iDreamPost
android-app
ios-app

Gulbadin Naib: ఆఫ్గాన్ ప్లేయర్ చీటింగ్.. ICC సీరియస్? కఠిన చర్యలు తప్పవా?

  • Published Jun 26, 2024 | 10:14 AM Updated Updated Jun 26, 2024 | 10:14 AM

బంగ్లాతో జరిగిన మ్యాచ్ లో ఆఫ్గాన్ ఆల్ రౌండర్ గుల్బాదిన్ నైబ్ చేసిన యాక్టింగ్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ విషయంపై ఐసీసీ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. దాంతో నైబ్ పై కఠిన చర్యలు తప్పవా? అంటూ కొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

బంగ్లాతో జరిగిన మ్యాచ్ లో ఆఫ్గాన్ ఆల్ రౌండర్ గుల్బాదిన్ నైబ్ చేసిన యాక్టింగ్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ విషయంపై ఐసీసీ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. దాంతో నైబ్ పై కఠిన చర్యలు తప్పవా? అంటూ కొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

Gulbadin Naib: ఆఫ్గాన్ ప్లేయర్ చీటింగ్.. ICC సీరియస్? కఠిన చర్యలు తప్పవా?

టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా జరిగిన ఆఫ్గానిస్తాన్-బంగ్లాదేశ్ మ్యాచ్ ప్రేక్షకులకు ఫుల్ కక్కిచ్చింది. చివరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠతతో కొనసాగిన ఈ పోరులో చివరికి 8 పరుగుల స్వల్ప తేడాతో ఆఫ్గాన్ సంచలన విజయాన్ని నమోదు చేసింది. దాంతో తొలిసారి ప్రపంచ కప్ సెమీ ఫైనల్లోకి అడుగుపెట్టింది. కాగా.. ఈ మ్యాచ్ లో ఆఫ్గాన్ ఆల్ రౌండర్ గుల్బాదిన్ నైబ్ చేసిన యాక్టింగ్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ విషయంపై ఐసీసీ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. దాంతో నైబ్ పై కఠిన చర్యలు తప్పవా? అంటూ కొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్గానిస్తాన్ 20 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ ను ఆఫ్గాన్ బౌలర్లు నిలువరించారు. టార్గెట్ ను రీచ్ అయ్యే క్రమంలో బంగ్లా 11.4 ఓవర్లలో 81/7 స్కోర్ తో ఉంది. ఈ క్రమంలో చినుకులు ప్రారంభం అయ్యాయి. ఈ టైమ్ కు ఆఫ్గాన్ డక్ వర్త్ లూయిస్ ప్రకారం 2 పరుగులు ముందుంది. భారీ వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే 2 రన్స్ తేడాతో ఆఫ్గాన్ విజయం సాధిస్తుంది. అయితే అప్పుడే చిన్న చిన్న చినుకులు పడుతున్నా గానీ.. ఆ ఓవర్ ను ఫినిష్ చేయాలని అంపైర్లు భావించారు. ఈ ఓవర్లో నాలుగు బంతులు వేసిన నూర్ అహ్మద్ ను ఓవర్ పూర్తి చేయాల్సిందిగా అంపైర్లు ఆదేశించారు.

ఈ క్రమంలో ఆ రెండు బంతుల్లో బంగ్లా బ్యాటర్ ఫోర్ కొడితే.. డక్ వర్త్ లూయిస్ ప్రకారం రెండు పరుగుల తేడాతో బంగ్లాదేశ్ విజయం సాధిస్తుంది. ఇది తెలిసిన ఆఫ్గాన్ కోచ్ జోనాథన్ ట్రాట్ ఆలస్యం చేయాలని భావించి.. డగౌట్ నుంచి డౌన్ డౌన్ అంటూ సిగ్నల్ ఇచ్చాడు. ఇది గమనించిన గుల్బాదిన్ నైబ్ ఒక్కసారిగా కిందపడిపోయాడు. కండరాలు పట్టేశాయని నొప్పితో విలవిలలాడాడు. వెంటనే ఫిజియో వచ్చి.. అతడికి చికిత్స అందిస్తుండగా.. వర్షం ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. ఇది జరిగిన 10 నిమిషాలకే బౌలింగ్ చేశాడు నైబ్. దాంతో అతడు చీటింగ్ చేశాడంటూ.. పెద్ద ఎత్తున విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి.

ఇక ఈ విషయంపై ఐసీసీ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఐసీసీ ప్రవర్తనా నియమావళి ప్రకారం.. ఉద్దేశపూర్వకంగా టైమ్ ను వేస్ట్ చేయకూడదు. అలా చేస్తే.. ఆర్టికల్ 2.10.7 ప్రకారం లెవల్ 1 లేదా 2 నేరంగా మ్యాచ్ రిఫరీ ప్రకటిస్తాడు. లెవల్ 1 నేరానికి మ్యాచ్ ఫీజులో 100 శాతం జరిమానా, రెండు సస్పెషన్ పాయింట్లు విధించే అవకాశం ఉంది. ఇక అంతర్జాతీయ టీ20ల్లో 41.9 ప్రకారం బౌలర్ లేదా ఫీల్డర్ సమయాన్ని వృథా  చేస్తే.. ఆ జట్టుకు ఐదు పాయింట్లు పెనాల్టీ విధిస్తారు అంపైర్లు. కానీ ఈ మ్యాచ్ లో అలా జరగలేదు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.