Nidhan
T20 World Cup Best Deliveries: టీ20 వరల్డ్ కప్-2024 ముగిసినా టోర్నీలోని విశేషాల గురించి ఇంకా అభిమానులు మాట్లాడుకుంటూనే ఉన్నారు. అన్ని జట్లు ఆడిన తీరు, భారత్ కప్పు ఎగరేసుకుపోయిన విధానం.. ఇలా రకరకాల అంశాలపై డిస్కస్ చేస్తున్నారు.
T20 World Cup Best Deliveries: టీ20 వరల్డ్ కప్-2024 ముగిసినా టోర్నీలోని విశేషాల గురించి ఇంకా అభిమానులు మాట్లాడుకుంటూనే ఉన్నారు. అన్ని జట్లు ఆడిన తీరు, భారత్ కప్పు ఎగరేసుకుపోయిన విధానం.. ఇలా రకరకాల అంశాలపై డిస్కస్ చేస్తున్నారు.
Nidhan
టీ20 వరల్డ్ కప్-2024 ముగిసినా టోర్నీలోని విశేషాల గురించి ఇంకా అభిమానులు మాట్లాడుకుంటూనే ఉన్నారు. అన్ని జట్లు ఆడిన తీరు, భారత్ కప్పు ఎగరేసుకుపోయిన విధానం.. ఇలా రకరకాల అంశాలపై డిస్కస్ చేస్తున్నారు. అన్నింటి కంటే ఎక్కువగా బౌలర్లు ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయారు. టీ20 క్రికెట్ అంటేనే బ్యాటర్లది అనే ముద్ర పడిపోయింది. పొట్టి ఫార్మాట్ మ్యాచుల్లో బ్యాటర్లు బౌండరీలు, సిక్సుల వర్షం కురిపించడం కామన్ అయిపోయింది. టీ20 వరల్డ్ కప్‌లోనూ బ్యాటర్లు కుమ్మేస్తారని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా మెగా టోర్నీ మొత్తం బౌలర్ల హవా నడిచింది. ప్రపంచ కప్‌కు ఆతిథ్యం ఇచ్చిన అమెరికా-వెస్టిండీస్ పిచ్‌లు స్లోగా ఉండటం, పేసర్లతో పాటు స్పిన్నర్లకు వికెట్ నుంచి మద్దతు లభించడంతో చెలరేగిపోయారు. ఒక్కో రన్ తీసేందుకు బ్యాటర్లు ఆపసోపాలు పడ్డారు.
వరల్డ్ కప్‌లో అన్ని జట్ల బౌలర్లు చెలరేగారు. అందరి కంటే తోపు పెర్ఫార్మెన్స్ అంటే టీమిండియా పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రాది అనే చెప్పాలి. మెగాటోర్నీలో ఈ స్పీడ్‌స్టర్ 15 వికెట్లు పడగొట్టాడు. అతడి బౌలింగ్ ఎకానమీ 4.17గా ఉంది. దీన్ని బట్టే ప్రత్యర్థి బ్యాటర్లపై అతడు ఏ రేంజ్లో ఆధిపత్యం చలాయించాడో అర్థం చేసుకోవచ్చు. బుమ్రా బౌలింగ్‌లో పరుగులు చేయడం పక్కనబెడితే.. వికెట్లు కాపాడుకోవడానికి బ్యాటర్లు ఇంపార్టెన్స్ ఇచ్చారు. అయినా వాళ్ల పనిపట్టాడు బుమ్రా. అతడితో పాటు ఇతర పేసర్లు, స్పిన్నర్లు కూడా రాణించడంతో భారత్ కప్పు ఒడిసిపట్టింది. టీమిండియా బౌలర్లతో పాటు మెగాటోర్నీలో ఇతర బౌలర్లు కూడా అద్భుతంగా రాణించారు. వాళ్లందరి పెర్ఫార్మెన్స్ కలిపి టోర్నీలోని బెస్ట్ డెలివరీస్ లిస్ట్‌ను రూపొందించింది ఐసీసీ. అందులో టాప్‌లో బుమ్రా తీసిన వికెట్ నిలిచింది.
ఫైనల్లో సౌతాఫ్రికా ఓపెనర్ రీజా హెండ్రిక్స్‌ను బుమ్రా కళ్లు చెదిరే ఔట్ స్వింగర్‌తో క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఈ బాల్‌ను వరల్డ్ కప్ బెస్ట్ డెలివరీస్ లిస్ట్‌లో టాప్‌లో ఉంచింది ఐసీసీ. సెమీస్‌లో ఆఫ్ఘానిస్థాన్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీని బౌల్డ్ చేశాడు ప్రొటీస్ పేసర్ రబాడ. ఇది సెకండ్ ప్లేస్‌లో నిలిచింది. ఆస్ట్రేలియా విధ్వంసకారుడు గ్లెన్ మాక్స్‌వెల్‌ను స్కాట్లాండ్ స్పిన్నర్ మార్క్ వాట్ చక్కటి డెలివరీతో ఔట్ చేశాడు. ఇది కూడా లిస్ట్‌లో చోటు దక్కించుకుంది. న్యూజిలాండ్ బ్యాటర్ ఫిన్ అలెన్‌ను ఆఫ్ఘాన్ పేసర్ ఫజల్హక్ ఫారుకీ క్లీన్ బౌల్డ్ చేసిన డెలివరీ, ఐర్లాండ్ బ్యాటర్ ఆండ్రూ బాల్బిరిన్ను పాకిస్థాన్ స్పీడ్‌స్టర్ షాహిన్ ఆఫ్రిదీ పర్ఫెక్ట్ ఔట్ స్వింగర్‌తో వెనక్కి పంపిన బంతులు కూడా బెస్ట్ డెలివరీస్ లిస్ట్‌లో టాప్-10లో నిలిచాయి. ఈ జాబితాలో ఉన్నవన్నీ ఒక్కోటి ఒక్కో డైమండ్ అనే చెప్పాలి. మరి.. ఈ వరల్డ్ కప్‌లో మీకు నచ్చిన డెలివరీ ఏదో కామెంట్ చేయండి.