iDreamPost
android-app
ios-app

వరల్డ్ కప్ ఫస్ట్ మ్యాచ్​లోనే రికార్డుల మోత.. US క్రికెట్​లో గుర్తుండిపోయే రోజు!

  • Published Jun 02, 2024 | 12:06 PM Updated Updated Jun 02, 2024 | 12:06 PM

టీ20 వరల్డ్ కప్​-2024కు అదిరిపోయే ఆరంభం లభించింది. ఫస్ట్ మ్యాచ్​లోనే రికార్డుల మోత మోగింది. ఆతిథ్య అమెరికా క్రికెట్​లో ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే రోజుగా చెప్పొచ్చు.

టీ20 వరల్డ్ కప్​-2024కు అదిరిపోయే ఆరంభం లభించింది. ఫస్ట్ మ్యాచ్​లోనే రికార్డుల మోత మోగింది. ఆతిథ్య అమెరికా క్రికెట్​లో ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే రోజుగా చెప్పొచ్చు.

  • Published Jun 02, 2024 | 12:06 PMUpdated Jun 02, 2024 | 12:06 PM
వరల్డ్ కప్ ఫస్ట్ మ్యాచ్​లోనే రికార్డుల మోత.. US క్రికెట్​లో గుర్తుండిపోయే రోజు!

టీ20 వరల్డ్ కప్​-2024కు అదిరిపోయే ఆరంభం లభించింది. ఫస్ట్ మ్యాచ్​లోనే రికార్డుల మోత మోగింది. ఆతిథ్య అమెరికా క్రికెట్​లో ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే రోజుగా చెప్పొచ్చు. కెనడాతో జరిగిన మ్యాచ్​లో యూఎస్​ఏ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్​కు దిగిన కెనడా ఓవర్లన్నీ ఆడి 5 వికెట్లకు 194 పరుగుల భారీ స్కోరు చేసింది. నవ్​నీత్ ధలివాల్ (44 బంతుల్లో 61), నికోలర్ కిర్టన్ (31 బంతుల్లో 51) సూపర్బ్ నాక్స్​తో అలరించారు. ఆఖర్లో శ్రేయస్ మోవా (16 బంతుల్లో 32 నాటౌట్) ధనాధన్ ఇన్నింగ్స్​తో జట్టుకు బిగ్ స్కోరు అందించాడు. ఆ తర్వాత ఛేజింగ్​కు దిగిన యూఎస్​ఏ 17.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది.

ఆరోన్ జోన్స్ (40 బంతుల్లో 94 నాటౌట్), ఆండ్రీస్ గౌస్ (46 బంతుల్లో 65) విధ్వంసక ఇన్నింగ్స్​లతో అమెరికాకు విజయాన్ని అందించారు. ఓపెనర్ స్టీవెన్ టేలర్ గోల్డెన్ డకౌట్ అయినా.. మరో ఓపెనర్ మోనక్ పటేల్​తో కలసి ఇన్నింగ్స్​ను ముందుకు తీసుకెళ్లాడు ఆండ్రీస్. ఆ తర్వాత జోన్స్​తో జతకలసి కెనడా బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. యూఎస్ ఇన్నింగ్స్​లో మెయిన్ హైలైట్ అంటే ఆరోన్ జోన్స్ ఇన్నింగ్స్ అనే చెప్పాలి. ఈ కరీబియన్ వీరుడు ఏకంగా 10 సిక్సులతో వీరంగం సృష్టించాడు. అతడి మెరుపు ఇన్నింగ్స్ వల్లే భారీ స్కోరును కూడా మరో 14 బంతులు ఉండగానే ఊదిపారేసింది యూఎస్. అందుకే అతడికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

ఛేదనలో ఒక దశలో పరుగులు రాక తీవ్రంగా ఇబ్బంది పడింది అమెరికా. 8 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లకు 48 పరుగులు మాత్రమే చేసింది. ఈ దశలో జూలు విదిల్చిన ఆండ్రీస్, ఆరోన్ జోన్స్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. దీంతో ఆ తర్వాతి 9.4 ఓవర్లలో ఆతిథ్య జట్టు ఏకంగా 149 పరుగులు చేసింది. ఈ విజయం ఆ దేశ క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతుందని చెప్పొచ్చు. ఇప్పుడిప్పుడే జెంటిల్మన్ గేమ్​లో బుడిబుడి అడుగులు వేస్తున్న అగ్రరాజ్యానికి ఈ సక్సెస్​ మెగా టోర్నీలో మరింత ముందుకెళ్లేందుకు దోహదం చేస్తుంది. ఈ మ్యాచ్​తో ఆరోన్ జోన్స్ అరుదైన ఘనత సాధించాడు. వరల్డ్ కప్ హిస్టరీలో తొలి మ్యాచ్​లోనే అత్యధిక సిక్సులు కొట్టిన రెండో బ్యాటర్​గా నిలిచాడు. క్రిస్ గేల్ (11 సిక్సులు) అతడి కంటే ముందంజలో ఉన్నాడు. అమెరికా క్రికెట్ హిస్టరీలో 195 పరుగులు ఛేదించడం ఇదే ఫస్ట్ టైమ్ కావడం మరో రికార్డు. ఇలా మెగా టోర్నీలో ఫస్ట్ మ్యాచ్​ పలు రికార్డులకు వేదికగా నిలిచింది.