iDreamPost
android-app
ios-app

IND vs AUS: ఆసీస్ పై అద్భుత విజయానికి 3 ప్రధాన కారణాలు! ఆ ఒక్కటీ స్పెషల్..

సూపర్ 8లో భాగంగా ఆసీస్ తో జరిగిన మ్యాచ్ లో బ్యాట్, బంతితో రాణించిన టీమిండియా.. 24 పరుగుల తేడాతో కంగారూల టీమ్ ను ఓడించింది. ఇక ఈ అద్బుత విజయానికి 3 కారణాలు ఉన్నాయి. ఆ వివరాలు..

సూపర్ 8లో భాగంగా ఆసీస్ తో జరిగిన మ్యాచ్ లో బ్యాట్, బంతితో రాణించిన టీమిండియా.. 24 పరుగుల తేడాతో కంగారూల టీమ్ ను ఓడించింది. ఇక ఈ అద్బుత విజయానికి 3 కారణాలు ఉన్నాయి. ఆ వివరాలు..

IND vs AUS: ఆసీస్ పై అద్భుత విజయానికి 3 ప్రధాన కారణాలు! ఆ ఒక్కటీ స్పెషల్..

టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఎన్నో ఐసీసీ టోర్నీ ఫైనల్స్ లో టీమిండియాను ఓడించి.. విర్రవీగుతున్న కంగారూ టీమ్ ను తాజాగా ఓడించి పగ తీర్చుకుంది. సూపర్ 8లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్ లో 24 పరుగుల తేడాతో ఓడించి.. వారి సెమీస్ అవకాశాలపై దెబ్బకొట్టింది. ఈ మ్యాచ్ లో టీమిండియా బ్యాట్ తోనూ, బంతితోనూ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించి దర్జాగా సెమీస్ చేరింది. ఆస్ట్రేలియాపై సాధించిన ఈ అద్భుత విజయానికి 3 ప్రధాన కారణాలు ఉన్నాయి. అందులో ఒక్కటి మాత్రం స్పెషల్ అనే చెప్పాలి. మరి ఆ కారణాలు ఏంటో చూసేద్దాం పదండి.

టీమిండియా అద్భుత విజయానికి 3 ప్రధాన కారణాలు:

1. రోహిత్ సూపర్ బ్యాటింగ్

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. అసలు ఓ మోస్తారు స్కోర్ అయినా ప్రత్యర్థి ముందు ఉంచుతుందా అనిపించింది. ఎందుకంటే? టీమిండియా 2 ఓవర్లలో 6 పరుగులే చేసి.. విరాట్ కోహ్లీ(0) వికెట్ కోల్పోయింది. హేజిల్ వుడ్ నిప్పులు చెరిగే బంతులతో భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టి కోహ్లీ వికెట్ తీసుకున్నాడు. అయితే వారి సంతోషాన్ని ఎంతోసేపు ఉంచలేదు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. ఆసీస్ బౌలర్ స్టార్క్ వేసిన ఇన్నింగ్స్ 3వ ఓవర్లో పెను విధ్వంసాన్ని సృష్టించాడు. ఈ ఓవర్లో ఏకంగా 28(వైడ్ తో కలిపి) పరుగులు పిండుకున్నాడు. దాంతో ఆసీస్ బౌలర్లు ఆత్మరక్షణలో పడ్డారు. రోహిత్ సూపర్ బ్యాటింగ్ తో కేవలం 9 ఓవర్లలోనే భారత్ 100 పరుగుల మార్క్ ను చేరుకుంది. రోహిత్ బాదుడు చూస్తే.. అతడు డబుల్ సెంచరీ చేయడం పక్కా అనుకున్నారు. కానీ సెంచరీ దిశగా సాగుతున్న హిట్ మ్యాన్ ను స్టార్క్ బౌల్డ్ చేశాడు. ఓవరాల్ గా 41 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సులతో 92 పరుగులు చేశాడు రోహిత్. టీమిండియా విజయం సాధించడంలో ఇది స్పెషల్ రీజన్ అనే చెప్పాలి.

2. బౌలింగ్

ఆసీస్ టార్గెట్ 206 పరుగులు కావడంతో టీమిండియా ఈజీగానే గెలుస్తుందని అందరూ భావించారు. పైగా ఆఫ్గాన్ పై 149 పరుగులను ఛేదించలేక చతికిలపడటంతో.. ఈ నిర్ణయానికి వచ్చారు. కానీ వారు టార్గెట్ ను కొట్టే ప్రయత్నంలో గట్టిగానే పోరాడారు. అయితే వారికి తొలి ఓవర్లోనే షాకిచ్చాడు టీమిండియా యంగ్ పేసర్ అర్షదీప్  సింగ్. వార్నర్(6) ఎక్కువసేపు క్రీజ్ లో నిలవనీయలేదు. అయితే హెడ్ కు జత కలిసిన మిచెల్ మార్ష్ భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. దాంతో పవర్ ప్లే ముగిసేసరికి ఆసీస్ 65/1తో పటిష్ట స్థితిలో నిలిచింది. ఈ దశలో కుల్దీప్ యాదవ్ పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా.. మార్ష్(37), మాక్స్ వెల్(20) లను పెవిలియన్ కు పంపాడు. ఇక 22 బంతుల్లో 57 పరుగులు చేయాల్సిన దశలో హెడ్(76)ను బుమ్రా ఔట్ చేశాడు. దాంతో భారత్ విజయం ఖాయమైంది. ఇక ఆ తర్వాత 18వ ఓవర్లో మాథ్యూ వేడ్(1), టిమ్ డేవిడ్(15)లను వెనక్కి పంపాడు.

3. సమష్టి ప్రదర్శన

ఆసీస్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా సమష్టి ప్రదర్శనతో ఆకట్టుకుంది. బ్యాటర్లు రోహిత్ శర్మ(92), సూర్యకుమార్(31), శివమ్ దూబే(28), హార్దిక్ పాండ్యా(27) పరుగులతో రాణించారు. ఇక బౌలింగ్ లో అర్షదీప్ 3 వికెట్లు, కుల్దీప్ 2, బుమ్రా, అక్షర్ పటేల్ తలా ఓ వికెట్ తీశారు. ఫీల్డింగ్ లో సైతం భారత ఆటగాళ్లు అదరగొట్టారు. మరీ ముఖ్యంగా కుల్దీప్ బౌలింగ్ లో ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ ఇచ్చిన క్యాచ్ ను అక్షర్ పటేల్ అందుకున్న తీరు అమోఘం. ఇలా అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించి.. 24 రన్స్ తేడాతో ఆసీస్ ను ఓడించింది టీమిండియా. సెమీస్ లో పటిష్టమైన ఇంగ్లాండ్ ను ఢీ కొనబోతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి