Somesekhar
టీ20 వరల్డ్ కప్ లో రిషబ్ పంత్ vs శాంసన్ ఇద్దరిలో తుది జట్టులోకి ఎవరిని తీసుకోవాలి? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. మరి వీరిద్దరిలో ఆడే ఛాన్స్ ఎవరికి దక్కుతుందో ఓ సారి పరిశీలిద్దాం.
టీ20 వరల్డ్ కప్ లో రిషబ్ పంత్ vs శాంసన్ ఇద్దరిలో తుది జట్టులోకి ఎవరిని తీసుకోవాలి? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. మరి వీరిద్దరిలో ఆడే ఛాన్స్ ఎవరికి దక్కుతుందో ఓ సారి పరిశీలిద్దాం.
Somesekhar
టీ20 వరల్డ్ కప్ 2024 ఆరంభానికి రంగం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో ఈ మహా సంగ్రామానికి తెరలేవనుంది. ఈ నేపథ్యంలో టీమిండియాకు పెద్ద తలనొప్పి వచ్చి పడింది. వరల్డ్ కప్ కు 15 మంది సభ్యులతో టీమ్ ను అయితే ప్రకటించింది గానీ.. తుది జట్టులోకి ఎవరిని తీసుకోవాలి? అన్నది ఇప్పుడు సెలెక్టర్ల ముందున్న అతిపెద్ద సవాల్. ఈ సవాల్ ను అధిగమించేందుకు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో కసరత్తులు జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా రిషబ్ పంత్ vs శాంసన్ ఇద్దరిలో తుది జట్టులోకి ఎవరిని తీసుకోవాలి? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. మరి వీరిద్దరిలో ఆడే ఛాన్స్ ఎవరికి దక్కుతుందో ఓ సారి పరిశీలిద్దాం.
టీ20 వరల్డ్ కప్ కోసం టీమిండియా సిద్ధమైంది. అయితే తుది జట్టులోకి ఎవరిని తీసుకోవాలి? అన్నది ఇప్పుడు మేనేజ్ మెంట్ ముందున్న భారీ బాధ్యత. ఎవ్వరినీ నొప్పించకుండా.. ఆటగాళ్ల ఫామ్ ను, గణాంకాలను, అనుభవాన్ని చూసి తుది జట్టులోకి తీసుకోవాలి. అందుకోసం భారీగానే కసరత్తులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం ద్రవిడ్ నేతృత్వంలో సెలెక్షన్ కమిటీ ఇదే పనిమీద ఉంది. కానీ ఇక్కడే మేనేజ్ మెంట్ కు ఓ తలనొప్పి వచ్చింది. రిషబ్ పంత్- సంజూ శాంసన్ ఇద్దరిలో ఎవరిని తుది జట్టులోకి తీసుకోవాలి?
కారు ప్రమాదం నుంచి కోలుకుని 18 నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఐపీఎల్ 2024 ద్వారా రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సీజన్ లో బ్యాటింగ్, కీపింగ్ లో దుమ్మురేపాడు పంత్. బ్యాటింగ్ లో 13 మ్యాచ్ లు ఆడి 446 పరుగులు చేశాడు. ఇందులో 3 అర్దశతకాలు ఉన్నాయి. ఇక కీపింగ్ లో 11 క్యాచ్ లతో పాటుగా 5 స్టంపౌట్స్ చేశాడు. అసాధారణ ప్రతిభతో ఆకట్టుకున్నాడు పంత్. దాంతో టీ20 వరల్డ్ కప్ లో చోటు దక్కించుకున్నాడు.
ఎంతో కాలం నిరీక్షణ తర్వాత టీమిండియాలోకి అడుగుపెట్టాడు వికెట్ కీపర్ కమ్ ఓపెనర్ బ్యాటర్ సంజూ శాంసన్. ఈ ఐపీఎల్ సీజన్ లో అద్భుతంగా రాణించడమే కాకుండా.. సారథిగా రాజస్తాన్ రాయల్స్ ను ప్లే ఆఫ్స్ కు చేర్చాడు. ఈ సీజన్ లో 16 మ్యాచ్ ల్లో 531 పరుగులు చేశాడు. ఈ ప్రదర్శన కారణంగానే టీ20 వరల్డ్ కప్ లో చోటు దక్కించుకున్నాడు ఈ సీనియర్ ప్లేయర్. ఇక వీరిద్దరిలో తుది జట్టులో ఎవరిని తీసుకుంటారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అయితే రిషబ్ పంత్ నే తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే? రికార్డ్స్, అంతర్జాతీయ టీ20ల్లో ఆడిన అనుభవంతో పాటుగా లెఫ్ట్ హ్యాండర్ కావడం పంత్ కు కలిసొచ్చే అంశం. లెఫ్ట్ – రైట్ కాంబినేషన్ అవసరం అని మేనేజ్ మెంట్ భావిస్తే.. పంత్ కు చోటు ఖాయం. ఇక శాంసన్ టీమ్ లోకి రావాలంటే? ఇతర ఆటగాళ్లుకు ఎవరికైనా ఫిట్ నెస్ సమస్యలు తలెత్తాలి. అప్పుడు పంత్ తో పాటుగా శాంసన్ కు జట్టులో చోటు లభిస్తుంది. మరి ఇద్దరిలో ఎవరు టీమ్ లోకి వస్తే బాగుంటుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.