iDreamPost
android-app
ios-app

వీడియో: ఆసీస్ పై చారిత్రక విజయం.. ఓ రేంజ్ లో ఆఫ్గాన్ ప్లేయర్ల సెలబ్రేషన్స్!

  • Published Jun 23, 2024 | 6:28 PM Updated Updated Jun 23, 2024 | 6:28 PM

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియాపై సాధించిన చిరస్మరణీయ విజయం తర్వాత.. ఆఫ్గాన్ ప్లేయర్లు ఓ రేంజ్ లో విజయోత్సవాలు చేసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మాారాయి.

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియాపై సాధించిన చిరస్మరణీయ విజయం తర్వాత.. ఆఫ్గాన్ ప్లేయర్లు ఓ రేంజ్ లో విజయోత్సవాలు చేసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మాారాయి.

వీడియో: ఆసీస్ పై చారిత్రక విజయం.. ఓ రేంజ్ లో ఆఫ్గాన్ ప్లేయర్ల సెలబ్రేషన్స్!

అంతర్జాతీయ క్రికెట్ లో ఇప్పుడిప్పుడే పెద్ద జట్టుగా ఎదుగుతూ వస్తోంది ఆఫ్గానిస్తాన్. ఈ క్రమంలో పెను సంచలనాలు నమోదు చేస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో అండర్ డాగ్ గా బరిలోకిదిన ఈ టీమ్.. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. సూపర్ 8 కు చేరుకుంది.  లీగ్ దశలో న్యూజిలాండ్ లాంటి గట్టి జట్టును ఓడించింది. తాజాగా వరల్డ్  ఛాంపియన్ ఆస్ట్రేలియాకు ఊహించని షాకిచ్చింది. కీలకమైన మ్యాచ్ లో 21 రన్స్ తేడాతో కంగారులను మట్టికరిపించింది ఆఫ్గాన్. దాంతో తమ సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఇక ఆసీస్ పై చారిత్రక విజయంతో ఆఫ్గానిస్తాన్ లో సంబరాలు అంబరాన్ని అంటాయి. ఇక ఆటగాళ్లు అయితే ఓ రేంజ్ లో సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఆస్ట్రేలియాపై సాధించిన చారిత్రక విజయంతో.. ఆఫ్గానిస్తాన్ దేశంలో సంబరాలు అంబరాన్ని తాకాయి. ఆ దేశ ప్రజలు వీధుల్లోకి వచ్చి.. టపాసులు కలుస్తూ.. కేరింతలు కొడుతూ.. తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఇక ఈ మ్యాచ్ హీరో గుల్బాదిన్ నైబ్ ను సహచర ఆటగాళ్లు భుజాలపైకి ఎక్కించుకుని డ్రెస్సింగ్ రూమ్ కు తీసుకెళ్లి.. సంబరాలు చేసుకున్నారు. ఇదిలా ఉండగా.. బస్ లో ఆఫ్గాన్ ప్లేయర్లు ఓ రేంజ్ లో సెలబ్రేషన్స్ జరుపుకొన్నారు. డీజే బ్రావో సాంగ్ పెట్టి కదులుతున్న బస్ లోనే డ్యాన్స్ లు చేశారు. ఛాంపియన్స్.. ఛాంపియన్స్.. డీజే బ్రావో అంటూ చిందులు వేశారు. ప్రస్తుతం వారి సెలబ్రేషన్ వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఆసీస్ పై గెలిచిన చరిత్ర లేదు ఆఫ్గాన్. తాజాగా సాధించిన చారిత్రక విజయంతో.. తమ సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. మరి ఆఫ్గాన్ ఆటగాళ్లు చేసుకున్న గెలుపు సంబరాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Mohammad Nabi (@mohammadnabi07)