iDreamPost
android-app
ios-app

భారత్​లో నాకౌట్ భయం! ఆస్ట్రేలియా కాదు.. అసలు ముప్పు ఆ జట్టుతోనే!

  • Published Jun 20, 2024 | 3:44 PMUpdated Jun 20, 2024 | 3:44 PM

టీమిండియాలో ఇప్పుడు నాకౌట్ భయం పట్టుకుంది. సూపర్-8 మొదలవక ముందే రోహిత్ సేనలో ఆందోళన షురూ అయింది. ఆస్ట్రేలియా కాదు.. భారత్​కు అసలు ముప్పు ఆ జట్టుతోనే ఉంది.

టీమిండియాలో ఇప్పుడు నాకౌట్ భయం పట్టుకుంది. సూపర్-8 మొదలవక ముందే రోహిత్ సేనలో ఆందోళన షురూ అయింది. ఆస్ట్రేలియా కాదు.. భారత్​కు అసలు ముప్పు ఆ జట్టుతోనే ఉంది.

  • Published Jun 20, 2024 | 3:44 PMUpdated Jun 20, 2024 | 3:44 PM
భారత్​లో నాకౌట్ భయం! ఆస్ట్రేలియా కాదు.. అసలు ముప్పు ఆ జట్టుతోనే!

పొట్టి కప్పులో అదరగొడుతున్న టీమిండియా ఇప్పుడు సిసలైన సవాల్​కు సిద్ధమవుతోంది. గ్రూప్ దశలో బ్యాక్ టు బ్యాక్ విక్టరీస్​తో సత్తా చాటిన రోహిత్ సేన.. సూపర్-8లోకి దర్జాగా అడుగుపెట్టింది. మెన్ ఇన్ బ్లూకు ఇక మీదట ప్రతి మ్యాచ్​ చావోరేవో కానుంది. సూపర్ పోరులో ఆఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్​తో పాటు ఫేవరెట్లలో ఒకటైన ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది భారత్. సెమీస్ బెర్త్ దక్కించుకోవాలంటే ఈ జట్లను చిత్తు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఏదైనా ఒక మ్యాచ్ ఓడినా.. మిగతా వాటిల్లో ఘనవిజయాలు సాధించాలి, అలాగే నెట్ రన్​రేట్​ను మెరుగ్గా ఉంచుకోవాలి. అప్పుడు సెమీస్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. సూపర్ పోరులో భాగంగా ఇవాళ ఆఫ్ఘాన్​ను ఫేస్ చేయనుంది టీమిండియా. ఈ మ్యాచ్​లో గ్రాండ్ విక్టరీ కొట్టి ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపాలని చూస్తోంది.

ఆఫ్ఘానిస్థాన్​పై విక్టరీ కొడితే టీమ్​లో మరింత జోష్ వస్తుంది. అయితే సూపర్ పోరు మొదలవక ముందే టీమిండియాలో భయమైంది. తదుపరి ఆడబోయే ఆఫ్ఘాన్, ఆసీస్, బంగ్లా గురించి కాకుండా మరో టీమ్ గురించి రోహిత్ సేన టెన్షన్ పడుతోంది. ఆ జట్టుతో గానీ మ్యాచ్ ఉంటే ఇక తమ పని అయిపోయినట్లేనని భావిస్తోంది. కప్పు ఆశలు ఇక వదులుకోవాల్సిందేనని గుబులు పడుతోంది. భారత్​ను ఇంతగా భయపెడుతున్న ఆ జట్టే ఇంగ్లండ్. గ్రూప్ దశలోనే ఇంటిదారి పడుతుందని అనుకున్న ఆ టీమ్ అదృష్టం కొద్దీ సూపర్-8కు అర్హత సాధించింది. అయితే మెగా టోర్నీలో ఫస్ట్ ఫేస్​లో తమ పేరుకు తగ్గట్లు ఆడలేదు ఇంగ్లీష్ టీమ్. పేలవమైన ఆటతీరుతో నిరాశపర్చింది. అయితే సూపర్ పోరులో ఆతిథ్య వెస్టిండీస్​పై పంజా విసిరింది.

విండీస్​తో జరిగిన తొలి సూపర్-8 మ్యాచ్​లో బట్లర్ సేన ఏకంగా 8 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్​లో కరీబియన్ టీమ్ విసిరిన 180 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది ఇంగ్లండ్. మరో 15 బంతులు ఉండగానే 2 వికెట్లు కోల్పోయి టార్గెట్​ను అందుకుంది. ఫిల్ సాల్ట్ (47 బంతుల్లో 87 నాటౌట్) విధ్వంసక బ్యాటింగ్​తో రెచ్చిపోయాడు. మొన్నటి వరకు సాధారణ ఆటతీరుతో నిరాశపర్చిన జట్టు.. సూపర్ పోరులో అనూహ్యంగా చెలరేగి ఆడటం గమనార్హం. ఇంగ్లండ్ గేమ్ చూసిన రోహిత్ సేన భయపడుతోంది. సూపర్-8లో గ్రూప్​-ఏలో ఉన్న భారత్ అన్ని మ్యాచుల్లోనూ నెగ్గితే ఈజీగా సెమీస్​కు చేరుతుంది.

ఒకవేళ సూపర్-8లో ఏదైనా ఒక మ్యాచ్​లో ఓడి గ్రూప్ టాపర్​గా కాకుండా రెండో జట్టుగా క్వాలిఫై అయిందా నాకౌట్​ మ్యాచ్​లో ఇంగ్లండ్​ను ఎదుర్కోవాల్సి రావొచ్చు. ఇదే ఇప్పుడు మెన్ ఇన్ బ్లూను టెన్షన్ పెడుతోంది. ఐసీసీ టోర్నీల్లో మొదట్లో నార్మల్​గా ఆడే ఇంగ్లీష్ టీమ్.. నాకౌట్ స్టేజ్​లో డేంజరస్​గా మారుతుంది. ఆ జట్టును ఓడించాలంటే ఎంతటి జట్టుకైనా కష్టంగా మారుతుంది. టీ20 ప్రపంచ కప్-2022లో సెమీస్​లో ఇంగ్లండ్ చేతుల్లోనే ఓడి ఇంటిదారి పట్టింది భారత్. అందుకే ఆ టీమ్​తో మళ్లీ నాకౌట్ ఫైట్ ఉంటుందేమోనని ఆందోళన చెందుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి