Nidhan
సూపర్-8 దశకు చేరుకున్న టీమిండియా.. తదుపరి డేంజరస్ టీమ్స్‌ను ఫేస్ చేయనుంది. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్ కప్పు కొట్టాలంటే అతడు రాణించాలని అన్నాడు.
సూపర్-8 దశకు చేరుకున్న టీమిండియా.. తదుపరి డేంజరస్ టీమ్స్‌ను ఫేస్ చేయనుంది. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్ కప్పు కొట్టాలంటే అతడు రాణించాలని అన్నాడు.
Nidhan
పొట్టి కప్పు ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. ఒకటి, రెండు మినహా దాదాపుగా గ్రూప్ దశ మ్యాచ్‌లు ముగిశాయి. సూపర్-8 టీమ్స్‌పై కూడా సుమారుగా క్లారిటీ వచ్చేసింది. వరుస విజయాలతో టోర్నీలో దుమ్మురేపుతున్న టీమిండియా.. నెక్స్ట్ స్టేజ్‌లో ఎవరితో తలపడుతుందనేది కూడా ఆసక్తికరంగా మారింది. సూపర్-8కు చేరుకున్న రోహిత్ సేన.. ఇందులో భాగంగా ఆఫ్ఘానిస్థాన్, ఆస్ట్రేలియాతో తాడోపేడో తేల్చుకోనుంది. అలాగే బంగ్లాదేశ్ లేదా నెదర్లాండ్స్‌లో ఒక టీమ్తోనూ తలపడనుంది భారత్. ఇప్పటివరకు యూఎస్ఏలో ఆడుతూ వచ్చిన మెన్ ఇన్ బ్లూ.. ఇక మీదట కరీబియన్ దీవుల్లో ఆడనుంది. ఇంత వరకు ట్రిక్కీ పిచ్‌లను ఫేస్ చేసిన టీమిండియా.. ఇక ముందు స్లో పిచ్‌లు విసిరే సవాల్‌ను ఎదుర్కోనుంది.
సూపర్-8 దశలో ఆఫ్ఘానిస్థాన్, ఆస్ట్రేలియా లాంటి డేంజరస్ టీమ్స్‌ను భారత్ ఫేస్ చేయనుంది. ఒకవేళ బంగ్లాదేశ్ కూడా క్వాలిఫై అయితే ఆ టీమ్తోనూ తాడోపేడో తేల్చుకోవాల్సి ఉంటుంది. ఈ జట్లన్నీ వెస్టిండీస్ పిచ్‌లకు బాగా అలవాటు పడ్డాయి. ముఖ్యంగా ఆసీస్ అయితే అక్కడ చెలరేగి ఆడుతోంది. గ్లెన్ మాక్స్వెల్ తప్పితే మిగతా ఆటగాళ్లంతా ప్రత్యర్థులతో ఆడుకుంటున్నారు. సెమీస్ చేరాలంటే కంగారూ గండాన్ని దాటాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఇక మీదట రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కాదు.. హార్దిక్ పాండ్యా మన జట్టుకు కీలకం కానున్నాడని అన్నాడు. బిగ్ మ్యాచెస్‌లో నెగ్గాలంటే హార్దిక్ తన రియల్ టాలెంట్‌ను చూపించాల్సి ఉంటుందని చెప్పాడు. మునుపటి పాండ్యాను బయటకు తీయాలని తెలిపాడు.
‘హార్దిక్ పాండ్యా గేర్లు మార్చాల్సిన అవసరం ఉంది. బ్యాటింగ్‌లో అతడు వేగం పెంచాలి. ధనాధన్ షాట్లతో విరుచుకుపడాల్సిన సమయం వచ్చేసింది. నాకౌట్ గేమ్స్‌లో హార్దిక్ విధ్వంసకంగా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా జరిగిన గ్రూప్ దశ మ్యాచుల్లో అతడు అంతగా రాణించలేదు. బౌలింగ్‌లో భేష్. కానీ బ్యాటింగ్‌లో మాత్రం తడాఖా చూపించలేదు. కాబట్టి పాండ్యా గాడిన పడాలి. నాకౌట్ గేమ్స్‌లో నెగ్గాలంటే పాండ్యా రాణించాల్సిన ఆవశ్యకత ఉంది. అతడు మరింత ఎఫెక్టివ్‌గా బౌలింగ్ చేస్తే ప్లేయింగ్ ఎలెవన్‌లో కుల్దీప్ యాదవ్‌ను తీసుకోవచ్చు. అతడు వేసే లెంగ్త్ విండీస్ పిచ్‌లకు బాగా సెట్ అవుతాయి. అతడి కట్టర్స్, స్లో బౌన్సర్స్ ఎదుర్కోవడం ప్రత్యర్థి బ్యాటర్లకు అంత ఈజీ కాదు’ అని పఠాన్ పేర్కొన్నాడు. మరి.. హార్దిక్ చాలా కీలకమంటూ పఠాన్ చేసిన వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తున్నట్లయితే కామెంట్ చేయండి.
Irfan Pathan ” Hardik Pandya batting needs to come to the fore bcz there will be a time in the knockout games where his batting will be required,By that time,hopefully he will get some runs which he’s not got so far.” pic.twitter.com/1kKbAKf2Da
— Sujeet Suman (@sujeetsuman1991) June 15, 2024