iDreamPost
android-app
ios-app

IND vs ENG: టీమిండియాకు గుడ్ న్యూస్.. సెమీస్ లో ఇక తిరుగులేదు! ఫ్యాన్స్ ఫుల్ ఖుషి..

  • Published Jun 26, 2024 | 8:43 AM Updated Updated Jun 26, 2024 | 8:43 AM

టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో ఇంగ్లండ్ తో అమీతుమీ తేల్చుకోనుంది టీమిండియా. ఇక ఈ టోర్నీలో జోరుమీదున్న భారత్ కు ఈ మ్యాచ్ కు ముందు ఓ భారీ గుడ్ న్యూస్ అందింది. ఇది తెలిసి ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ఇంతకీ ఆ శుభవార్త ఏంటి? తెలుసుకుందాం పదండి.

టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో ఇంగ్లండ్ తో అమీతుమీ తేల్చుకోనుంది టీమిండియా. ఇక ఈ టోర్నీలో జోరుమీదున్న భారత్ కు ఈ మ్యాచ్ కు ముందు ఓ భారీ గుడ్ న్యూస్ అందింది. ఇది తెలిసి ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ఇంతకీ ఆ శుభవార్త ఏంటి? తెలుసుకుందాం పదండి.

IND vs ENG: టీమిండియాకు గుడ్ న్యూస్.. సెమీస్ లో ఇక తిరుగులేదు! ఫ్యాన్స్ ఫుల్ ఖుషి..

టీ20 వరల్డ్ కప్ 2024 టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన టీమిండియా.. అసాధారణ ప్రదర్శనతో సెమీస్ కు దూసుకొచ్చింది. టైటిల్ కు ఒక్క అడుగు దూరంలో ఉంది. సెమీస్ లో ఇంగ్లండ్ ను ఢీ కొనేందుకు సిద్ధమైంది. గురువారం(జూన్ 27)న గయానా వేదికగా జరగబోయే రసవత్తర పోరుకు సర్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో టీమిండియాకు ఓ భారీ గుడ్ న్యూస్ అందింది. ఇది ఫ్యాన్స్ కు ఫుల్ కిక్కిస్తోంది. దాంతో టీమిండియాకు సెమీస్ లో తిరుగులేదని భావిస్తున్నారు. మరి ఆ శుభవార్త ఏంటి? చూద్దాం పదండి.

సెమీఫైనల్లో ఇంగ్లండ్ కు ఓడించి.. గత వరల్డ్ కప్ సెమీస్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది టీమిండియా. ఇప్పటికే ఆసీస్ పై పగ తీర్చుకున్న భారత్.. అదే జోరును ఇంగ్లండ్ పై చూపించి లెక్క సరిచేయాలని ఆరాటపడుతోంది. ఇక ఈ కీలక పోరు కోసం టీమిండియా సర్వం సిద్ధమైంది. మరోవైపు ఇంగ్లండ్ కూడా మంచి జోరుమీదుంది. ఈ క్రమంలో టీమిండియాకు ఓ గుడ్ న్యూస్ అందింది. అదేంటంటే?

ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ సెమీ ఫైనల్ మ్యాచ్ కోసం ఐసీసీ అంపైర్ల జాబితాను విడుదల చేసింది. ఈ లిస్ట్ లో ఆన్ ఫీల్డ్ అంపైర్లుగా క్రిస్ గఫానీ, రాడ్ టక్కర్ వ్యవహరించనుండగా.. థర్డ్ అంపైర్ జోయల్ విల్సన్, ఫోర్త్ అంపైర్ గా పాల్ రీఫిల్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఇక మ్యాచ్ రిఫరీగా జెఫ్రీ కోవ్ వ్యవహరించనున్నాడు. ఇక ఈ మ్యాచ్ కు ఐరన్ లెగ్ అంపైర్ రిచర్డ్ కెటిల్ బరో లేకపోవడంతో టీమిండియా ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. కెటిల్ బరో భారత్ కు విలన్ గా మారాడు.

2014 నుంచి రిచర్డ్ కెటిల్ బరో అంపైర్ గా వ్యవహరించిన ఏ నాకౌట్ మ్యాచ్ లోనూ టీమిండియా విజయం సాధించలేదు. అప్పటి నుంచి అతడు భారత పాలిట విలన్ గా మారాడు. ఇక ఈ మ్యాచ్ లో కెటిల్ బరో అంపైర్ గా లేకపోవడం టీమిండియాకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. కాగా.. ఆఫ్గాన్-సౌతాఫ్రికా మ్యాచ్ కు థర్డ్ అంపైర్ గా రిచర్డ్ కెటిల్ బరో వ్యవహరించనున్నాడు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.