వరల్డ్ కప్​ నిర్వహణతో విండీస్​ బోర్డుకు నష్టం.. వచ్చే డబ్బులు జీతాలకే సరిపోవు!

టీ20 వరల్డ్ కప్ నిర్వహణతో లాభం పొందాలని చూస్తోంది విండీస్ క్రికెట్ బోర్డు. నష్టాల్లో ఉన్న ఆ బోర్డు దాని నుంచి గట్టెక్కడానికి మెగా టోర్నీని వాడుకోవాలని చూస్తోంది. కానీ సీన్ రివర్స్ అయ్యేలా కనిపిస్తోంది.

టీ20 వరల్డ్ కప్ నిర్వహణతో లాభం పొందాలని చూస్తోంది విండీస్ క్రికెట్ బోర్డు. నష్టాల్లో ఉన్న ఆ బోర్డు దాని నుంచి గట్టెక్కడానికి మెగా టోర్నీని వాడుకోవాలని చూస్తోంది. కానీ సీన్ రివర్స్ అయ్యేలా కనిపిస్తోంది.

టీ20 వరల్డ్ కప్-2024కు అంతా సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో మెగా టోర్నీకి తెరలేవనుంది. ప్రపంచ కప్​కు అగ్రరాజ్యం అమెరికాతో పాటు వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తోంది. మ్యాచుల కోసం కావాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. స్టేడియాల ఆధునికీకరణ పూర్తయింది. టోర్నమెంట్ స్టార్ట్ అవడమే ఆలస్యం. ఈ నెలంతా అభిమానులకు కావాల్సిన వినోదం మెగా టోర్నీ ద్వారానే అందనుంది. వరల్డ్ కప్ కోసం అన్ని జట్లు కూడా తాము మ్యాచులు ఆడే లొకేషన్స్​కు చేరుకున్నాయి. దాదాపు అన్ని జట్లు ప్రాక్టీస్​ మ్యాచ్​లు ఆడేశాయి. టోర్నీ ఫేవరెట్లలో ఒకటైన టీమిండియా ఇవాళ బంగ్లాదేశ్​తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. రేపటి నుంచి మెయిన్ మ్యాచెస్ మొదలవనున్నాయి.

వరల్డ్ కప్​కు కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే మెగా టోర్నీ వల్ల ఆతిథ్య విండీస్ బోర్డుకు నష్టం తప్పేలా లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సాధారణంగా చిన్న సిరీస్​ల నిర్వహణ ద్వారా కూడా వందల కోట్ల ఆదాయం సమకూరుతుంది. ఇక ప్రపంచ కప్ లాంటి మెగా టోర్నీల ద్వారా వచ్చే ఆదాయం ఏ రేంజ్​లో ఉంటుందో ఊహించుకోవచ్చు. అయితే ప్రస్తుత వరల్డ్ కప్ ద్వారా విండీస్ బోర్డుకు భారీ ఆదాయం సమకూరట్లేదని తెలుస్తోంది. మెగా టోర్నీని నిర్వహిస్తున్న కరీబియన్ బోర్డు ఖాతాలో రూ.200 కోట్లు వచ్చి చేరతాయని సమాచారం. ఇది మంచి అమౌంటే. కానీ తీవ్ర నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న వెస్టిండీస్ క్రికెట్​కు ఇది సరిపోదని రూమర్స్ వస్తున్నాయి.

ఆటగాళ్ల జీతాల విషయంలో వెస్టిండీస్ బోర్డు ఇబ్బందులు పడటం గురించి వార్తల్లో రావడం వినే ఉంటారు. అక్కడి బోర్డు సరిగ్గా శాలరీలు ఇవ్వడం లేదని కొందరు ప్లేయర్లు దేశం తరఫున ఆడటం మానేసి.. టీ20 లీగ్స్​లో ఆడటం ఎక్కువైంది. భారీ ఆదాయం సమకూరితే తప్ప విండీస్ బోర్డు ఈ సమస్య నుంచి బయటపడటం కష్టంగానే ఉంది. ప్లేయర్ల పెండింగ్ జీతాలు చెల్లించడం, డొమెస్టిక్ క్రికెట్​ డెవలప్​మెంట్​కు ఫండ్స్ రిలీజ్ చేయడం లాంటివి ఆ బోర్డును గుక్కతిప్పుకోకుండా చేస్తున్నాయి. ఈ తరుణంలో వరల్డ్ కప్ నిర్వహణతో సమకూరే ఆదాయంతో ఆర్థిక సమస్యల నుంచి బయటపడదామని భావిస్తే.. అది కూడా జరిగేలా కనిపించడం లేదు. ఐసీసీ నుంచి ఫండ్స్ అందినా కానీ మెగా టోర్నీ నిర్వహణ కోసం కరీబియన్ బోర్డు కూడా భారీగా ఖర్చు చేస్తోందని సమాచారం. ఈ తరుణంలో టోర్నీ ద్వారా భారీ ఆదాయం సమకూరుతుందని బోర్డు ఎక్స్​పెక్ట్ చేసింది. కానీ అంత వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఆ బోర్డుకు నష్టాలు తప్పవని వినిపిస్తోంది. అయితే వెస్టిండీస్​ క్రికెట్​కు ఎంత మొత్తం సమకూరిందనేది మరికొన్ని వారాల్లో తేలిపోనుంది.

Show comments