iDreamPost
android-app
ios-app

అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన అమెరికా.. ఇండో-పాక్ మ్యాచ్ కోసం గొప్ప పని!

  • Published Apr 24, 2024 | 9:23 AM Updated Updated Apr 24, 2024 | 9:23 AM

భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అంటే ఉండే ఆసక్తి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అది కూడా వరల్డ్ కప్ ఫైట్ అయితే ఆ మజానే వేరు. ఆ మ్యాచ్​కు ఆతిథ్యం ఇస్తోంది అమెరికా.

భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అంటే ఉండే ఆసక్తి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అది కూడా వరల్డ్ కప్ ఫైట్ అయితే ఆ మజానే వేరు. ఆ మ్యాచ్​కు ఆతిథ్యం ఇస్తోంది అమెరికా.

  • Published Apr 24, 2024 | 9:23 AMUpdated Apr 24, 2024 | 9:23 AM
అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన అమెరికా.. ఇండో-పాక్ మ్యాచ్ కోసం గొప్ప పని!

భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అంటే ఉండే ఆసక్తి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అది కూడా వరల్డ్ కప్ ఫైట్ అయితే ఆ మజానే వేరు. ఆ మ్యాచ్​కు ఆతిథ్యం ఇస్తోంది అమెరికా. ఈ ఏడాది జూన్​లో టీ20 ప్రపంచ కప్ జరగనుంది. ఇందులో భాగంగా భారత్-పాకిస్థాన్ మ్యాచ్​కు న్యూయార్క్​లోని నాసావు కౌంటీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. దీంతో ఈ మ్యాచ్​ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. దాయాది జట్లు బరిలోకి దిగి కొదమసింహాల్లా కొట్లాడుతుంటే చూడాలని అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. ఆ అపురూపమైన క్షణాల కోసం కళ్లల్లో కొవ్వొత్తులు పెట్టుకొని వెయిట్ చేస్తున్నారు. సాధారణంగా రెండు దేశాల మధ్య ఐసీసీ టోర్నీల్లో తప్పితే మామూలు టైమ్​లో మ్యాచ్​లో జరగడం లేదు. అందుకే వరల్డ్ కప్ మ్యాచ్​కు ఇంత బజ్ నెలకొంది. అయితే న్యూయార్క్ నాసావు స్టేడియంపై భారీగా విమర్శలు వచ్చాయి.

అమెరికాలో క్రికెట్ ఆడేది అంతంత మాత్రమే. అక్కడ ఫుట్​బాల్ స్టేడియాలు ఎక్కువ. టీ20 వరల్డ్ కప్ నేపథ్యంలో కొన్ని ఫుట్​బాల్ స్టేడియాలను క్రికెట్ మైదానాలుగా మారుస్తున్నారు. అలాగే 34 వేల సీటింగ్ కెపాసిటీతో న్యూయార్క్​లో నసావు స్టేడియాన్ని నిర్మిస్తున్నారు. కానీ వరల్డ్ కప్ దగ్గర పడుతున్నా నిర్మాణ పనులు పూర్తవలేదు. స్టాండ్ల నిర్మాణం అసంపూర్తిగా ఉండటం, గ్రౌండ్​ కూడా సరిగ్గా లేకపోవడంతో ఆ మధ్య పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇలా అయితే భారత్-పాక్ మ్యాచ్ జరగడం కష్టమేనని.. అమెరికా తీరు బాగోలేదని, అసలు ఐసీసీ ఏం చేస్తోందంటూ క్రికెట్ ఫ్యాన్స్ అంతా సీరియస్ అయ్యారు. అయితే నసావు స్టేడియంలో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు బయటకు వచ్చాయి.

నసావు స్టేడియంలోని సగానికి పైగా స్టాండ్స్ వర్క్ కంప్లీట్ అయిందని తాజా ఫొటోలను బట్టి తెలుస్తోంది. పిచ్, గ్రౌండ్​ పనులు కూడా ఫాస్ట్​గా జరుగుతోందని సమాచారం. ఇంకొన్ని వారాల్లో వర్క్ ఫినిష్ చేసి మెగా టోర్నీ మొదలవడానికి ముందే మైదానాన్ని సిద్ధంగా ఉంచుతారని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది. నసావు స్టేడియం ఫొటోలు చూసిన నెటిజన్స్ యూఎస్​ను మెచ్చుకుంటున్నారు. ఇంత తక్కువ గ్యాప్​లో పనులు వేగంగా చేశారని.. స్టేడియం చాలా బాగుందని ప్రశంసిస్తున్నారు. అసాధ్యం అనుకున్న దాన్ని అగ్రరాజ్యం సుసాధ్యం చేసిందని.. మిగిలిన పనుల్ని కూడా ఫాస్ట్​గా కంప్లీట్ చేయాలని సూచిస్తున్నారు. ఇక, ఈ స్టేడియం భారత్-పాక్ మ్యాచ్​తో పాటు మొత్తంగా 8 మ్యాచ్​లకు ఆతిథ్యం ఇవ్వనుంది. అందుకే దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనులను వేగవంతం చేసింది యూఎస్.