iDreamPost

వీడియో: గెటప్ మార్చి ఫ్యాన్స్​కు షాకిచ్చిన భారత స్టార్.. ఇతడ్ని గుర్తుపట్టండి చూద్దాం!

  • Published Jun 04, 2024 | 8:55 AMUpdated Jun 04, 2024 | 8:55 AM

ఒక టీమిండియా స్టార్ గెటప్ మార్చి అభిమానులకు షాక్ ఇచ్చాడు. అస్సలు గుర్తుపట్టని విధంగా ఉన్న ఆ ప్లేయర్​ను చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు.

ఒక టీమిండియా స్టార్ గెటప్ మార్చి అభిమానులకు షాక్ ఇచ్చాడు. అస్సలు గుర్తుపట్టని విధంగా ఉన్న ఆ ప్లేయర్​ను చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు.

  • Published Jun 04, 2024 | 8:55 AMUpdated Jun 04, 2024 | 8:55 AM
వీడియో: గెటప్ మార్చి ఫ్యాన్స్​కు షాకిచ్చిన భారత స్టార్.. ఇతడ్ని గుర్తుపట్టండి చూద్దాం!

ఐపీఎల్-2024 నుంచి ఇప్పుడు అందరి ఫోకస్ టీ20 వరల్డ్ కప్-2024 వైపు మళ్లింది. ఒకదాన్ని మించిన మరో జట్టు బరిలో ఉండటంతో ఎవరు విజేతగా నిలుస్తారోననేది ఇంట్రెస్టింగ్​గా మారింది. మెగా టోర్నీ ఆసక్తికరంగా సాగుతోంది. ఫస్ట్ మ్యాచ్​లోనే పలు రికార్డులు బద్దలయ్యాయి. యూఎస్​ఏ-కెనడా మ్యాచ్​లో ఆరోన్ జోన్స్ విధ్వంసక ఇన్నింగ్స్​తో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఆ తర్వాత నమీబియా-ఒమన్ మ్యాచ్ టై కావడం.. వెస్టిండీస్-పపువా న్యూగినియా మ్యాచ్​ కూడా ఆఖరి ఓవర్ వరకు వెళ్లడంతో అందరూ ఇప్పుడు టీ20 ప్రపంచ కప్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఇంకా భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లాంటి బడా జట్లు ఆడలేదు. వాటి మ్యాచ్​లు కూడా మొదలైతే అసలైన మజా వస్తుంది. ముఖ్యంగా టీమిండియా-పాకిస్థాన్ మ్యాచ్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు.

భారత్-పాక్ మ్యాచ్ కోసం అందరూ వెయిట్ చేస్తున్న తరుణంలో ఓ టీమిండియా స్టార్ గెటప్ మార్చి అందరికీ షాకిచ్చాడు. నెరిసిన జట్టు, భారీ గడ్డం, నెత్తికి క్యాప్​, స్థానికుల వేషధారణతో ముసలివాడిలా కనిపించి అందర్నీ సర్​ప్రైజ్ చేశాడు లెజెండ్ యువరాజ్ సింగ్. పర్వత ప్రాంతంలో క్రికెట్ ఆడుతున్న యువకుల దగ్గరకు వెళ్లాడు. వృద్ధుడిలా మేకప్ వేసుకొని వెళ్లడంతో అతడ్ని ఎవరూ గుర్తుపట్టలేకపోయారు. ఆ తర్వాత తాను కూడా ఆడతానంటూ బ్యాట్ పట్టుకున్నాడు. మొదట్లో బంతిని డిఫెన్స్ చేస్తూ బ్యాటింగ్ రానట్లు యాక్ట్ చేశాడు. ఆ తర్వాత తన ట్రేడ్ మార్క్ షాట్స్​ కొడుతూ వాళ్లను భయపెట్టాడు. బంతి పడితే చాలు సిక్సులు వెళ్లడంతో కుర్రాళ్లు షాకయ్యారు. ఈ ముసలాయన ఇలా ఎలా కొడుతున్నాడు? అంటూ బిత్తరపోయారు.

యువకులు అలా షాక్​లో ఉండగానే యువరాజ్ బ్యాటింగ్ ఆపేసి తన మేకప్​ను తొలగించాడు. దీంతో అక్కడున్న వాళ్లు మరింత ఆశ్చర్యానికి గురయ్యారు. తాము చూస్తోంది నిజమేనా అంటూ షాకయ్యారు. నమ్మశక్యం కానట్లు చూస్తూ ఉండిపోయారు. ఆ తర్వాత అతడితో కలసి సెల్ఫీలు దిగారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఇది ఒక అడ్వర్టయిజ్​మెంట్ కోసం చేసిన వీడియో కావడం గమనార్హం. ఇక, టీ20 ప్రపంచ కప్​కు యువరాజ్ అంబాసిడర్​గా ఎంపికైన విషయం తెలిసిందే. దీంట్లో భాగంగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు యువీ. త్వరలో జరగనున్న భారత్-పాక్ మ్యాచ్ మీద అతడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ మ్యాచ్​లో గెలిచినా, ఓడినా అందరి ఫోకస్ రోహిత్ సేన మీదే ఉంటుందన్నాడు. మ్యాచ్ రోజు ఎవరైతే ఎమోషన్స్​ను కంట్రోల్ చేసుకుంటారో వాళ్లదే విజయమని యువీ తెలిపాడు.

 

View this post on Instagram

 

A post shared by Krishhari10 (@kris.hhari10)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి