iDreamPost

కోహ్లీ, రోహిత్ కాదు.. వరల్డ్ కప్​లో లీడింగ్ రన్ స్కోరర్ అతడే: పాంటింగ్

  • Published May 30, 2024 | 5:26 PMUpdated May 30, 2024 | 5:26 PM

టీ20 వరల్డ్ కప్​-2024 కోసం టాప్ ప్లేయర్లు అంతా వెయిట్ చేస్తున్నారు. మెగా టోర్నీలో సత్తా చాటి తమ జట్లను గెలిపించాలని చూస్తున్నారు. అదే టైమ్​లో సూపర్ పెర్ఫార్మెన్స్​తో ఫ్యాన్స్ మనసులు దోచుకోవాలని భావిస్తున్నారు.

టీ20 వరల్డ్ కప్​-2024 కోసం టాప్ ప్లేయర్లు అంతా వెయిట్ చేస్తున్నారు. మెగా టోర్నీలో సత్తా చాటి తమ జట్లను గెలిపించాలని చూస్తున్నారు. అదే టైమ్​లో సూపర్ పెర్ఫార్మెన్స్​తో ఫ్యాన్స్ మనసులు దోచుకోవాలని భావిస్తున్నారు.

  • Published May 30, 2024 | 5:26 PMUpdated May 30, 2024 | 5:26 PM
కోహ్లీ, రోహిత్ కాదు.. వరల్డ్ కప్​లో లీడింగ్ రన్ స్కోరర్ అతడే: పాంటింగ్

టీ20 వరల్డ్ కప్​-2024 కోసం టాప్ ప్లేయర్లు అంతా వెయిట్ చేస్తున్నారు. మెగా టోర్నీలో సత్తా చాటి తమ జట్లను గెలిపించాలని చూస్తున్నారు. అదే టైమ్​లో సూపర్ పెర్ఫార్మెన్స్​తో ఫ్యాన్స్ మనసులు దోచుకోవాలని భావిస్తున్నారు. దీంతో ఎప్పటిలాగే ఈసారి కూడా ప్రపంచ కప్​లో బెస్ట్ స్కోరర్​ ఎవరు అవుతారు? మోస్ట్ వికెట్ టేకర్​గా ఎవరు నిలుస్తారు? అనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. మాజీ క్రికెటర్స్, ఎక్స్​పర్ట్స్ దీని గురించి తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ మటుకు అందరూ టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పేరు చెబుతున్నారు. కోహ్లీ లీడింగ్ రన్ స్కోరర్​గా నిలవడం పక్కా అని చెబుతున్నారు. ఐపీఎల్-2024లో ఆరెంజ్ క్యాప్ హోల్డర్​గా నిలిచిన కింగ్.. పొట్టి కప్పులోనూ అదే మ్యాజిక్​ను కంటిన్యూ చేయడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు.

కోహ్లీ తర్వాత లీడింగ్ రన్ స్కోరర్​గా వినిపిస్తున్న పేరు భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మదే. హిట్​మ్యాన్​ టచ్​లోకి వస్తే అత్యధిక పరుగులు బాదడం ఖాయమని ఎక్స్​పర్ట్స్ అంటున్నారు. అయితే ఆస్ట్రేలియా లెజెండ్ రికీ పాంటింగ్ మాత్రం ఇతరుల అభిప్రాయాలకు భిన్నంగా తన ప్రిడిక్షన్ చెప్పాడు. ఈసారి ప్రపంచ కప్​లో కోహ్లీ, రోహిత్ కాదు.. కంగారూ ఓపెనర్ ట్రావిస్ హెడ్ టాప్ స్కోరర్​గా నిలుస్తాడని అన్నాడు. అలాగే భారత పేసు గుర్రం జస్​ప్రీత్ బుమ్రా లీడింగ్ వికెట్ టేకర్​గా నిలుస్తాడని పాంటింగ్ జోస్యం పలికాడు. బ్యాటింగ్​లో హెడ్, బౌలింగ్​లో బుమ్రాను దాటడం ఎవరి వల్లా కాదని.. ఈ మెగా టోర్నీలో వాళ్ల హవా నడవడం పక్కా అని చెప్పాడు. పాంటింగ్ ప్రిడిక్షన్​కు కొన్ని విషయాలు ఊతం ఇస్తున్నాయి.

ఐపీఎల్-2024లో ట్రావిస్ హెడ్ 15 మ్యాచుల్లో 191 స్ట్రైక్ రేట్​తో 567 పరుగులు చేశాడు. 4 హాఫ్ సెంచరీలు బాదిన ఈ సన్​రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్​ లీగ్ మ్యాచెస్​లో రెచ్చిపోయి ఆడాడు. ఫస్ట్ బాల్ నుంచే హిట్టింగ్​కు దిగుతూ ప్రత్యర్థులను బెదరగొట్టాడు. అతడు ఉన్న ఫామ్​లో మ్యాజికల్ డెలివరీస్ పడితే తప్ప ఆపడం కష్టమే. అటు జస్​ప్రీత్ బుమ్రా కూడా క్యాష్ రిచ్ లీగ్​లో దుమ్మురేపాడు. 20 వికెట్లతో అలరించాడు. అతడి బౌలింగ్ ఎకానమీ 6. ఒకవైపు వికెట్లు తీస్తూనే మరోవైపు పరుగులు కూడా కట్టడి చేస్తూ బ్యాటర్లు గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు. ఇలా అద్భుత ప్రదర్శనలతో అదరగొట్టడంతో వీళ్లిద్దరిదే ఈ వరల్డ్ కప్ అని పాంటింగ్ చెప్పినట్లుగా కనిపిస్తోంది. మరి.. హెడ్ టాప్ స్కోరర్​గా, బుమ్రా లీడింగ్ వికెట్ టేకర్​గా నిలుస్తారంటూ పాంటింగ్ పలికిన జోస్యంపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి