Nidhan
లెజెండరీ పేసర్ జేమ్స్ అండర్సన్ చివరి టెస్టు ఆడేశాడు. వెస్టిండీస్‌తో లార్డ్స్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌తో సుదీర్ఘ కెరీర్‌కు గుడ్‌బై చెప్పేశాడు. అయితే ఆఖరి మ్యాచ్‌లో కూడా అతడు అంతే దీటుగా బౌలింగ్ చేయడం విశేషం.
లెజెండరీ పేసర్ జేమ్స్ అండర్సన్ చివరి టెస్టు ఆడేశాడు. వెస్టిండీస్‌తో లార్డ్స్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌తో సుదీర్ఘ కెరీర్‌కు గుడ్‌బై చెప్పేశాడు. అయితే ఆఖరి మ్యాచ్‌లో కూడా అతడు అంతే దీటుగా బౌలింగ్ చేయడం విశేషం.
Nidhan
లెజెండరీ పేసర్ జేమ్స్ అండర్సన్ చివరి టెస్టు ఆడేశాడు. వెస్టిండీస్‌తో లార్డ్స్ వేదికగా జరిగిన టెస్టుతో సుదీర్ఘ కెరీర్‌కు గుడ్‌బై చెప్పేశాడు. అయితే ఆఖరి మ్యాచ్‌లో కూడా అతడు అంతే దీటుగా బౌలింగ్ చేయడం విశేషం. లార్డ్స్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 10 ఓవర్లు వేసి 1 వికెట్ మాత్రమే తీశాడు అండర్సన్. అయితే రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం చెలరేగిపోయాడు. 16 ఓవర్లలో 32 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. విండీస్ ఓపెనర్ క్రెయిగ్ బ్రాత్‌వైట్‌తో పాటు అలిక్ అతాన్జే, జోషువా డసిల్వాను ఔట్ చేశాడీ ఇంగ్లండ్ బౌలర్. అండర్సన్ ఏకంగా 7 మెయిడిన్లు వేయడం విశేషం. క్రెయిగ్‌ను అతడు ఔట్ చేసిన విధానం మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.
అండర్సన్ వేసిన బంతి ఆఫ్‌స్టంప్‌కు బయట పడగా దాన్ని డిఫెన్స్ చేయబోయాడు క్రెయిగ్. కానీ లేట్‌గా ఆడటంతో బంతి అతడి బ్యాట్‌ను దాటుకొని వెళ్లి వికెట్లను గిరాటేసింది. బాల్ అంత స్వింగ్ అవుతుందని క్రెయిగ్ ఊహించలేదు. ఈ వికెట్‌తో పాటు మరో ఇద్దరు విండీస్ బ్యాటర్లను అండర్సన్ ఔట్ చేయడంతో ఇంగ్లండ్ ఫ్యాన్స్ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. 188 టెస్టులు ఆడాక కూడా ఇంత పవర్ఫుల్ బౌలింగ్ వేయడం అంటే మాటలు కాదంటూ ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. ఇప్పుడే ఇలా బౌలింగ్ చేస్తున్నాడంటే కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు అండర్సన్ ఏ లెవల్లో బ్యాటర్లతో ఆడుకున్నాడో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. అందుకే అతడ్ని గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అంటారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక, ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 114 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి అండర్సన్‌కు గ్రేట్ ఫేర్వెల్ ఇచ్చింది. మరి.. అండర్సన్ సూపర్ బాల్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.
Jimmy Anderson, there are no words 🤯 pic.twitter.com/bBRCS1uykD
— England Cricket (@englandcricket) July 11, 2024