో భారత్ తరఫున సెంచరీ బాదిన ఏకైక బ్యాట్స్​మన్ సురేష్ రైనా మాత్రమే. ప్రపంచ కప్-2010లో సౌతాఫ్రికాతో మ్యాచ్​లో రైనా (101) శతకంతో చెలరేగాడు. ఆ మ్యాచ్​లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ఆ తర్వాత ఛేజింగ్​కు దిగిన ప్రొటీస్ అన్ని ఓవర్లు ఆడి 5 వికెట్లకు 172 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 14 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది.

టీ20 వరల్డ్ కప్​లో రైనా సెంచరీ బాది దాదాపు 14 ఏళ్లు కావొస్తోంది. ఇప్పటిదాకా పొట్టి ఫార్మాట్​లో చాలా సార్లు ప్రపంచ కప్​లు జరిగాయి. కానీ ఏ ఒక్క భారత బ్యాటర్ కూడా శతకం మార్క్​ను అందుకోలేకపోయాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు ఎందరు స్టార్లు టీమ్​లో ఉన్నా ఈ ఘనతను అందుకోలేకపోయారు. రైనా రికార్డును తిరగరాయడం పక్కనబెడితే కనీసం ఓ సెంచరీ బాది అతడి మైల్​స్టోన్​ను అందుకునే ప్రయత్నం కూడా జరగలేదు. అయితే ఈసారి కోహ్లీతో పాటు ఇతర ఆటగాళ్లు మంచి ఫామ్​లో ఉన్నందున రైనా రికార్డును అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరల్డ్ కప్ సొంతం చేసుకోవడంతో పాటు ఈ రికార్డును బ్రేక్ చేయాల్సిన బాధ్యత కూడా బ్యాటర్ల మీద ఉంది. మరి.. మెగా టోర్నీలో ఎవరు రైనా రికార్డును అధిగమిస్తారని మీరు భావిస్తున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments