Nidhan
టీ20 వరల్డ్ కప్-2024 మరో సంచలన ప్రదర్శనకు వేదికగా నిలిచింది. ఆఫ్ఘానిస్థాన్ పేసర్ ఫారుకీ నిప్పులు చెరిగే బంతులతో మెగా టోర్నీకి మరింత ఊపు తీసుకొచ్చాడు.
టీ20 వరల్డ్ కప్-2024 మరో సంచలన ప్రదర్శనకు వేదికగా నిలిచింది. ఆఫ్ఘానిస్థాన్ పేసర్ ఫారుకీ నిప్పులు చెరిగే బంతులతో మెగా టోర్నీకి మరింత ఊపు తీసుకొచ్చాడు.
Nidhan
టీ20 వరల్డ్ కప్-2024 సంచలనాలకు వేదికగా మారింది. మెగా టోర్నీ ఫస్ట్ డే నుంచి మ్యాచ్‌లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. తొలి రోజే నమీబియా-ఒమన్ మ్యాచ్ టై అయింది. ఇప్పుడు మరో సంచలన ప్రదర్శనకు వేదికగా నిలిచింది ప్రపంచ కప్. ఆఫ్ఘానిస్థాన్ పేసర్ ఫజల్హక్ ఫారుకీ నిప్పులు చెరిగే బంతులతో మెగా టోర్నీకి మరింత ఊపు తీసుకొచ్చాడు. పసికూన ఉగాండాను వణికించాడతను. ఆ టీమ్‌తో జరిగిన మ్యాచ్‌లో సంచలన బౌలింగ్‌తో చెలరేగిపోయాడు. 4 ఓవర్లు వేసిన ఫారుకీ.. కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఉగాండాతో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘానిస్థాన్ మొదట బ్యాటింగ్‌కు దిగింది. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది.
ఓపెనర్లు రెహ్మానుల్లా గుర్బాజ్ (76), ఇబ్రహీం జాద్రాన్ (70) చెలరేగి బ్యాటింగ్ చేశారు. తొలి వికెట్‌కు 14.3 ఓవర్లలోనే ఏకంగా 154 పరుగులు జోడించారు. ఆ తర్వాత వచ్చిన వాళ్లు హిట్టింగ్‌కు వెళ్లి త్వరగా ఔట్ అయ్యారు. అనంతరం ఛేజింగ్ మొదలుపెట్టిన ఉగాండా.. 16 ఓవర్లలో 58 పరుగులకే చాప చుట్టేసింది. ఆ జట్టు ఇన్నింగ్స్‌లో ఒక్క రాబిన్సన్ ఒబుయా (14) తప్పితే ఎవ్వరూ రెండంకెల స్కోరు చేయలేదు. ఆఫ్ఘాన్ పేసర్ ఫారుకీ బుల్లెట్ పేస్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను భయపెట్టాడు. ఇద్దర్ని క్లీన్‌బౌల్డ్ చేశాడు. అతడి దెబ్బకు క్రీజులో నిలబడేందుకు కూడా వాళ్లు వణికిపోయారు. ఫజల్హక్తో పాటు మ్యాంగో మ్యాన్ నవీనుల్ హక్, కెప్టెన్ రషీద్ ఖాన్ చెరో 2 వికెట్లతో సత్తా చాటారు. ఈ మ్యాచ్‌తో ఫజల్హక్ అరుదైన ఘనత సాధించాడు. పొట్టి కప్పు హిస్టరీలో ఆఫ్ఘాన్ తరఫున బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ నమోదు చేసిన బౌలర్‌గా రికార్డ్ క్రియేట్ చేశాడు. అలాగే టీ20 ప్రపంచ కప్-2024లో 5 వికెట్లు తీసిన ఫస్ట్ బౌలర్‌గానూ నిలిచాడు.
WHAT A SPELL, FAZALHAQ FAROOQI: 4-0-9-5 🚀
– Best bowling figures by an Afghanistan bowler in T20I World Cup history. pic.twitter.com/KCkpql9Ohk
— Johns. (@CricCrazyJohns) June 4, 2024