iDreamPost
android-app
ios-app

వరల్డ్ కప్​కు ముందు ప్రత్యర్థులకు వార్నర్ హెచ్చరిక.. తమకు అదే ముఖ్యమంటూ..!

  • Published May 31, 2024 | 5:16 PMUpdated May 31, 2024 | 5:16 PM

టీ20 వరల్డ్ కప్-2024కు ముందు ప్రత్యర్థి జట్లకు ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ హెచ్చరికలు జారీ చేశాడు. తమకు అదొక్కటే ముఖ్యమంటూ వార్నింగ్ బెల్స్ మోగించాడు.

టీ20 వరల్డ్ కప్-2024కు ముందు ప్రత్యర్థి జట్లకు ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ హెచ్చరికలు జారీ చేశాడు. తమకు అదొక్కటే ముఖ్యమంటూ వార్నింగ్ బెల్స్ మోగించాడు.

  • Published May 31, 2024 | 5:16 PMUpdated May 31, 2024 | 5:16 PM
వరల్డ్ కప్​కు ముందు ప్రత్యర్థులకు వార్నర్ హెచ్చరిక.. తమకు అదే ముఖ్యమంటూ..!

టీ20 వరల్డ్ కప్-2024 సంబురం మొదలయ్యేందుకు ఇంకా రెండ్రోజుల సమయం మాత్రమే ఉంది. కప్పుపై కన్నేసిన జట్లన్నీ అమెరికాకు చేరుకున్నాయి. టైటిల్ ఫెవరెట్స్​లో ఒకటైన ఆస్ట్రేలియా కూడా యూఎస్ చేరుకొని సాధన మొదలుపెట్టింది. ప్రాక్టీస్ మ్యాచ్​లో పసికూన నమీబియాను చిత్తు చేసింది. భారత్ ఆతిథ్యం ఇచ్చిన వన్డే వరల్డ్ కప్-2023ని కైవసం చేసుకున్న ఆసీస్.. పొట్టి కప్పును కూడా స్వాధీనం చేసుకోవాలని చూస్తోంది. ఆ జట్టు ఆటగాళ్లు కూడా భీకర ఫామ్​లో ఉండటం కలిసొచ్చే అంశం. గ్లెన్ మాక్స్​వెల్, మిచ్ మార్ష్, డేవిడ్ వార్నర్ లాంటి కొందరు కీలక ఆటగాళ్లు ఇంకా ఫామ్ అందుకోకపోవడంతో ఆ జట్టు అభిమానులు కాస్త టెన్షన్ పడుతున్నారు. అయితే వరల్డ్ కప్ అంటే చాలు.. కంగారూ ఆటగాళ్ల శక్తులన్నీ తిరిగొస్తాయి.

ప్రపంచ కప్ అనగానే ఆసీస్ ప్లేయర్లు చెలరేగిపోతారు. అప్పటిదాకా ఫామ్​లో లేని వాళ్లు కూడా విజృంభించి ఆడతారు. తమ శక్తులన్నీ కూడగట్టుకొని ఆకాశమే హద్దుగా విధ్వంసం సృష్టిస్తారు. ఇది వాళ్లకు ఆనవాయితీగా వస్తోంది. కాబట్టి ప్లేయర్ల ఫామ్ గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఈ తరుణంలో ఆసీస్ డేంజరస్ ఓపెనర్ వార్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కప్పు తమదేనని.. అడ్డొస్తే ఎవ్వర్నీ వదలబోమంటూ ప్రత్యర్థులకు వార్నింగ్ ఇచ్చాడు. టీమ్​లో చోటు దక్కడం గురించి టెన్షన్ లేదని.. వస్తే మాత్రం అపోజిషన్ బౌలర్లకు బడిత పూజ తప్పదని హెచ్చరించాడు. జట్టులో ప్లేస్ వస్తే బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తానని, మ్యాచ్ విన్నర్​గా నిలిచేందుకు ట్రై చేస్తానన్నాడు వార్నర్.

జట్టులో చోటు దక్కడం గురించి వార్నర్ ఇలా మాట్లాడటం వెనుక ఓ కారణం ఉంది. ఎంతో ఎక్స్​పీరియెన్స్ కలిగిన డేవిడ్ భాయ్​కు ప్లేస్ గురించి ఎందుకు వర్రీ కొందరు అనుకుంటుండొచ్చు. కానీ కంగారూ జట్టు టీమ్​సిచ్యువేషన్ ఇప్పుడు అలా ఉంది. ఆస్ట్రేలియా ఈసారి చాలా పటిష్టంగా కనిపిస్తోంది. ప్రతి స్థానానికి ఒకటికి మించి ఆప్షన్స్ ఉండటంతో తుది జట్టులో ఎవరు ఉంటారనేది ఆసక్తికరంగా మారింది. ఓపెనింగ్ పొజిషన్​కు ట్రావిస్ హెడ్, వార్నర్ రూపంలో సాలిడ్ పెయిర్ అందుబాటులో ఉంది. వీళ్లతో పాటు కెప్టెన్ మిచ్​ మార్ష్​ కూడా ఇన్నింగ్స్​ స్టార్ట్ చేయగలడు. తాను ఓపెనర్​గా రాణిస్తాననే నమ్మకం అతడికి ఉంటే, రైటాండ్ లెఫ్టాండ్ కాంబోతో వెళ్లాలని భావిస్తే హెడ్​తో కలసి మార్ష్ బ్యాటింగ్ మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి. అందుకే వార్నర్ జట్టులో చోటు గురించి పైవిధంగా రియాక్ట్ అయ్యాడు. మరి.. ఈ వరల్డ్ కప్​లో ఆసీస్ ఎంతవరకు వెళ్లగలదని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి