iDreamPost
android-app
ios-app

మిథాలీరాజ్ తో పెళ్లి వార్తలు.. శిఖర్ ధావన్ ఏమన్నాడంటే?

  • Published May 30, 2024 | 3:08 PM Updated Updated May 30, 2024 | 3:08 PM

శిఖర్ ధావన్-మిథాలీరాజ్ పెళ్లి చేసుకోబోతున్నారు అన్న వార్తలు గతంలో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై స్పందించాడు శిఖర్ ధావన్. మిథాలీతో పెళ్లిపై ధావన్ ఏమన్నాడంటే?

శిఖర్ ధావన్-మిథాలీరాజ్ పెళ్లి చేసుకోబోతున్నారు అన్న వార్తలు గతంలో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై స్పందించాడు శిఖర్ ధావన్. మిథాలీతో పెళ్లిపై ధావన్ ఏమన్నాడంటే?

  • Published May 30, 2024 | 3:08 PMUpdated May 30, 2024 | 3:08 PM
మిథాలీరాజ్ తో పెళ్లి వార్తలు.. శిఖర్ ధావన్ ఏమన్నాడంటే?

టీమిండియా స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్, మహిళా దిగ్గజ క్రికెటర్ మిథాలీరాజ్ గురించి ఓ వార్త గతంలో హల్ చల్ చేసింది. వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అన్న న్యూస్ వైరల్ అయిన విషయం తెలిసిందే. ధావన్ తన భార్య ఆయేషా ముఖర్జీతో విడాకులు తీసుకున్న తర్వాత వీరి పెళ్లి వార్తలు జోరందుకున్నాయి. ఆ వార్తలపై అటు మిథాలీరాజ్, ఇటు శిఖర్ ధావన్ గానీ స్పందించలేదు. తాజాగా ఈ న్యూస్ పై తొలిసారి నోరువిప్పాడు ఈ వెటరన్ ప్లేయర్. ఏమన్నాడంటే?

ఐపీఎల్ 2024 సీజన్ నుంచి గాయం కారణంగా మధ్యలోనే టోర్నీ నుంచి నిష్క్రమించాడు. పంజాబ్ కింగ్స్ కు కెప్టెన్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జియో సినిమాలో ‘ధావన్ కరంగే’ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ షోలో మిథాలీరాజ్ తో తన పెళ్లి అంటూ వచ్చిన వార్తలపై తొలిసారి నోరువిప్పాడు. “నేను మిథాలీరాజ్ ను పెళ్లి చేసుకోబోతున్నాను అన్న వార్త విన్నాను. నా గురించి నేను విన్న విచిత్రమైన పుకారు ఇది. ఇందులో ఎలాంటి నిజం లేదు.. అంతా అవాస్తవమే” అని పెళ్లి రూమర్ పై క్లారిటీ ఇచ్చాడు.

కాగా.. తన కెరీర్ కు వీడ్కోలు పలికిన మిథాలీరాజ్ వుమెన్స్ ప్రీమియర్ లీగ్ లో గుజరాత్ జెయింట్స్ టీమ్ కు మెంటర్ గా వ్యవహరిస్తోంది. ధావన్ విషయానికి వస్తే.. తన భార్య ఆయేషా ముఖర్జీకి విడాకులు ఇచ్చి ఒంటరిగా జీవిస్తున్నాడు. తన కొడుకును మాజీ భార్య కలవనీయడం లేదని గతంలో సోషల్ మీడియా వేదికగా బాధను వ్యక్తపరిచాడు. గత కొంతకాలంగా టీమిండియాకు దూరంగా ఉంటున్నాడు ధావన్. అతడి కెరీర్ చివరి దశలో ఉంది. జట్టులో చోటు కోల్పోయి ఇబ్బందులు పడుతున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా పెళ్లి వార్తలపై స్పందించి.. వార్తల్లో నిలిచాడు ధావన్.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobet