iDreamPost
android-app
ios-app

వరల్డ్ కప్​ ఫస్ట్ మ్యాచ్​కు టీమిండియా రెడీ.. ప్లేయింగ్ ఎలెవన్ ఇదే!

  • Published Jun 05, 2024 | 9:53 AM Updated Updated Jun 05, 2024 | 9:53 AM

పొట్టి కప్పు వేటకు సిద్ధమైంది టీమిండియా. తొలి మ్యాచ్​లో పసికూన ఐర్లాండ్​తో తలపడనుంది రోహిత్ సేన. ఈ మ్యాచ్​లో మన జట్టు ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండనుందో ఇప్పుడు తెలుసుకుందాం..

పొట్టి కప్పు వేటకు సిద్ధమైంది టీమిండియా. తొలి మ్యాచ్​లో పసికూన ఐర్లాండ్​తో తలపడనుంది రోహిత్ సేన. ఈ మ్యాచ్​లో మన జట్టు ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండనుందో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Jun 05, 2024 | 9:53 AMUpdated Jun 05, 2024 | 9:53 AM
వరల్డ్ కప్​ ఫస్ట్ మ్యాచ్​కు టీమిండియా రెడీ.. ప్లేయింగ్ ఎలెవన్ ఇదే!

పొట్టి కప్పు వేటకు సిద్ధమైపోయింది టీమిండియా. తొలి మ్యాచ్​లో పసికూన ఐర్లాండ్​తో తలపడనుంది రోహిత్ సేన. న్యూయార్క్​లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఈ మ్యాచ్​కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మ్యాచ్​ కోసం సర్వం సిద్ధమైంది. ఇరు జట్లు బరిలోకి దూకడమే ఆలస్యం. ఐర్లాండ్​ను చిత్తు చేసి కప్పు వేటను ఘనగా ఆరంభించాలని భారత్ భావిస్తోంది. పటిష్టమైన టీమిండియాకు షాక్ ఇచ్చి.. పసికూనగా తమ మీద ఉన్న ముద్ర చెరిపేసుకోవాలని ఐర్లాండ్ చూస్తోంది. ఆ టీమ్ బ్యాటింగ్ యూనిట్ బలంగా ఉండటంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఆస్ట్రేలియా నుంచి తీసుకొచ్చిన డ్రాపిన్ పిచ్​లపై ఎలాంటి ప్లేయింగ్ ఎలెవన్​తో ముందుకు వెళ్తారనేది ఇంట్రెస్టింగ్​గా మారింది.

నసావు స్టేడియంలో సౌతాఫ్రికా-శ్రీలంక మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్​లో లంక 77 పరుగులకే కుప్పకూలింది. ఈ టార్గెట్​ను ఛేదించేందుకు ప్రొటీస్ ఆపసోపాలు పడింది. కిందా మీద పడి 16.2 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని అందుకుంది. ఆ మ్యాచ్​లో ఆన్రిచ్ నోకియా, కగిసో రబాడ లాంటి పేసర్లతో పాటు కేశవ్ మహారాజ్, వనిందు హసరంగ లాంటి స్పిన్నర్లు కూడా చెలరేగిపోయారు. దీంతో ఐర్లాండ్​తో మ్యాచ్​లో భారత జట్టు ప్లేయింగ్ ఎలెవన్​ ఇంట్రెస్టింగ్​గా మారింది. బంగ్లాదేశ్​తో వార్మప్ మ్యాచ్​లో ఆడించలేదు కాబట్టి యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ డగౌట్​కే పరిమితం కావొచ్చు. టాప్ బ్యాటర్ విరాట్​ కోహ్లీతో కలసి కెప్టెన్ రోహిత్ ఇన్నింగ్స్ మొదలుపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రాక్టీస్ మ్యాచ్​లో సంజూ శాంసన్ ఫెయిలయ్యాడు కాబట్టి వికెట్ కీపర్​గా రిషబ్ పంత్ ఆడటం పక్కా అని చెప్పొచ్చు.

పంత్​తో పాటు సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబె మిడిలార్డర్ భారాన్ని మోయనున్నారు. రవీంద్ర జడేజాతో కలసి వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఫినిషర్ రోల్​ నిర్వర్తించనున్నాడు. మెయిన్ స్పిన్నర్​గా కుల్దీప్ యాదవ్, పేసర్లుగా జస్​ప్రీత్ బుమ్రా, అర్ష్​దీప్ సింగ్ బరిలోకి దిగడం ఖాయం. అయితే ఇంకో బెర్త్ కోసం ముగ్గురు ఆటగాళ్ల మధ్య పోటీ నెలకొంది. మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్​లో ఎవర్ని తీసుకుంటారనేది చూడాలి. ఆల్రెడీ జడ్డూ, కుల్దీప్ రూపంలో ఇద్దరు లెఫ్టార్మ్ బౌలర్లు ఉన్నారు కాబట్టి ఎక్స్​ట్రా స్పిన్నర్ కావాలనుకుంటే చాహల్​ను ప్లేయింగ్ ఎలెవన్​లోకి తీసుకోవచ్చు. లంక-ప్రొటీస్ మ్యాచ్​లో నసావు పిచ్ పేసర్లుకు కాస్త ఎక్కువగా అనుకూలించింది. కాబట్టి అదనపు పేసర్ కావాలనుకుంటే సిరాజ్ వైపు రోహిత్ మొగ్గుచూపొచ్చు. మొత్తానికి ప్లేయింగ్ ఎలెవన్​లో 5 మంది స్పెషలిస్ట్ బౌలర్లు ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. వాళ్లకు తోడుగా హార్దిక్, దూబె ఎలాగూ ఉంటారు. మరి.. భారత తుది జట్టులో ఇంకా ఎవరికైనా చోటు దక్కితే బాగుంటుదని మీరు భావిస్తే కామెంట్ చేయండి.

భారత జట్టు (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శివమ్ దూబె, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్/మహ్మద్ సిరాజ్, జస్​ప్రీత్ బుమ్రా, అర్ష్​దీప్ సింగ్.