iDreamPost
android-app
ios-app

ఆస్ట్రేలియాకు స్టార్క్ బలం అంటున్నారు.. కానీ అతడే బలహీనత: స్టార్ క్రికెటర్

  • Published May 30, 2024 | 8:52 PM Updated Updated May 30, 2024 | 8:52 PM

ఆస్ట్రేలియా సీనియర్ పేసర్ మిచెల్ స్టార్క్ ఇప్పుడు భీకర ఫామ్​లో ఉన్నాడు. ఐపీఎల్-2024లో నిప్పులు చెరిగే బంతులతో బ్యాటర్లను వణికించాడతను. దీంతో టీ20 వరల్డ్ కప్​లోనూ అతడు ఇదే స్థాయిలో చెలరేగాలని ఆసీస్ అభిమానులు కోరుకుంటున్నారు.

ఆస్ట్రేలియా సీనియర్ పేసర్ మిచెల్ స్టార్క్ ఇప్పుడు భీకర ఫామ్​లో ఉన్నాడు. ఐపీఎల్-2024లో నిప్పులు చెరిగే బంతులతో బ్యాటర్లను వణికించాడతను. దీంతో టీ20 వరల్డ్ కప్​లోనూ అతడు ఇదే స్థాయిలో చెలరేగాలని ఆసీస్ అభిమానులు కోరుకుంటున్నారు.

  • Published May 30, 2024 | 8:52 PMUpdated May 30, 2024 | 8:52 PM
ఆస్ట్రేలియాకు స్టార్క్ బలం అంటున్నారు.. కానీ అతడే బలహీనత: స్టార్ క్రికెటర్

ఆస్ట్రేలియా సీనియర్ పేసర్ మిచెల్ స్టార్క్ ఇప్పుడు భీకర ఫామ్​లో ఉన్నాడు. ఐపీఎల్-2024లో నిప్పులు చెరిగే బంతులతో బ్యాటర్లను వణికించాడతను. ఈ సీజన్ గ్రూప్ స్టేజ్​లో అతడు దారుణంగా ఫెయిలయ్యాడు. వికెట్లు తీయకపోగా, భారీగా పరుగులు కూడా ఇచ్చుకుంటూ టీమ్​కు భారం అయ్యాడు. అయినా మెంటార్ గౌతం గంభీర్​ అతడిపై నమ్మకం ఉంచాడు. రూ.25 కోట్ల ఆటగాడు ఇలాగేనా ఆడేది అంటూ విమర్శలు రావడంతో స్టార్క్ కసిగా ఆడటం మొదలుపెట్టాడు. లీగ్ సెకండాఫ్​లో ఫామ్​లోకి వచ్చిన ఈ కంగారూ పేసర్.. ప్లేఆఫ్స్ దశలో డేంజరస్​గా మారాడు. సన్​రైజర్స్ హైదరాబాద్​తో జరిగిన క్వాలిఫైయర్​-1లో 3 వికెట్లు, అదే జట్టు మీద ఫైనల్​లో 2 వికెట్లు తీశాడు. ఈ రెండు మ్యాచుల్లో కేకేఆర్ విజయంలో స్టార్క్​దే కీలక పాత్ర.

ఐపీఎల్-2024 ప్లేఆఫ్స్, ఫైనల్స్​లో అద్భుత ప్రదర్శనకు గానూ స్టార్క్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్​ అవార్డులు అందుకున్నాడు. క్యాష్ రిచ్ లీగ్ ముగియడంతో ఇప్పుడు టీ20 వరల్డ్ కప్-2024 మీద అతడు ఫోకస్ పెట్టాడు. ఇదే ఫామ్​ను కంటిన్యూ చేస్తూ పొట్టి కప్పును ఆస్ట్రేలియాకు అందించాలని చూస్తున్నాడు. కంగారూ ఫ్యాన్స్ కూడా అతడి మీద భారీ ఎక్స్​పెక్టేషన్స్ పెట్టుకున్నారు. స్టార్క్ రాణిస్తే తమకు తిరుగుండదని భావిస్తున్నారు. జట్టుకు అతడే కొండంత బలం అని అంటున్నారు. అయితే ఆసీస్ స్టార్ క్రికెటర్ టిమ్ పైన్ మాత్రం భిన్నంగా రియాక్ట్ అయ్యాడు. స్టార్క్​ జట్టుకు బలం కాదు.. పెద్ద బలహీనత అని అన్నాడు. అతడి వల్ల ఆసీస్​కు తీవ్ర నష్టమని చెప్పాడు. సూపర్బ్​ ఫామ్​లో ఉన్న స్టార్క్​ను ఉద్దేశించి పైన్ ఎందుకిలా అన్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..

ఏళ్ల కొద్దీ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనను కొనసాగిస్తూ స్టార్క్ ఈ తరంలో అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా ఎదిగాడని టిమ్ పైన్ మెచ్చుకున్నాడు. అయితే ఏటికేడు బౌలింగ్ స్టాండర్డ్స్​ను పెంచుతూ తనకు తానే శత్రువుగా మారాడని అభిప్రాయపడ్డాడు. స్టార్క్ బరిలోకి అడుగుపెట్టిన ప్రతిసారి అతడి నుంచి అభిమానులు అద్భుతాలు ఆశిస్తున్నారని.. కానీ ప్రతిసారి ఒకేలా రాణించడం ఎవరి వల్లా కాదన్నాడు పైన్. తన మీద ఫ్యాన్స్ పెట్టుకున్న ఎక్స్​పెక్టేషన్స్​ను అందుకునేందుకు స్టార్క్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడని.. ఈ క్రమంలో కొన్నిసార్లు సక్సెస్.. మరికొన్ని సార్లు ఫెయిల్ అవుతున్నాడని పేర్కొన్నాడు. అయితే టీ20 వరల్డ్ కప్​లో మాత్రం ఆసీస్​కు అతడు పెద్ద ఆయుధంగా మారనున్నాడని చెప్పుకొచ్చాడు. మరి.. స్టార్క్ వల్ల ఆసీస్​కు నష్టమేనంటూ పైన్ చేసిన వ్యాఖ్యలపై మీ ఒపీనియన్​ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.