iDreamPost
android-app
ios-app

AFG vs BAN: సంచలనం.. సెమీస్ కు దూసుకెళ్లిన ఆఫ్ఘనిస్తాన్! బంగ్లా పై థ్రిల్లింగ్ విక్టరీ

  • Published Jun 25, 2024 | 11:15 AM Updated Updated Jun 25, 2024 | 11:15 AM

టీ20 వరల్డ్ కప్ లో పెను సంచలనం నమోదు అయ్యింది. సెమీస్ కు చేరాలంటే గెలవాల్సిన మ్యాచ్ లో ఆఫ్గాన్ టీమ్ గొప్పగా రాణించింది. బంగ్లాదేశ్ ను 8 పరుగులతో ఓడించి.. సెమీస్ కు దూసుకెళ్లింది. దాంతో వరల్డ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా ఇంటిదారి పట్టింది.

టీ20 వరల్డ్ కప్ లో పెను సంచలనం నమోదు అయ్యింది. సెమీస్ కు చేరాలంటే గెలవాల్సిన మ్యాచ్ లో ఆఫ్గాన్ టీమ్ గొప్పగా రాణించింది. బంగ్లాదేశ్ ను 8 పరుగులతో ఓడించి.. సెమీస్ కు దూసుకెళ్లింది. దాంతో వరల్డ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా ఇంటిదారి పట్టింది.

AFG vs BAN: సంచలనం.. సెమీస్ కు దూసుకెళ్లిన ఆఫ్ఘనిస్తాన్! బంగ్లా పై థ్రిల్లింగ్ విక్టరీ

టీ20 వరల్డ్ కప్ లో పెను సంచలనం నమోదు అయ్యింది. ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ లకు షాకిస్తూ.. ఆఫ్గానిస్తాన్ టీ20 వరల్డ్ కప్ 2024లో సెమీస్ కు చేరుకుంది. బంగ్లాదేశ్ తో జరిగిన కీలకమైన మ్యాచ్ లో 8 పరుగుల తేడాతో అద్భుతమైన విజయం సాధించింది. ఆఫ్గాన్ ఈ విజయంతో సెమీస్ కు చేరగా.. వరల్డ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా ఇంటిదారి పట్టింది. ఈ మ్యాచ్ కు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

ఆఫ్గానిస్తాన్.. టీ20 వరల్డ్ కప్ 2024లో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా లాంటి జట్లకు షాకిస్తూ.. సెమీస్ కు దూసుకెళ్లింది. తాజాగా బంగ్లాదేశ్ తో జరిగిన కీలకమైన మ్యాచ్ లో 8 పరుగుల స్వల్ప తేడాతో సంచలన విజయాన్ని నమోదు చేసింది ఆఫ్గాన్. ఈ మ్యాచ్ కు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్గానిస్తాన్ కు మరోసారి శుభారంభాన్ని ఇచ్చారు ఓపెనర్లు గుర్బాజ్-జద్రాన్ లు వీరిద్దరు తొలి వికెట్ కు 59 పరుగులు జోడించారు.

అనంతరం రిషద్ హుస్సేన్ బౌలింగ్ లో జద్రాన్(18) ఔట్ అయ్యాడు. ఆ తర్వాత బంగ్లా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో.. పరుగులు చేయడంలో ఇబ్బంది పడ్డారు ఆఫ్గాన్ బ్యాటర్లు. జట్టులో గుర్బాజ్(43), చివర్లో కెప్టెన్ రషీద్ ఖాన్ 10 బంతుల్లో 3 సిక్సులతో 19 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. దాంతో 20 ఓవర్లలో ఆఫ్గాన్ 5 వికెట్లు నష్టపోయి 115 పరుగులు చేసింది. అనంతరం మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించడంతో.. డక్ వర్త్ లూయిస్ ప్రకారం 19 ఓవర్లకు బంగ్లా టార్గెట్ ను 114 పరుగులుగా నిర్ణయించారు.

కాగా.. 115 పరుగుల స్వల్ప టార్గెట్ తో బరిలోకి దిగిన బంగ్లాకు చుక్కలు చూపించారు ఆఫ్గాన్ బౌలర్లు రషీద్ ఖాన్, నవీన్ ఉల్ హక్. వీరి ధాటికి.. 105 పరుగులకే బంగ్లా కుప్పకూలింది. తంజిత్ హసన్(0), షాంటో(5), షకీబ్ అల్ హసన్(0), సౌమ్య సర్కార్(10), తౌహిద్ హృదోయ్(14), మహ్మదుల్లా(6), రిషద్(0)లతో పాటుగా మిగతావారు రాణించలేదు. దాంతో చివరి వరకూ నరాలు తెగే ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో 8 పరుగుల స్వల్ప తేడాతో ఆఫ్గాన్ విజయం సాధించింది. జట్టులో ఓపెనర్ లిట్టన్ దాస్ ఒక్కడే 54 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. రషీద్ ఖాన్, నవీన్ ఉల్ హక్ తలా 4 వికెట్లు పడగొట్టి బంగ్లా పతనాన్ని శాసించారు. ఇక ఈ విజయంతో ఆఫ్గాన్ సెమీస్ కు దూసుకెళ్లగా.. వరల్డ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా ఇంటిదారి పట్టింది. మరి అంచనాలను తలకిందులు చేస్తూ..  సెమీస్ కు దూసుకెళ్లిన ఆఫ్గానిస్తాన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.