iDreamPost
android-app
ios-app

T20 వరల్డ్ కప్ కోసం పాకిస్తాన్ మాస్టర్​ప్లాన్! ఇండియాకు చాలా డేంజర్!

  • Published Apr 29, 2024 | 9:47 PM Updated Updated Apr 29, 2024 | 9:47 PM

టీ20 వరల్డ్ కప్ కోసం పాకిస్థాన్ మాస్టర్​ప్లాన్ రెడీ చేస్తోంది. భారత్​ను ఓడించేందుకు మహా ఘటికుడ్ని బరిలోకి దింపుతోంది. ఇది ఇండియాకు చాలా డేంజర్ అనే చెప్పాలి.

టీ20 వరల్డ్ కప్ కోసం పాకిస్థాన్ మాస్టర్​ప్లాన్ రెడీ చేస్తోంది. భారత్​ను ఓడించేందుకు మహా ఘటికుడ్ని బరిలోకి దింపుతోంది. ఇది ఇండియాకు చాలా డేంజర్ అనే చెప్పాలి.

  • Published Apr 29, 2024 | 9:47 PMUpdated Apr 29, 2024 | 9:47 PM
T20 వరల్డ్ కప్ కోసం పాకిస్తాన్ మాస్టర్​ప్లాన్! ఇండియాకు చాలా డేంజర్!

పాకిస్థాన్.. క్రికెట్​లో ఈ జట్టు అనిశ్చితికి మారుపేరు. టీమ్ నిండా టాలెంటెడ్ ప్లేయర్లు ఉన్నా ఈ జట్టు ఎప్పుడు ఎలా ఆడుతుందో ఎవరూ చెప్పలేం. ఈజీగా గెలిచే మ్యాచుల్లో చిత్తుగా ఓడిపోవడం, ఓటమి ఖాయం అనుకునే మ్యాచుల్లో పోరాడి గెలవడం పాక్​కు మాత్రమే సాధ్యం. అయితే ఈ మధ్య ఆ టీమ్ ఆటతీరు మరీ తీసికట్టుగా మారింది. ఆసియా కప్-2023లో ఫైనల్స్​కు చేరకుండానే నిష్క్రమించింది. భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్​-2023లోనైతే దారుణంగా పెర్ఫార్మ్ చేసింది. మెగా టోర్నీలో గ్రూప్ దశలోనే దాయాది టీమ్ కథ ముగిసింది. అయితే టీ20 వరల్డ్ కప్ మీద కన్నేసిన పాక్.. అందుకోసం ఓ మాస్టర్​ప్లాన్​ను సిద్ధం చేసింది. అది వర్కౌట్ అయితే మాత్రం టీమిండియాకు చాలా డేంజర్ అనే చెప్పాలి.

వన్డే వరల్డ్ కప్ వైఫల్యంతో పాకిస్థాన్ క్రికెట్​లో అనూహ్య మార్పులు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. కోచింగ్ స్టాఫ్​ మొత్తం రాజీనామా చేయడం విదితమే. దీంతో ఆ జట్టుకు నెక్స్ట్ కోచ్​గా ఎవరు వస్తారనేది ఇంట్రెస్టింగ్​గా మారింది. కానీ చాలా రోజులైనా ఈ విషయం మీద క్లారిటీ రాలేదు. అయితే సరిగ్గా టీ20 ప్రపంచ కప్ ఆరంభానికి ఒక్క నెల ముందు పాక్ క్రికెట్​లో సంచలనం జరిగింది. ఆ టీమ్​కు కొత్త కోచ్​గా ఇద్దరు లెజెండ్స్ వర్క్ చేసేందుకు ఒప్పుకున్నారు. అందులో ఒకరు టీమిండియా మాజీ కోచ్​ గ్యారీ కిర్​స్టెన్ కాగా.. మరొకరు ఆస్ట్రేలియా బౌలింగ్ దిగ్గజం జాసెన్ గిలెస్పీ కావడం విశేషం. కొత్త కోచ్​లకు స్వాగతం చెబుతూ పాక్ క్రికెట్ బోర్డు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. దీంతో ఇప్పుడీ అంశం చర్చనీయాంశంగా మారింది.

గ్యారీ కిర్​స్టెన్​ను వైట్ బాల్ టీమ్​కు కోచ్​గా, గిలెస్పీని రెడ్ బాల్ కోచ్​గా నియమించింది పాకిస్థాన్ బోర్డు. అలాగే పాక్ మాజీ క్రికెటర్ అజహర్ మహమూద్​ను అన్ని ఫార్మాట్లలోనూ అసిస్టెంట్​ కోచ్​గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో వీళ్లు టీమ్​తో కలుస్తారని తెలుస్తోంది. అయితే పాక్ కొత్త కోచ్​ల నియామకం వార్త టీమిండియా అభిమానులను కలవరపెడుతోంది. వన్డే ప్రపంచ కప్-2011లో భారత్​ను ఛాంపియన్​గా నిలబెట్టిన కిర్​స్టెన్​ ఇప్పుడు పాకిస్థాన్ టీమ్ బాధ్యతలు తీసుకోవడమే దీనికి కారణంగా చెప్పొచ్చు.

టీమిండియా ఆటగాళ్ల ఆనుపాను తెలిసినోడు అవడం, భారత జట్టు ఆలోచన తీరు, ఇక్కడ సిస్టమ్ వర్క్ అయ్యే విధానం, ప్లేయర్ల మెంటాలిటీ, వీక్​నెస్​.. ఇలా అన్నింటి మీదా పట్టు ఉన్న కిర్​స్టెన్ ఇప్పుడు దాయాది క్యాంప్​లో ఉండటంతో టీ20 వరల్డ్ కప్​లో టీమిండియాకు ముప్పు తప్పదని అంటున్నారు. అయితే మరికొందరు ఫ్యాన్స్ మాత్రం ఆయనతో భయపడాల్సిందేమీ లేదని చెబుతున్నారు. కిర్​స్టెన్ కోచింగ్ నుంచి తప్పుకున్నాక జట్టులో చాలా మార్పులు వచ్చాయని, డ్రెస్సింగ్ రూమ్ సిస్టమ్ కూడా ఛేంజ్ అయిందని కామెంట్స్ చేస్తున్నారు. మరి.. కిర్​స్టెన్ రాకతో భారత్​కు డేంజర్ అనే అభిప్రాయాలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.