iDreamPost

RR vs MI: హిస్టరీ క్రియేట్ చేసిన ట్రెంట్ బౌల్ట్.. IPL చరిత్రలో తొలి బౌలర్ గా..!

ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డును నమోదు చేశాడు ట్రెంట్ బౌల్ట్. దీంతో ఈ లీగ్ చరిత్రలో ఈ ఘనత సాధించిన ఫస్ట్ బౌలర్ గా బౌల్ట్ నిలిచాడు. ఆ వివరాల్లోకి వెళితే..

ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డును నమోదు చేశాడు ట్రెంట్ బౌల్ట్. దీంతో ఈ లీగ్ చరిత్రలో ఈ ఘనత సాధించిన ఫస్ట్ బౌలర్ గా బౌల్ట్ నిలిచాడు. ఆ వివరాల్లోకి వెళితే..

RR vs MI: హిస్టరీ క్రియేట్ చేసిన ట్రెంట్ బౌల్ట్.. IPL చరిత్రలో తొలి బౌలర్ గా..!

రాజస్తాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ ముంబై ఇండియన్స్ ఘోర పరాభవాన్ని చవిచూసింది. సమష్టిగా రాణించిన ఆర్ఆర్ ప్లేయర్లు 9 వికెట్ల తేడాతో ముంబైని చిత్తుచేశారు. యశస్వీ జైస్వాల్ అద్భుతమైన శతకంతో మెరిశాడు. ఇక ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ వికెట్ పడగొట్టడం ద్వారా ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డును నమోదు చేశాడు ట్రెంట్ బౌల్ట్. దీంతో ఈ లీగ్ హిస్టరీలో తొలి బౌలర్ గా రికార్డుల్లోకి ఎక్కాడు. ఈ క్రమంలో భువనేశ్వర్ కుమార్ రికార్డ్ ను సైతం బద్దలు కొట్టాడు. ఆ వివరాల్లోకి వెళితే..

రాజస్తాన్ రాయల్స్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో సరికొత్త చరిత్రను సృష్టించాడు. ఈ మ్యాచ్ లో తొలి ఓవర్ లోనే రోహిత్ శర్మను ఔట్ చేశాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే తొలి ఓవర్ లో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ గా రికార్డుల్లోకి ఎక్కాడు. బౌల్ట్ ఇప్పటి వరకు తొలి ఓవర్ లో 17.65 సగటుతో 26 వికెట్లు తీశాడు. ఇంతకు ముందు ఈ ఘనత భువనేశ్వర్ కుమార్ పేరిట ఉండేది. అతడు ఫస్ట్ ఓవర్లో 25 వికెట్లు నేలకూల్చాడు. ఈ లిస్ట్ లో 15 వికెట్లతో ప్రవీణ్ కుమార్ తర్వాతి ప్లేస్ లో ఉన్నాడు. ఈ రికార్డుతో పాటుగా పవర్ ప్లేలో 50 వికెట్లు తీసిన బౌలర్ గా కూడా బౌల్ట్ నిలిచాడు.

trent boult

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 9 వికెట్లు నష్టపోయి 179 రన్స్ చేసింది. రోహిత్(6), ఇషాన్(0), సూర్యకుమార్(10), హార్దిక్ పాండ్యా(10) దారుణంగా విఫలం అయ్యారు. కానీ తిలక్ వర్మ(65), నేహల్ వాధేర(45) ఇద్దరు అద్భుతంగా రాణించారు. దీంతో ముంబై ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. అనంతరం 180 పరుగుల టార్గెట్ ను 18.4 ఓవర్లలో కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది రాజస్తాన్ రాయల్స్ టీమ్. యశస్వీ జైస్వాల్ (104*) అజేయం శతకంతో కదంతొక్కడంతో.. ఆర్ఆర్ ఈజీగా విజయం సాధించింది. ఆర్ఆర్ బౌలర్ సందీప్ శర్మ 5 వికెట్లతో ముంబై పతనాన్ని శాసించాడు. మరి ఐపీఎల్ చరిత్రలో తొలి బౌలర్ గా ఘనతకెక్కిన బౌల్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి