iDreamPost
android-app
ios-app

క్రికెట్ కోసం కదిలిన వేలాది మంది! ఇది ఇండియాలో కాదు.. ఎక్కడంటే?

  • Published Jun 05, 2024 | 7:52 AMUpdated Jun 05, 2024 | 7:52 AM

క్రికెట్​ను మన దేశంలో ఓ మతంగా చూస్తారనేది తెలిసిందే. ఇక్కడ ఆటగాళ్లను దేవుళ్లలా కొలుస్తుంటారు. మ్యాచ్ అంటే చాలు స్టేడియాలకు భారీగా పోటెత్తుతారు జనం. కానీ భారత్​లోనే కాదు.. క్రికెట్​లో పసికూన లాంటి ఆ దేశంలోనూ ఈ గేమ్​కు అంతే లెవల్​లో క్రేజ్ ఉంది. దానికి ఇదే సాక్ష్యం.

క్రికెట్​ను మన దేశంలో ఓ మతంగా చూస్తారనేది తెలిసిందే. ఇక్కడ ఆటగాళ్లను దేవుళ్లలా కొలుస్తుంటారు. మ్యాచ్ అంటే చాలు స్టేడియాలకు భారీగా పోటెత్తుతారు జనం. కానీ భారత్​లోనే కాదు.. క్రికెట్​లో పసికూన లాంటి ఆ దేశంలోనూ ఈ గేమ్​కు అంతే లెవల్​లో క్రేజ్ ఉంది. దానికి ఇదే సాక్ష్యం.

  • Published Jun 05, 2024 | 7:52 AMUpdated Jun 05, 2024 | 7:52 AM
క్రికెట్ కోసం కదిలిన వేలాది మంది! ఇది ఇండియాలో కాదు.. ఎక్కడంటే?

క్రికెట్​ను మన దేశంలో ఓ మతంగా చూస్తారనేది తెలిసిందే. ఇక్కడ ఆటగాళ్లను దేవుళ్లలా కొలుస్తుంటారు. మ్యాచ్ అంటే చాలు స్టేడియాలకు భారీగా పోటెత్తుతారు జనం. ప్లేయర్లు కనిపిస్తే చాలని, వాళ్లను ఒక్కసారైనా చూడాలని కోరుకుంటారు. ఆటగాళ్లను కలిసే అవకాశం వస్తే వాళ్లతో సెల్ఫీలు దిగేందుకు, ఆటోగ్రాఫ్​లు తీసుకునేందుకు ఎగబడతారు. క్రికెటర్ల పర్సనల్ లైఫ్​ గురించి తెలుసుకునేందుకు, వాళ్లకు ఏది ఇష్టం, ఎలా ఉంటారు.. ఇలా దాదాపుగా అన్ని విషయాలు తెలుసుకునేందుకు అభిమానులు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఆటగాళ్లను రోల్ మోడల్​గా తీసుకొని తామూ ఆ స్థాయికి ఎదగాలని అనుకుంటారు. అందుకే సినీ తారలు, రాజకీయ నేతల కంటే కూడా క్రికెటర్లకు హ్యూజ్ ఫ్యాన్​బేస్ ఉంటుంది. వాళ్లు ఎక్కడ కనిపించినా వందలాది మంది చుట్టుముట్టేస్తారు.

భారత్​లోనే కాదు.. శ్రీలంక, పాకిస్థాన్, ఆఫ్ఘానిస్థాన్ లాంటి ఇతర ఉపఖండ దేశాల్లోనూ క్రికెట్​కు సూపర్ క్రేజ్ ఉంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ లాంటి మల్టీస్పోర్ట్స్ కల్చర్ ఉన్న దేశాలతో పోలిస్తే ఏషియా కంట్రీస్​లో జెంటిల్మన్ గేమ్​కు భారీగా అభిమానులు ఉన్నారు. ఇది మరోమారు ప్రూవ్ అయింది. క్రికెట్​ అంటే తమకు ఎంత ఇష్టమో నేపాల్ వాసులు చూపించారు. భారత్​లో ఈ గేమ్​ను ఎలాగైతే ఆదరిస్తారో అంతే స్థాయిలో నేపాల్​లోనూ ఆదరిస్తారు. దీనికి తాజా ఘటనే ఉదాహరణ. టీ20 వరల్డ్ కప్-2024లో నేపాల్ నిన్న తమ తొలి మ్యాచ్ ఆడింది. నెదర్లాండ్స్​తో తలపడి 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్​ను బిగ్ స్క్రీన్​ మీద లైవ్​గా చూసేందుకు నేపాల్​లో వేలాది మంది ఒక్కటిగా కదిలారు.

పొట్టి కప్పులో తమ దేశం ఆటతీరు చూసేందుకు వేలాది మంది నేపాల్ ప్రజలు రాజధాని ఖాట్మండుకు చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన బిగ్ స్క్రీన్​పై ఆసక్తిగా మ్యాచ్​ను తిలకించారు. దాదాపుగా ఒక స్టేడియంలో పట్టేంత మంది కలసి ఒకేసారి స్క్రీన్​పై మ్యాచ్​ చూస్తున్న ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీన్ని చూసిన నెటిజన్స్.. ఇది రియల్ క్రేజ్ అంటే, నేపాల్ ఫ్యాన్స్​కు సలామ్ అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక, వరల్డ్ కప్​లో తమ టీమ్​కు మద్దతునిస్తూ ఇటీవల ఆ దేశ ఎంపీలు.. నేపాల్ జెర్సీలు వేసుకొని తమ పార్లమెంట్​కు వచ్చారు. నేపాల్​లో నార్మల్ మ్యాచ్ జరిగినా వందలాది మంది గుమిగూడి చూస్తుంటారు. అలాంటిది మెగా టోర్నీలో తమ టీమ్ ఆడుతుండటంతో వాళ్లు ఉత్కంఠను తట్టుకోలేక ఒకేచోట అందరూ కలసి మ్యాచ్​ను ఎంజాయ్ చేశారు. అయితే నెదర్లాండ్స్ చేతుల్లో తమ టీమ్ ఓడిపోవడంతో అక్కడి నుంచి నిరాశతో వెనుదిరిగారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి