Nidhan
ఆస్ట్రేలియా జట్టుకు మాస్ వార్నింగ్ ఇచ్చాడు ఆఫ్ఘానిస్థాన్ కోచ్. టైటిల్ ఫేవరెట్లలో ఒకటి, తోపు టీమ్ అని కూడా చూడకుండా కంగారూలకు అతడు సవాల్ విసిరాడు.
ఆస్ట్రేలియా జట్టుకు మాస్ వార్నింగ్ ఇచ్చాడు ఆఫ్ఘానిస్థాన్ కోచ్. టైటిల్ ఫేవరెట్లలో ఒకటి, తోపు టీమ్ అని కూడా చూడకుండా కంగారూలకు అతడు సవాల్ విసిరాడు.
Nidhan
టీ20 వరల్డ్ కప్-2024లో ఆఫ్ఘానిస్థాన్ అదరగొడుతోంది. పసికూన అనే ముద్రను చెరిపేస్తూ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. న్యూజిలాండ్, వెస్టిండీస్ వంటి బలమైన జట్లు ఉన్న గ్రూప్‌లో వరుస విక్టరీస్‌తో సూపర్-8కు క్వాలిఫై అయింది రషీద్ సేన. ఉగాండా, పీఎన్జీ లాంటి చిన్న జట్లతో పాటు కివీస్‌ను కూడా చిత్తు చేసింది ఆఫ్ఘాన్. ఇదే ఊపులో మరిన్ని గెలుపులతో సెమీస్‌కు చేరుకోవాలని చూస్తోంది. అటు బ్యాటర్లు, ఇటు బౌలర్లు కూడా రాణిస్తుండటంతో ఆ టీమ్‌కు ఎదురే లేకుండా పోయింది. దీంతో ఆ జట్టు మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. అయితే సూపర్-8లో ఆస్ట్రేలియా లాంటి బడా టీమ్‌ను ఎదుర్కోవాల్సి ఉండటంతో ఆఫ్ఘాన్ ఏం చేస్తుందోనని అంతా అనుకుంటున్నారు. కంగారూలను దాటి నాకౌట్ స్టేజ్‌కు చేరుకుంటుందా అని ఆలోచిస్తున్నారు.
ఆసీస్ గండాన్ని ఆఫ్ఘాన్ దాటడం పెద్ద కష్టమేమీ కాదని ఆ టీమ్ ఫ్యాన్స్ అంటున్నారు. వన్డే వరల్డ్ కప్-2023లోనే కంగారూలకు షాక్ తగిలేదని.. గ్లెన్ మాక్స్వెల్ వికెట్ పడితే రిజల్ట్ వేరేలా ఉండేదని చెబుతున్నారు. ఈ తరుణంలో ఆఫ్ఘానిస్థాన్ కోచ్ జొనాథన్ ట్రాట్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తమను తక్కువ అంచనా వేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నాడు. ఆసీస్‌ను ఈసారి మాత్రం వదలబోమంటూ వార్నింగ్ ఇచ్చాడు. గ్రూప్ స్టేజ్‌లో ఇంకా ఓ మ్యాచ్ ఆడాల్సి ఉందన్న ట్రాట్.. ఆ మ్యాచ్‌లో విండీస్‌ను ఓడిస్తే తమ మనోస్థైర్యం ఇంకా పెరుగుతుందని పేర్కొన్నాడు. సూపర్-8కు క్వాలిఫై అవడంపై సంతోషం వ్యక్తం చేసిన ఆఫ్ఘాన్ కోచ్.. అసలైన ఆట ఇంకా మిగిలే ఉందన్నాడు. తమ ఆటగాళ్లలోని బెస్ట్ గేమ్ తదుపరి మ్యాచుల్లో చూస్తారని చెప్పాడు.
‘ఆఫ్ఘానిస్థాన్ తమ బెస్ట్ గేమ్ ఇంకా ఆడలేదు. మా ప్లేయర్ల అసలైన ఆట ఇంకా బయటకు రాలేదు. దీనిపై మేం వర్క్ చేస్తున్నాం. సూపర్-8 దశలో బిగ్ టీమ్స్‌ను చిత్తు చేయాలంటే మేం ఇంకా బాగా ఆడాల్సి ఉంది. అందుకోసం చాలా శ్రమిస్తున్నాం. నెక్స్ట్ స్టేజ్‌లో ఆస్ట్రేలియాను తప్పక ఓడిస్తాం. ఇంకా గ్రూప్ దశలోనే ఉన్నాం. వెస్టిండీస్‌తో మ్యాచ్ ఇంకా మిగిలే ఉంది. ఈ మ్యాచ్‌తో పాటు తదుపరి దశలో ఆడే మ్యాచుల్లోనూ మేం మా బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తాం. వరుస విజయాలు సాధించినందుకు సంతోషంగా ఉంది. ఇదే ఊపును కొనసాగించాలని చూస్తున్నాం’ అని జొనాథన్ ట్రాట్ చెప్పుకొచ్చాడు. ఇక, విండీస్ మ్యాచ్ రిజల్ట్‌తో సంబంధం లేకుండా సూపర్-8 బెర్త్‌ను కన్ఫర్మ్ చేసుకుంది ఆఫ్ఘాన్. అయితే ఈ మ్యాచ్‌లో గెలిస్తే నెక్స్ట్ స్టేజ్‌లో మరింత కాన్ఫిడెన్స్‌తో ఆడొచ్చు. మరి.. పొట్టి కప్పులో రషీద్ సేన ఆడుతున్న తీరుపై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
Coach Trott “Afghanistan still hasn’t played their best game,there are things we still need to work on.Working on those over the next few days to give ourselves the best chance to beat the major teams”
I am sure they will knock Australia from next stagepic.twitter.com/GHcFXWV0V6
— Sujeet Suman (@sujeetsuman1991) June 14, 2024